• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కీచక టీచర్: విద్యార్థినిపై లైంగిక వేధింపులు

    విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఐదో తరగతి చదువుతున్న చిన్నారులపై పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉధ్యాయుడు ఐదో తరగతి బాలికలను లైంగికంగా వేధించాడు. ఆ చిన్నారిపై లైంగిక యత్నం చేశాడు. దీన్ని ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు చిన్నారికి కొంత డబ్బును ఇచ్చాడు. ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేని చిన్నారి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దుశ్చర్య వెలుగులోకి వచ్చింది.

    భారతీయులకు కెనడా గుడ్‌న్యూస్

    కెనడా ప్రభుత్వం అక్కడి భారత పౌరులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ తల్లిదండ్రులతో ఎక్కువ కాలం గడిపేందుకు వెసులుబాటు కల్పించింది. తల్లిదండ్రులకు సూపర్‌ వీసా నిబంధనలను సులభతరం చేసింది. ఇమ్మిగ్రేషన్, శరణార్థులు పౌరసత్వ మంత్రిత్వ శాఖ, ప్రజా భద్రత మంత్రిత్వ శాఖల ఆదేశాల మేరకు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ వీసాతో 10 ఏళ్ల పాటు తమ పిల్లలు, మనవళ్లతో కెనడాలో నివాసం ఉండొచ్చు.

    హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య

    హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో విద్యార్థిని మృతి కలకలం రేపుతోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ప్రవళిక (23) అశోక్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్‌-2 పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

    ఈ ప్రాంతాలను తప్పక సందర్శించాలి: మోదీ

    ఉత్తరాఖండ్‌లో పుణ్యక్షేత్రాలను ప్రధాని మోదీ సందర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పవిత్ర క్షేత్రాల జాబితాను షేర్‌ చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలనైనా కచ్చితంగా సందర్శించాలని దేశ పౌరులను ప్రధాని కోరారు. రాష్ట్రంలోని పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌లను సందర్శించడం ఎంతో ప్రత్యేకమన్నారు. ‘కుమావోన్‌ ప్రాంతంలోని పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌లను తప్పక సందర్శించాల్సిందిగా కోరుతాను. ఎన్నో ఏళ్ల తర్వాత పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌లను సందర్శించడం నాకెంతో ప్రత్యేకం’’ అని ప్రధాని పేర్కొన్నారు.

    జియో నుంచి మరో కొత్త ఫోన్‌

    రిలయన్స్‌ జియో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. జియోభారత్‌ బీ1 పేరిట దీన్ని తీసుకొచ్చింది. గతంలో ఉన్నఫోన్ కంటే అదనపు ఫీచర్లతో దీన్ని తీర్చిదిద్దింది. కంపెనీ వెబ్‌సైట్‌లో దీన్ని లిస్ట్‌ చేశారు. బీ1 ఫోన్‌ ధర రూ.1299. 2.4 అంగళాల తెర, 2,000mAh బ్యాటరీని ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో జియో యాప్స్‌ అన్నీ ముందే ఇన్‌స్టాల్‌ చేసి ఉంటాయని కంపెనీ తెలిపింది. యూపీఐ పేమెంట్స్‌ కోసం జియోపే కూడా ఉన్నట్లు వెల్లడించింది.

    రైడ్‌ క్యాన్సిల్‌ చేసిందని అసభ్య వీడియోలు

    క్యాబ్‌ రైడ్‌ బుక్‌ రద్దు చేసుకుందన్న కోపంతో ఓ మహిళ పట్ల డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు మహిళకు అసభ్యకర వీడియోలు, ఫొటోలు పంపాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే మహిళ బయటకు వెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసుకుంది. అయితే, పది నిమిషాల పాటు వేచిచూసినా క్యాబ్‌ రాకపోవడంతో ఆ మహిళ ఆటోలో వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన క్యాబ్‌ డ్రైవర్‌.. ఆమెకు అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను వాట్సాప్‌లో పంపాడు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేశారు.

    జొమాటో కొత్త సర్వీసు

    ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టింది. జొమాటో ఎక్స్‌ట్రీమ్ పేరిట పార్శిల్ సర్వీసులను ప్రారంభించింది. చిన్న చిన్న పార్శిళ్లను పంపించడం లేదా స్వీకరించడం కోసం ఎక్స్‌ట్రీమ్ సేవలను వినియోగించుకోవచ్చని జొమాటో పేర్కొంది. ఇప్పటికే ఇందులో 3 లక్షల మంది డెలివరీ పార్ట్‌నర్లు భాగస్వాములుగా ఉన్నారని జొమాటో పేర్కొంది. 10 కి.మీ దూరం వరకు ప్యాకేజీలను పంపించుకోవచ్చని తెలిపింది. ఈ సేవలు రూ.35 నుంచి ప్రారంభమవుతాయని జొమాటో పేర్కొంది.

    ఘర్షణలతో ప్రయోజనం ఉండదు: మోదీ

    జీ20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సులో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న వివాదాలు, ఘర్షణలతో ఎవరికి ప్రయోజనం ఉందని చెప్పారు. శాంతికి, సౌభ్రాతృత్వానికి ఇదే సమయమని చెప్పారు. ‘మానవ అవసరాలను తీర్చే విషయంలో అందరం కలిసి గట్టుగా పనిచేయాలి. సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ ఎదుర్కొంటుంది. ఉగ్రదాడిలో వేల మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉగ్రవాదం ఎక్కడున్న ఏ రూపంలో ఉన్న అది మానవాళికి వ్యతిరేకం’ అని మోదీ స్పష్టం చేశారు.

    ‘రామ మందిరం ప్రతిష్ఠ రోజు వారు రావొద్దు’

    అయోధ్యలో జనవరి 22న జరిగే రామ మందిరం ప్రతిష్ఠ కార్యక్రమానికి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు రావొద్దని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కోరింది. వారికి తగిన ఏర్పాట్లు చేయలేమని, అధికారులు సైతం ప్రొటోకాల్ పాటించే పరిస్థితి ఉండదని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులను విడతల వారీగా ఆహ్వానించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. జనవరి 26 తర్వాత భారత్‌తో పాటు విదేశాల్లోని భక్తులకు సైతం అవకాశం కల్పిస్తామన్నారు.

    5 లక్షల ఖాతాలపై ఎక్స్ నిషేధం

    ఎక్స్ (ట్విట్టర్) పెద్ద సంఖ్యలో భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది. 30 రోజుల్లో మొత్తం 5,59,439 ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాలన్ని భారతీయ ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నట్లు గుర్తించామని ఎక్స్ తెలిపింది. కంపెనీ నెలవారీ నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. నిషేధిత ఖాతాలు చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఎక్స్ తెలిపింది.