• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్ 6 క్యారెంటీ కార్టులకు పూజలు

    నేడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించారు. ముందుగా పాలంపేటలోని పార్టీ సీనియర్ నేతలతో కలిసి రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీ కార్టులను రామప్ప స్వామి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు.

    ఆసుపత్రిపై దాడి: మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

    గాజాలో ఆసుపత్రి దాడి ఘటనపై భారత ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్ అహ్లీ ఆసుపత్రిలో ప్రాణనష్టంపై బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న ఘర్షనల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆసుపత్రిపై దాడిలో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

    నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 102 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 66,325 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 18 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 19,792 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, విప్రో, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, HDFC బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.22 వద్ద ప్రారంభమైంది.

    దీపావళి కానుకగా ఉచిత గ్యాస్‌ సిలిండర్‌

    ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆ రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. ‘ఉజ్వల యోజన’ పథకం కింద దీపావళి కానుకగా ఒక గ్యాస్‌ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్యాస్‌ కనెక్షన్‌ పొందడం చాలా కష్టమైన పని అని అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల పథకం కింద రాష్ట్రంలో 1.75 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్‌లు లబ్ధి పొందారని ఆదిత్యనాథ్‌ తెలిపారు.

    ‘లియో’ తెలుగు వెర్షన్‌ విడుదలపై క్లారిటీ

    ‘లియో’ చిత్రం తెలుగు వెర్షన్‌ విడుదల తేదీలో ఎటువంటి మార్పు ఉండదని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 19న విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే, తెలుగు వెర్షన్‌ అదే రోజు విదుదలవుతుందని చెప్పారు. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించి క్లారిటీ ఇచ్చారు. ‘లియో’ సినిమాలో హీరోయిన్ గా త్రిష, నటులు సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

    బ్యాంకులకు RBI భారీ జరిమాన

    ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు భారీ జరిమనా విధించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు చొప్పున పెనాల్టీ వేసింది. రుణాలు అడ్వాన్సులు-చట్టబద్ధమైన, ఇతర నిబంధనలు, మోసాల వర్గీకరణ, కమర్షియల్‌ బ్యాంకుల రిపోర్టింగ్‌కు సంబంధించి ఆర్‌బీఐ జారీ చేసిన నిబంధనలు పాటించనందుకు ఈ జరిమానా విధించింది.

    దీపావళి కానుకగా ఉచిత గ్యాస్‌ సిలిండర్‌

    ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆ రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. ‘ఉజ్వల యోజన’ పథకం కింద దీపావళి కానుకగా ఒక గ్యాస్‌ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్యాస్‌ కనెక్షన్‌ పొందడం చాలా కష్టమైన పని అని అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల పథకం కింద రాష్ట్రంలో 1.75 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్‌లు లబ్ధి పొందారని ఆదిత్యనాథ్‌ తెలిపారు.

    దేశ శాస్త్రవేత్తలకు మోదీ దిశానిర్ధేశం

    భారత దేశ శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. రాబోయే 20 ఏళ్లలో మరిన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తెలిపారు. 2040 నాటికి చంద్రుడిపై తొలి భారతీయుడు అడుగు పెట్టేలా లక్ష్యం పెట్టుకోవాలని దిశానిర్ధేశం చేశారు. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 విజయాలు అందించిన ఉత్సాహంతో మరిన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని శాస్త్రవేత్తలకు సూచించారు. శుక్రగ్రహంపై ఆర్భిటర్ మిషన్, అంగారకుడిపై ల్యాండర్ వంటి ప్రయోగాల దిశగా శాస్త్రవేత్తలు కృషి చేయాలని మోదీ వెల్లడించారు.

    బాణసంచా కేంద్రంలో పేలుడు..7 మంది మృతి

    తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. రంగపాళ్యంలోని ఓ కేంద్రంలో బాణసంచా గోదాములో జరిగిన పేలుళ్ల ఘటనలో ఏడుమంది మృతిచెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, సహాయక సేవల సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేసేశారు. మృతులంతా అక్కడే పనిచేసే కార్మికులు అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదాల్లో ఎంతమందికి గాయాలయ్యాయనే సమాచారం తెలియలేదు.

    కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్‌కు చెందిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో నల్గొండ మున్సిపల్‌ వైస్ చైర్మన్‌ రమేష్‌తో పాటు 10 మంది బీఆర్ఎస్‌ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్‌లో పదవులు ఆశించి భంగపడ్డవారు కాంగ్రెస్‌ బాట పడుతున్నారు.