• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పేదవాడి కల నిజం చేశాం: సీఎం జగన్

    కాకినాడ-సామర్ల కోటలో జగనన్న కాలనీలోని ఇళ్లను సీఎం జగన్ ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు వస్తున్నాయి. ఇళ్లు కాదు.. ఊళ్తు వస్తున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండి పేదవాడికి సెంట్ భూమి కూడా పంచలేదు. కానీ ఇప్పుడు పేదవాడి కలను నిజం చేశాం’ అని చెప్పుకొచ్చారు.

    స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 55 పాయింట్ల వృద్ధితో 66,528 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సూచీ 16 పాయింట్లు లాభపడి 19,828 పాయింట్ల వద్ద కదలాడుతోంది. SBI, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.83.15 వద్ద ప్రారంభమైంది.

    మూన్నెళ్ల చిన్నారికి 31 సర్టిఫికెట్లు

    మధ్యప్రదేశ్‌కు చెందిన మూడు నెలల చిన్నారి శరణ్య సూర్యవనికి 72 రోజుల వ్యవధిలో ఏకంగా 31 ధ్రువపత్రాలు వచ్చాయి. దీంతో ఆ చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. గతంలో 28 సర్టిఫికెట్లతో ఓ చిన్నారి పేరు మీదున్న రికార్డ్‌ను అధిగమించాలనే పట్టుదలతో పాప తల్లిదండ్రులు ఈ రికార్డ్ సాధించారు. ఇందుకోసం శరణ్య పేరుతో ఆధార్, పాన్‌కార్డు, పాస్‌పోర్ట్ సహా 31 సర్టిఫికెట్లను పొందారు.

    బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం

    బిహార్‌- రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 21 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 7 మంది మృతి చెందగా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అసోంలోని కామాఖ్యకు నార్త్ ఈస్ట్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రైలు ప్రమాదంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. … Read more

    యూపీలో అమానుష ఘటన

    ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నగరంలో అమానుష ఘటన జరిగింది. అత్యాచారాన్ని ప్రతిఘటించిందనే కారణంతో కొందరు యువకులు 17 ఏళ్ల బాలికను రైలు కింద పడేశారు. దీంతో బాలిక రెండు కాళ్లు, ఒక చెయ్యి కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉంది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్ చదువుతున్న తన కుమార్తెను కొందరు యువకులు వేధింపులకు గురిచేస్తున్నారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలి తండ్రి తెలిపాడు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.

    నాందేడ్‌ ఆసుపత్రిలో ఆగని మృత్యుఘోష

    నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల సంఖ్య పెరిగుతోంది. ఆసుపత్రిలో కేవలం 48 గంటల వ్యవధిలోనే 31 మంది మృతిచెందడం తెలిసిందే. ఇప్పుడు గడిచిన ఎనిమిది రోజుల్లో మరో 108 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లోనే 11 మంది రోగులు మరణించగా.. వీరిలో ఓ పసికందు కూడా ఉండటం విచారకరం. ఔషధాల కొరత వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆసుప్రతిలో రోగులు మృతిచెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    రాజస్థాన్‌ పోలింగ్ తేదీలో మార్పు

    కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీలో పలు మార్పులు చేసింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్‌ 23న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్‌ 25కి మారుస్తూ ప్రకటన విడుదల చేసింది. మిగిలిన రాష్ట్రాల్లో ఎధావిధిగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించింది. రాజస్థాన్‌లో ఎన్నికల రోజు పెద్ద సంఖ్యలో వివాహాలు/శుభకార్యాలు/ సామాజిక కార్యక్రమాలు ఉండటంతో ప్రజలు ఓటు వేసేందుకు ఇబ్బంది కలుగుతుందని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

    రైతులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్

    దేశంలోని రైతులకు మోదీ సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల మొత్తాన్ని రూ.8 వేలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. రూ.2 వేలు అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తే కేంద్రంపై రూ.20వేల కోట్ల మేర అదనపు భారం పడనుంది.

    సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం

    తమిళనాడు అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తంజావూరులోని వ్యవసాయ కళాశాల, పరిశోధనా సంస్థకు భారత హరితవిప్లవ పితామహుడు డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పేరు పెడుతున్నట్టు తెలిపారు. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో టాపర్లుగా నిలిచిన వారిని సత్కరించేందుకు స్వామినాథన్‌ పేరిట అవార్డును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తంజావూరులోని ఈచన్‌కోట్టైలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ను స్వామినాథన్‌ అగ్రికల్చరల్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌గా మారుస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు.

    పవిత్రమైన నదిలో రీల్స్.. నెటిజన్స్ ఫైర్

    అయోధ్యలోని సరయు నదిలో ఓ మహిళ డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పవిత్రమైన నదిలో ఇలాంటి పనులు చేయడమేంటని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అయోధ్య పోలీసులు స్పందించారు. అయోధ్య ఇన్‌స్పెక్టర్ ఆదేశాలతో విచారణ చేస్తున్నామని, మహిళపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు. గతంలోనూ ఈ నదిలో ఓ బాలిక డ్యాన్స్ చేయగా ఆమెపై చర్యలు తీసుకున్నారు. #अयोध्या :राम की पैड़ी में रील बनाते एक … Read more