• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భాజపాకు నటి గౌతమి రాజీనామా

    చెన్నై: భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు సినీ నటి గౌతమి ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నుంచి తనకు ఎటువంటి సహకారం లభించడం లేదని తెలిపారు. పైగా ఆర్థిక లావాదేవీల విషయంలో తనను మోసం చేసిన వ్యక్తికి కొంతమంది సీనియర్‌ నేతలు అండగా నిలిచినట్లు ఆరోపించారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇస్తానని చెప్పి మెుడిచెయ్యి చూపించారని గౌతమి అన్నారు. కాగా, స్థిరాస్తుల విషయంలో తనను అళగప్పన్‌ అనే వ్యక్తి మోసం చేశాడని ఇటీవల ఆమె పోలీసులకు … Read more

    సరిహద్దుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

    జమ్ముకశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పాక్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కాల్పులు తర్వాత సంఘటనా స్థలంలో బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో మరో ఇద్దరు ఉగ్రవాదులు గాయపడ్డట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ప్రస్తుతం ఆపరేషన్‌ను నిలిపివేసినట్లు అర్మీ అధికారులు తెలిపారు.

    భర్త చేతిలో మహిళా కానిస్టేబుల్‌ హత్య

    బిహార్‌ రాజధాని పాట్నాలో ఓ మహిళా కానిస్టేబుల్‌ను కట్టుకున్న భర్తనే దారుణంగా కాల్చి చంపాడు. ఉద్యోగం వల్ల ఇంట్లో ఎక్కువ సమయం ఉండటం లేదన్న కోపంతో ఆమె హత్య చేశాడు. జెహనాబాద్‌కు చెందిన గజేంద్ర యాదవ్‌కు ఆరేళ్ల క్రితం శోభాకుమారి (23)తో పెళ్లి జరిగింది. శోభ ఇటీవలే పోలీసు కొలువులో చేరింది. ఉద్యోగంతో బిజీగా మారిన ఆమెతో గజేంద్ర తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో బుక్‌ చేసిన హోటల్‌ గదికి పిలిపించి భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. ఘటనపై కేసు నమోదు చేసిన … Read more

    ఇన్‌స్టాలో కొత్త ఫీచర్

    ఇన్‌స్టాగ్రామ్‌ మరో ఫీచర్‌ని తీసుకురానుంది. కామెంట్‌ సెక్షన్‌లో పోల్స్‌ పెట్టేలా ఫీచర్‌ని తీసుకువచ్చేందుకు సిద్దమైంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆడమ్‌ మోస్సేరి తెలిపారు. దీనికి సంబంధిత ఫొటోను ఇన్‌స్టా యూజర్లతో ఆయన పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని కామెంట్‌ సెక్షన్‌ను ఆసక్తిగా తీర్చిదిద్దేందుకు ఇన్‌స్టా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇప్పటికే ఇన్‌స్టా స్టోరీల్లో పోల్స్‌ నిర్వహించేందుకు అవకాశం ఉంది.

    ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ శుభాకాంక్షలు

    ఇస్రో గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా నేడు టీవీ-డీ1 పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఈ విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘గగన్‌యాన్ సాకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు’ అని మోదీ పేర్కొన్నారు. అయితే నేడు నింగిలోకి వెళ్లిన రాకెట్ నుంచి మాడ్యూల్ విడిపోయి పారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది.

    22 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ దసరా సేల్

    ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌తో ముందుకొచ్చింది. బిగ్ దసరా సేల్‌ ఈనెల 22 నుంచి 29 వరకు కొనసాగనుంది. ఫ్లిప్‌కార్స్ ప్లస్ మెంబర్లకు ఒకరోజు ముందుగానే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. బిగ్‌ దసరా సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ, కొటాక్, ఆర్‌బీఎల్, ఎస్‌బీఐ కార్డు హోల్డర్లకు 10శాతం డిస్కౌంట్ పొందే అవకాశం కల్పించింది. సూపర్ కాయిన్స్ ద్వారా మరో 5శాతం అదనపు డిస్కౌంట్ అయితే పొందవచ్చు. దీని తర్వాత దీవాళికి మరో సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహించనుంది.

    టాస్ గెలిచిన నెదర్లాండ్

    లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ నెగ్గిన నెదర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు: శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(w/c), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దుషన్ హేమంత, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ … Read more

    నేడు నింగిలోకి గగన్‌యాన్ ప్రయోగం

    ISRO మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. గగన్‌యాన్‌ ప్రోగ్రామ్‌లో వినియోగించే ఫ్లైట్‌ టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌-1 (TV-D1) వాహకనౌక తొలి పరీక్షను నేడు నిర్వహించనుంది. దీని ద్వారా ‘క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును పరీక్షించారు. ఈ వాహకనౌకకు సంబంధించిన అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. ఉదయం 8 గంటలకు దీనిని నింగిలోకి తీసుకెళ్లి అందులోని క్రూ మాడ్యూల్‌ సముద్రంలో పడిపోయేలా చేస్తారు.

    రేపు నింగిలోకి గగన్‌యాన్

    ISRO మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. గగన్‌యాన్‌ ప్రోగ్రామ్‌లో వినియోగించే ఫ్లైట్‌ టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌-1 (TV-D1) వాహకనౌక తొలి పరీక్షను నిర్వహించనుంది. దీని ద్వారా ‘క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును పరీక్షించారు. ఈ వాహకనౌకకు సంబంధించిన అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. రేపు ఉదయం 8 గంటలకు దీనిని నింగిలోకి తీసుకెళ్లి అందులోని క్రూ మాడ్యూల్‌ సముద్రంలో పడిపోయేలా చేస్తారు.

    వాట్సాప్‌లో మరో ‘వ్యూ వన్’ ఫీచర్

    వాట్సాప్ మారో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇటీవల తీసుకువచ్చిన ‘వ్యూ వన్ ఫీచర్’ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఏదైన ఫొటోలను మీడియోను ఒకసారి మాత్రమే చూడోచ్చు దాన్ని స్క్రీన్‌షాట్ చేయడం కూడా కుదరదు. ఇప్పుడు ఇదే ఫిచర్‌ను వాయిస్ నోట్ ఫార్మాట్‌కు కూడా తీసుకువచ్చింది. వాయిస్ రికార్డును సెండ్ చేసే సమయంలో వ్యూ వన్ ఆప్షన్ ఎంచుకుంటే అది ఒకసారి మాత్రమే వినడానికి వీలుంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.