• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు తీర్పు

    స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు పాఠం చదివింది. ‘హోమోసెక్సువల్టీ కేవలం నగరాలు, ఉన్నత వర్గాలకు సంబంధించిన అంశం కాదు. ప్రాథమిక హక్కుల పరిరరక్షణ కోసం సుప్రీం ఇచ్చే ఆదేశాలు అధికార విభజనకు అడ్డంకి కాదు. స్వలింగ వివాహాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. స్వలింగ వివాహాలు స్పెషల్ మ్యారెజెస్ యాక్ట్‌లోని సెక్షన్‌ 4 రాజ్యాంగ విరుద్ధం అని చెప్పవచ్చు. ఈ వివాహాలపై పార్లమెంటే ఓ నిర్ణయం తీసుకోవాలి. అది కూడా న్యాయ … Read more

    అవినీతి అంతం కావాలి: అమిత్ షా

    బెంగాల్‌లో అవినీతి, దౌర్జన్యాలు త్వరలోనే అంతం కావాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. నేడు ఆయన పశ్చిమబెంగాల్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా షా మట్లాడుతూ.. బెంగాల్‌లో రాజకీయపరమైన మార్పు జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరాన్ని పోలినట్లుగా కోల్‌కతాలో దుర్గమ్మ మండపాన్ని తీర్చిదిద్దిన నిర్వాహకులను అమిత్ షా ప్రశంసించారు.

    ఢిల్లీ లిక్కర్ కేసులో ‘ఆప్’ పేరు

    ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుల జాబితాలో ఆమ్‌ ఆద్మీ పార్టీ పేరును చేర్చే యోచనలో ఉన్నట్లు సీబీఐ, ఈడీ సుప్రీంకోర్టు కు తెలిపాయి. ఈ కేసులో సిసోదియా బెయిల్‌ పిటిషన్లపై విచారణ సుప్రీంలో విచారణ జరిగింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని కొన్ని సెక్షన్లు, నిబంధనల ప్రకారం.. ఆమ్‌ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చాలని దర్యాప్తు సంస్థలు యోచిస్తున్నట్లు సీబీఐ న్యాయవాది తెలిపారు. దీనిపై వాదనలు విన్న సుప్రీం రేపు దీనిపై స్పష్టతనివ్వాలని సూచించింది. అనంతరం సిసోదియా బెయిల్‌ పిటిషన్లపై తదుపరి విచారణను రేపటికి … Read more

    యూజర్లకు నెట్‌ఫ్లిక్స్‌ షాక్‌

    నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు మరో షాక్‌ ఇవ్వనుంది. సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు పెంచేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాస్‌వర్డ్-షేరింగ్‌ను కట్టడి చేసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ 6 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లను పెంచుకుంది. అయితే సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హాలీవుడ్ నటీనటుల సమ్మె ముగిసిన తర్వాత ధరలను పెంచే అవకాశం ఉందని సమాచారం.

    ఐటీశాఖ రూ.102 కోట్లు స్వాధీనం

    ఏపీ, తెలంగాణ, కర్ణాటక, దిల్లీలో సోదాలపై ఐటీశాఖ వివరణ ఇచ్చింది. మొత్తం 55 చోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. గుత్తేదారులు, స్థిరాస్తి వ్యాపారుల నివాసాల్లో సోదాలు చేసినట్లు చెప్పింది. ట్యాక్స్ కట్టని రూ.102 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఐటీశాఖ తెలిపింది. ఇందులో 94 కోట్ల విలువైన నగదు, రూ.8కోట్ల విలువైన బంగారు నగలు ఉన్నట్లు పేర్కొంది.

    దిమ్మతిరిగే ఫీచర్లతో టాటా కారు

    టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ అక్టోబర్ 17న లాంచ్ కానుంది. ఇది టాటా మోటార్స్ ఫ్లాగ్‌షిప్ కారుగా చెప్పవచ్చు. ఈసారి ఈ SUV హారియర్‌ మోడల్‌ను పూర్తిగా నవీకరించింది. అక్టోబర్ 17న విడుదల కానున్న టాటా హారియర్ SUV పూర్తిగా రిఫ్రెష్ చేసిన కొత్త లుక్‌లో, కొన్ని ఫంకీ-లుకింగ్ కలర్ ఆప్షన్‌లతో రానుంది. పూర్తిగా రీడైజైన్ చేసిన ఇంటీరియర్‌తో సహా అనేక అప్‌డేట్‌లు అయితే హారియర్‌లో వస్తున్నాయి. అలాగే, ఈ SUV BS6 ఫేజ్-2కు అనుగుణంగా పూర్తిగా డీజిల్ ఇంజిన్‌తో రానుంది. మరీ ఈ కారు … Read more

    స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 69 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 66,213 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 11 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ సూచీ 19,740 పాయింట్ల వద్ద కదలాడుతోంది. HCL టెక్, ONGC, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. దివీస్ ల్యాబ్, ఏషియన్ పేయింట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద ప్రారంభమైంది.

    ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షలు పంపిణీ

    బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ బీఫారమ్‌లు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చొప్పున పార్టీ ఫండ్ రూపంలో చెక్‌లు అందించారు. ప్రస్తుతం 51 మందికి మాత్రమే బీఫారమ్‌లు అందజేసిన కేసీఆర్.. మిగతావారికి రేపు బీఫామ్‌లు ఇస్తామని పేర్కొన్నారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్య ఏమైనా ఉంటే 9848023175 నంబర్‌కు కాల్ చేయాలి అని సూచించారు. బీఫామ్ నింపేటప్పుడు అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు.

    ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ జాబితా విడుదల

    ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 30 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం భూపేష్ బఘేల్‌ బరిలోకి దిగనున్నారు. అంబికాపుర్ స్థానం నుంచి ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియోకు టికెట్ కేటాయించారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో 144 మందితో కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల చేశారు. ఛింద్​వాఢా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి మాజీ సీఎం కమల్​ నాథ్​ పోటీ చేయనున్నారు. రఘీగథ్ స్థానం నుంచి పోటీలో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్​ కుమారుడు … Read more

    2036 ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నాం: మోదీ

    2036 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ తరఫున అన్ని విధాల కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. 141 కోట్ల భారతీయులు ఒలింపిక్స్ క్రీడల కోసం ఉత్సాహంగా ఉన్నారని స్పష్టం చేశారు. 2029లో యూత్ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఐఓసీ- జియో కన్వెన్షన్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్ అన్ని రంగాలతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటుతోందని గుర్తు చేశారు.