• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం

    ఎక్స్ (ట్విటర్‌) అధినేత ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మరో మూడు కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఎక్స్‌ను యూజర్లకు ఎన్ని యాడ్స్‌ కావాలనుకుంటున్నాదో దానికి అనుగుణంగా డబ్బులు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం వెరిఫైడ్‌ అకౌంట్లకు నెలకు రూ.650, ఏడాదికి రూ.6,800 చెల్లించి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకున్నారో వాళ్లకి ఇది అవసరం లేదని చెప్పారు.

    నక్సలిజం మానవాళికి శాపం: అమిత్‌ షా

    దేశంలో వామపక్ష తీవ్రవాదం లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు. 2022లో నక్సల్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో హింస, మరణాలు తగ్గిపోయాయని తెలిపారు. ‘నక్సలిజం మానవాళికి శాపమని. మేము దానికి సంబంధించిన అన్ని రూపాలను నిర్మూలించామని చెప్పారు. వామపక్ష తీవ్రవాద సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ‘నేషనల్‌ పాలసీ అండ్ యాక్షన్‌ ప్లాన్‌’ను ఆమోదించిన విషయాన్ని అమిత్‌ షా గుర్తు చేశారు.

    సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లకు కేంద్రం హెచ్చరికలు

    కేంద్రం సోషల్ మీడియా వేదికలకు హెచ్చరికలు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఎక్స్‌ (ట్విటర్‌), యూట్యూబ్‌, టెలిగ్రామ్‌లకు నోటీసులు జారీచేసింది. లేదంటే సురక్షిత ఆశ్రయం హోదాను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అటువంటి కంటెంట్‌ను యాక్సెస్‌ చేయనీయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని అందులో కేంద్రం పేర్కొంది.

    టీచర్‌పై విద్యార్థులు కాల్పులు

    ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు స్కూల్ విద్యార్థులు రెచ్చిపోయారు. తమ స్కూల్ టీచర్‌పై గన్‌తో కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి ఓ వీడియో సందేశాన్ని పంపించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కోచింగ్ సెంటర్లో పాఠాలు చెబుతున్న టీచర్‌ను విద్యార్థులు బయటకు రమ్మని పిలిచారు. వెంటనే అక్కడకు వచ్చిన టీచర్‌పై సదరు విద్యార్థులు వరస కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్ గాయం కావడంతో టీచర్‌ను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    గడుపు ముగిసినా రూ.2వేల నోట్లు మార్చుకోవచ్చు

    RBI రూ.2వేల నోట్ల మార్పిడిపై కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 8వ గడువు ముగిసిన తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే, ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. రూ.2000 నోట్లు ఉపసంహరణకు ముందు రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. అందులో రూ.3.43 లక్షల కోట్లు ఇప్పటి వరకు వెనక్కి వచ్చినట్లు RBI పేర్కొంది. వాటిలో 87 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలోనే వచ్చాయని వెల్లడించింది.

    మద్యం మత్తులో ప్రయాణికులపై మూత్ర విసర్జన

    మద్యం మత్తులో ఓ వ్యక్తి రైల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ సంవర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకుంది. ఓ యువకుడు ఫుల్‌గా మద్యం సేవించి ఏసీ కోచ్‌లో పై బెర్త్‌లో పడుకుని ఉన్నాడు. ఈ క్రమంలో లోయర్ బెర్త్‌లో పడుకుని ఉన్న ఇద్దరు దంపతులపై వారి వస్తువులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. దీంతో తోటి ప్రయాణికులు వెంటనే టీటీఈకి సమాచారం అందించారు. నిందితుడిని పట్టుకుని ఓ రైల్వే స్టేషన్‌లో పోలీసులకు అప్పగించారు.

    ఎస్సై పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

    ఏపీలో ఎస్సై పోస్టుల భర్తికి రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అక్టోబర్ 12 నుంచి హాల్‌టికెట్లను APSLPRB అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 14,15 తేదీల్లో విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో రాతపరీక్షలు జరగనున్నాయి. హాల్‌టికెట్లను పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌ నుంచి డైన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఏవైనా సమస్యలు ఎదురైతే 9441450693, 9100203323 నెంబర్లను సంప్రదించవచ్చు.

    శ్రద్ధాకపూర్‌కు ఈడీ నోటీసులు

    మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే పలువురు బాలీవుడు నటులు నోటీసులు అందుకోగా తాజాగా విచారణకు హాజరు కావాలంటూ శ్రద్ధాకపూర్‌కు ఈడీ నోటీసులు అందజేసింది. ఈ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ బెట్టింగ్ దందా నిర్వహిస్తుండగా, రోజుకు రూ.200 కోట్ల వరకు చేతులు మారుతున్నట్లు సమాచారం. యూఏఈ ప్రధాన కేంద్రంగా యాప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ నటుడు రన్‌బీర్‌తో సహా 14 మంది సెలబ్రిటీలు ఈ కేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

    వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ

    వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ఆర్బీఐ వెల్లడించింది. గవర్నర్ శక్తికాంత్‌దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రెపో రేటు: 6.5%, రివర్స్ రెపో రేటు: 3.35%, ఎస్‌డీఎఫ్‌ఆర్: 6.25%, ఎమ్ఎస్ఎఫ్ఆర్:6.75%, బ్యాంక్ రేటు: 6.75% వద్ద కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. వృద్ధి రేటు బాగానే ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగినట్లు వెల్లడించింది.

    రూ.100 లంచం తప్పు కాదు: హైకోర్టు

    వంద రూపాయలు లంచం తీసుకోవడం తప్పు కాదంటూ బొంబాయి హైకోర్టు తీర్పు వెలువరించింది. పూణెలో వైద్యుడిగా పనిచేస్తున్న శిండే వద్దకు ఓ వ్యక్తి హెల్త్ సర్టిఫికేట్ కోసం రాగా రూ.100 డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. 2007లో నమోదైన ఈ కేసులో శిండేను నిర్దోషిగా పేర్కొంటూ 2012లో స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. అధికారులు హైకోర్టులో సవాల్ చేయగా రూ.100 లంచం తీసుకోవడం చిన్న విషయమంటూ కోర్టు తీర్పు చెప్పింది.