• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సైబర్ నేరగాళ్ల వలలో మాజీ మంత్రి

    కేంద్ర మాజీ టెలికాం మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుకున్నారు. ఈ నెల 8న ఓ వ్యక్తి తాను బ్యాంక్ సిబ్బంది అంటూ కాల్ చేసి తన ఖాతా వివరాలు అడిగినట్లు తెలిపారు. అయితే ఎలాంటి వివరాలు చెప్పనప్పటికీ తన ఖాతా నుంచి రూ.99,999 డెబిట్ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, దయానిధి మారన్ గతంలో కేంద్ర ఐటీ, టెలికాం మంత్రిగా పనిచేశారు. ఈ రంగాల్లో భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సేకరించడంలో కీలకంగా వ్యవహరించారు.

    ఈ నెల 21న ఇస్రో కీలక ప్రయోగం

    ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ తొలి ప్రయోగాన్ని ఈ నెల 21న నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. శ్రీహరి కోట నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యూల్‌ను పరీక్షించనున్నారు. మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపించి తిరిగి సురక్షితంగా భూమి మీదకు తీసుకురావడంపై టెస్ట్ నిర్వహించనున్నారు.

    నడిరోడ్డుపై మహిళ యోగా.. షాక్ ఇచ్చిన పోలీసులు

    రోడ్డు మధ్యలో యోగా చేసిన మహిళకు పోలీసులు షాక్ ఇచ్చారు. గుజరాత్‌లోని ఓ ప్రధాన రహదారిపై దినా పర్మార్ అనే మహిళ యోగాసనాలు వేస్తుండగా పోలీసులు వీడియో తీశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు గాను ఆమెకు జరిమానా విధించారు. ఈ వీడియోను గుజరాత్ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. https://www.instagram.com/reel/Cxh9J7kRmzA/?utm_source=ig_embed&ig_rid=8c60559a-21b9-487c-af36-890c82d7094c

    అంబానీ @రూ.8.08 లక్షల కోట్లు

    రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రూ.8.08 లక్షల కోట్ల సంపదతో దేశంలోని కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. అంబానీ సంపద 2 శాతం వృద్ధి చెందగా.. గౌతమ్ అదానీ సంపద 57 శాతం క్షీణించి రూ.4.74 లక్షల కోట్లకు తగ్గింది. దీంతో అదానీ రెండవ స్థానంలో ఉన్నారు. దేశంలోని 138 నగరాల నుంచి 1319 మంది బిలియనీర్లకు హురున్ జాబితాలో చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఈ జాబితాలో ఉండగా.. వీరి సంపద రూ.5.25 లక్షల కోట్లుగా ఉంది.

    మాజీ మంత్రికి షాకిచ్చిన సైబర్ నేరగాళ్లు

    కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ. 99,999 నగదు దుండగులు కొట్టేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డిజిటల్‌ ఇండియాలో వ్యక్తిగత సమాచారం సురక్షితంగా లేదని చెబుతూ ఆయన మోసం జరిగిన తీరును వివరించారు. ఓటీపీ అవసరం లేకుండా, తన వ్యక్తిగత మొబైల్‌కు ఎలాంటి పేమెంట్ లింక్‌ రాకుండా సైబర్‌ నేరగాళ్లు నగదు కొట్టేశారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయితే ఇలా చేయండి?

    కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఫేస్‌బుక్ ఖాతాలను హ్యాక్ చేసి మెసేజ్‌లు పంపిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. మరి కొందరు అసభ్య చిత్రాలను పోస్ట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మీ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయినట్లయితే ఈ టిప్ ఫాలో అయితే సింపుల్‌గా అకౌంట్‌ను రికవరీ చేసుకోచ్చు.. ముందుగా వెబ్‌బ్రౌజర్‌లో facebook.com/hacked అని సెర్చ్ చేయండి. స్క్రీన్‌పై కనిపించే My account is compromisedపై క్లిక్ చేయండి. తర్వాత కనిస్తున్న దానిలో ఇ-మెయిల్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మీ ఫేస్‌బుక్ ఖాతాను తిరిగిపొందొచ్చు.

    విమానం హైజాక్.. నకిలీ మెయిల్ కలకలం

    ఎయిర్‌ఇండియా విమానాన్ని హైజాక్ చేస్తున్నట్లు వచ్చిన మెయిల్ కలకలం రేపింది. ప్రయాణికుల్లో ఒకరు ఐఎస్‌ఐ ఇన్‌ఫార్మర్ ఉన్నాడని మెయిల్ రావడంతో అధికారులు అలర్టయ్యారు. బయలుదేరబోతున్న విమానాన్ని ఆపి నాలుగు గంటలపాటు తనిఖీలు చేశారు. ఎవరూ అనుమానాస్పదంగా కనిపించకపోవడంతో అధికారులు ఉపిరిపీల్చుకున్నారు. వచ్చింది నకిలీ మెయిల్ అని గుర్తించారు. బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    మా మద్దతు వారికే: మోదీ

    ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న భీకర పోరులో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకమని అది ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని తెలిపారు. ఈ క్లిష్టమైన పరిస్థితిలో ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తామని చెప్పారు. హమాస్ ఉగ్రవాదుల దాడుల వార్తలు విని దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌కు భారత్ తోడుగా నిలుస్తోందని ప్రధాని భరోసా ఇచ్చారు.

    ఎన్నికల తేదీల విషయంలో బీజేపీ వ్యూహం..?

    ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను పరిశీలిస్తే తేదీల విషయంలో సీఈసీని బీజేపీ ప్రభావితం చేసిందా అనే అనుమానం కలుగుతోందని పలువురు అంటున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మిజోరాం, మధ్యప్రదేశ్‌లలో ముందుగా ఎన్నికలు నిర్వహించడం.. ఆ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో చివరలో ఎన్నికలుండటమే దీనికి కారణమనే వాదన వినిపిస్తోంది. ముందుగా తాము అధికారంలో ఉన్న చోట ఎన్నికలు పూర్తి చేస్తే ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒత్తిడి లేకుండా ప్రచారం చేసుకునేందుకే ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇకపై నకిలీ సర్టిఫికెట్లకు చెక్

    నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. అన్ని యూనివర్సిటీలు డిజీ లాకర్‌ను వినియోగించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రతి వర్సిటీకి ప్రత్యేక కోడ్ కేటాయించింది. విద్యార్థులకు సంబంధించిన విద్యార్హత ధృవపత్రాలను ఈ డిజీ లాకర్‌లో భద్రపరుస్తారు. విద్యార్థులు తమకు ఎప్పడు అవసరమైనా వాటిని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానంతో సర్టిఫికెట్లపై ఉన్న పేర్లు, సంవత్సరాలను మార్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఫేక్ సర్టిఫికెట్లను అరికట్టే అవకాశం ఉంది.