• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉచిత హామీలను అడ్డుకోలేం: సీఈసీ

    ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలను తాము అడ్డుకోలేమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. సోమవారం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలో ఎన్నికల హామీలపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీలను ఎప్పటి లోగా అమలు చేస్తాయో రాజకీయ పార్టీలు చెప్పేలా ఒక విధానం తీసుకొచ్చామని చెప్పారు. హామీలను ఏ విధంగా, ఎప్పటి లోగా అమలు చేస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుందని రాజీవ్ పేర్కొన్నారు.

    కస్టమర్లకు షాకిచ్చిన HDFC బ్యాంక్

    ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్స్ దిగ్గజం HDFC కస్టమర్లకు షాకిచ్చింది. ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ HDFC బ్యాంక్ లెండింగ్ రేట్లను పెంచేసింది. ఎంపిక రుణాలపై లెండింగ్ రేట్లను గరిష్టంగా 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు ఈ నెల 7 నుంచే అమల్లోకి వచ్చాయి. అంతే కాకుండా బేస్ రేటును 5 బేసిస్ పాయింట్లు, ఇదే సమయంలో బెంచ్‌మార్క్ PLR 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ రేట్లు సెప్టెంబర్ 25 నుంచే అమల్లో ఉన్నాయి.

    ఏదీ ఊరికే రాదు: ఆనంద్ ట్వీట్

    ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ వీడియా షేర్ చేశారు. అందులో జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా గేమ్ కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూడవచ్చు.. దీనిపై ఆనంద్ స్పందిస్తూ ఇలా రాసుకొచ్చారు. ‘నీరజ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందంటే అది ఊరికే రాలేదు. ఎన్నో రోజులు చేసిన కృషి, పట్టుదల వల్లే అతడు ఈ స్థాయికి వచ్చాడు. కాబట్టే ఏదీ ఊరికే రాదు, దానికి తగ్గ ప్రయత్నం చేయాల్సిందే’ అంటూ మోటివేషన్ ట్యాగ్‌తో ఆనంద్ మహీంద్రా … Read more

    ఐటీ ఉద్యోగులకు మరో ఏడాది నిరాశే

    ఐటీ రంగానికి సంబంధించిన తాజా నివేదిక ఒకటి ఐటీ ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. 2024లో సైతం ఈ రంగం మెరుగుపడే అవకాశాలు లేవని ప్రముఖ ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గాన్‌కు చెందిన విశ్లేషకులు వెల్లడించారు. అయితే 2025లో మాత్రం పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంటుందని చెప్పారు. ఇన్వెస్టర్లు 2024ని ‘వాష్ అవుట్’గా పేర్కొంటారని, ఇక 2025పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. దీర్ఘకాలం పాటు అధిక వడ్డీ రేట్లు కొనసాగితే ప్రతికూల పరిస్థితులే ఉంటాయని ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ సంస్థలు హెచ్చరించాయి.

    ‘మా నాన్నకు టికెట్‌ ఇవ్వొద్దు’

    రాజస్థాన్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భాజపా మాజీ ఎమ్మెల్యే జయరామ్‌ జాటవ్‌కు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వవద్దని స్వయంగా ఆయన కూతురే అదిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చింది. ఒకవేళ టికెట్‌ ఇస్తే తన తండ్రిపై రెబల్‌గా తానే బరిలోకి దిగుతానని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను హెచ్చరించింది. తన ఆస్తులను కొట్టేసేందుకు తన తండ్రి కుట్రలు చేస్తున్నారని మీనా జాటవ్ ఆరోపించారు. అలాంటి వ్యక్తి సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సొంత కొడుకునే జయరామ్‌ చంపాలని చూశారని ఆమె ఆరోపించారు.

    టెలిగ్రామ్‌లో ఒక్కరోజే 2వేల ఛానెళ్లు బ్యాన్

    సోషల్ మీడియా వేదికలకు కేంద్రం హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.. బాలల లైంగిక వేధింపులకు సంబంధించి సమాచారాన్ని తొలగించాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ చర్యలు చేపట్టింది. నేడు ఒక్కరోజే 2114 గ్రూపులు. ఛానెళ్లను బ్యాన్ చేసింది. ఈ నెలలో మొత్తం 10,312 గ్రూప్స్, ఛానెళ్లపై నిషేధం విధించినట్లు టెలిగ్రామ్ వెల్లడించింది. చట్టపరమైన, నైతిక విలువలకు తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపింది. ఐటీ చట్ట నిబంధనలను తప్పక పాటిస్తామని టెలిగ్రామ్ పేర్కొంది.

    దోమలను ఆసుపత్రికి తెచ్చిన వ్యక్తి!.. వైద్యులు షాక్

    పశ్చిమ బెంగాల్‌‌లో ఓ వ్యక్తి చేసిన పనికి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తనకు కుట్టిన దోమలను సేకరించి ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఈ దోమలను పరీక్షించి ముందస్తుగా తనకు సరైన వైద్యం చేయాలంటూ కోరాడు. దీంతో వైద్యుడుతో సహా అక్కడున్న వారంతా షాకయ్యారు. అలీ షేక్ అనే వ్యక్తి ఇంటి వద్ద దోమల బెడద ఎక్కువగా ఉంది. దీంతో అతడు భయంతో దోమలను ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో వేసుకుని నేరుగా స్థానిక ఆసుపత్రికి వచ్చాడు.

    ఇజ్రాయెల్‌‌కు అండగా ఉంటాం: మోదీ

    ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదుల దాడిని ప్రధాని మోదీ ఖండించారు. ఆ దేశానికి భారత్ అండగా ఉంటుందని ప్రకటించారు. ఉగ్రవాదుల దాడిలో ఇజ్రాయెల్ పౌరుల మృతిపై మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేస్తూ.. ‘ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదుల దాడుల వార్తలు విని దిగ్భ్రాంతికి లోనయ్యా ఈ విపత్కర పరిస్థితిల్లో మేం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడతాం, అని మోదీ పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌లో మిలిటెంట్ల హింసాత్మక దాడులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

    నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత

    ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. నీళ్ల చారు, పులిసిపోయిన పెరుగు పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు క్యాంపస్ ఎదుట బైటాయించి ధర్నాకు దిగారు. కళాశాల యాజమాన్యం వచ్చి సర్థి చెప్పినా విద్యార్థులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. దీంతో క్యాంపస్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    Asian Games: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు స్వర్ణం

    ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీ స్వర్ణం గెలుచుకుంది. దీంతో ఇప్పటి వరకు భారత్ 101 పతకాలు సాధించింది. అందులో 26 స్వర్ణాలు, 35 రజతం, 40 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆసియా కీడల్లో భాగంగా భారత్-అఫ్గాన్ జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతం 18.2 ఓవర్లు పూర్తయ్యే సరికి అఫ్గాన్ 1121/5 పరుగులు చేసింది.