• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఆ కుటుంబాలకు రూ.30లక్షల పరిహారం’

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మురుగును శుభ్రం చేసే కార్మికులు మృతిచెందితే వారి కుటుంబాలకు పరిహారం అందజేయాలని ఆదేశించింది. దేశంలో మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ కార్మికులు చనిపోతున్నారని పిటిషన్ దాఖలైంది. దానిపై న్యాయస్థానం విచారణ జరిపింది. మురుగు శుభ్రం చేస్తూ కార్మికులు మృత్యువాతపడితే వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.30లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశించింది.

    పాలస్తీనా పౌరుల మృతిపై మోదీ సంతాపం

    పాలస్తీనియన్‌ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌తో భారత్ ప్రధాని మోదీ మాట్లాడారు. గాజా ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో పౌరుల ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల సంతాపాన్ని తెలిపారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు భారత్‌ మానవతా సాయాన్ని పంపిస్తూనే ఉంటుందని హామీ ఇచ్చారు. గాజాలో ఉగ్రవాదం, హింస, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై ఆందోళనను వ్యక్తం చేశారు ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటిస్తామని మోదీ పేర్కొన్నారు. .

    మోదీ వైఖరిపై కాంగ్రెస్ అసంతృప్తి

    ఇజ్రాయెల్‌-పాలస్తీనాల సంక్షోభంపై భారత వైఖరిని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఈ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీరు మొదటి నుంచి భిన్నంగా ఉందని చెప్పింది.‘పాలస్తీనా హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటానికి భారత్‌ మద్దతుగా నిలిచేది. దాడుల విషయానికొస్తే వాటిని తీవ్రంగా ఖండించేంది. ప్రస్తుతం భారత వైఖరి మాత్రం యుద్ధానికి ముగింపు పలికేలా లేదు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా విషయంపై భారత్‌ తన వైఖరిని హుందాగా, గౌరవప్రదమైన రీతిలో వెల్లడించాలి’అని కాంగ్రెస్ పేర్కొంది.

    ఉద్యోగులకు నోకియా షాక్

    నోకియా సంస్థ తమ ఉద్యోగులకు షాకివ్వనుంది.ఈ మేరకు ఆ సంస్థ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఖర్చు తగ్గించుకునేందుకు 14 వేల మంది సిబ్బందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది. ఈ తొలగింపులు దశలవారీగా ఉంటాయని నోకియా వెల్లడించింది. మార్కెట్‌లో నోకియా 5జీ పరికరాలకు డిమాండ్‌ తగ్గింది. దీంతో మూడో త్రైమాసికంలో విక్రయాలు 20 శాతం తగ్గుముఖం పట్టాయి. దీంతో ఖర్చుల్ని తగ్గించుకోవాలని నోకియా నిర్ణయించుకుంది.

    నిజమే.. నిజమే గెలుస్తుంది: అంబటి

    చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో యాత్ర చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అంబటి అన్నారు. ‘నిజమే.. అందరం నిజం గెలవాలనే కోరుకుంటున్నాం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నిజం గెలుస్తుంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు. గత 45 రోజుల నుంచి నిజమే గెలుస్తోంది కాబట్టే చంద్రబాబు ఇంకా జైళ్లో ఉన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు 17ఏ సాకుగా చూపి బయటపడేందుకు పాకులాడుతున్నారు అని అంబటి ఆరోపించారు.

    కేసీఆర్‌పై రాహుల్ గాంధీ ఫైర్

    తెలంగాణలో దొరల పాలన సాగుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ విజయభేరి సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.. నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చిందన్నారు. కేసీఆర్‌ గతంలో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడం మర్చిపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ తెలంగాణలో కూడా నెరవేరుస్తామని రాహుల్‌ గాంధీ అన్నారు.

    ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యార్థి ఆత్మహత్య

    ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. అక్కడ తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్‌ గదిలో ఉరి వేసుకొని బలవన్మరణం పొందాడు. మెదక్‌ జిల్లాకు చెందిన కిరణ్ చంద్ర ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, విద్యార్థి ఆత్మహత్యకు కారణం ఏంటని తెలియలేదు.

    రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌

    కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులకు, రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు డీఏను 4 శాతం, రైల్వే ఉద్యోగులకు బోనస్‌ చెల్లింపులకు చేస్తున్నట్లు ప్రకటించింది. రైతుల విషయానికి వస్తే గోధుమలకు కనీస మద్దతు ధరను క్వింటాకు రూ.150 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ సమావేశంలో చర్చలు జరిగాయి,