• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం

    ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని ఎంజీ రోడ్డులో ఉన్న ఏడంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 40 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

    ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. 50 మంది మృతి

    రష్యా క్లిపణి దాడిలో ఉక్రెయిన్‌లో 50 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఖర్కివ్‌ రీజియన్‌ కుపియాన్స్క్‌ జిల్లాలోని గ్రోజా గ్రామంపై ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో రష్యా క్షిపణులతో విరుచుకపడింది. దాడి జరిగిన ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మరోపైపు ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ బలోపేతానికి సాయం చేయాలని మిత్రదేశాలను అభ్యర్థించింది.

    రాహుల్‌‌ గాంధీని రావణుడితో పోల్చిన బీజేపీ

    కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీజేపీ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రావణుడి అవతారంలో ఉన్న ఒక ఫొటోను బీజేపీ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. దీనిపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి, రాముడికి వ్యతిరేకి అంటూ రాహుల్ ఫొటో కింద క్యాప్షన్‌తో బీజేపీ రాసుకొచ్చింది. భారత దేశాన్ని నాశనం చేయడమే రాహుల్ లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్‌ చేసింది. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. ‘మోదీ ఒక అబద్ధాల కోరు ఇలాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ బెదిరిపోదు’ … Read more

    కాంగ్రెస్‌కు అధికారమే ముఖ్యం: మోదీ

    కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రయోజనాల కంటే ఓటు బ్యాంకు పైనే ఎక్కువ ద‌ృష్టి సారిస్తుందని విమర్శించారు. రైతులు, జవాన్ల సంక్షేమాన్ని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. సీఎం గెహ్లాట్ అవినీతి బయటకు రావాలంటే రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ సందర్భంగా మోదీ ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

    భారత్‌కు 20వ స్వర్ణం

    ఆసియా కప్‌లో భారత్ 20వ స్వర్ణాన్ని ముద్దాడింది. స్కాష్‌లో దీపికా పల్లికల్- హరిందర్ సంధు జోడీ మలేషీయా జంటపై విజయం సాధించింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 83కు పెరిగింది. వీటిలో 20 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి. మరోవైపు పురుషుల ఆర్చరీ టీమ్ విభాగంలో ఓజాస్ ప్రవిణ్- అభిషేక్ ప్రథమేష్ జోడీ సెమీస్‌ చేరి పతకం ఖాయం చేసుకుంది.

    నటనపై ఆసక్తితో IAS అధికారి రాజీనామా

    సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన ఇప్పటికే ‘చార్ పండ్రా’ షార్ట్ ఫిలింతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ఢిల్లీ క్రైమ్ సీజన్-2లో ఇన్వెస్టిగేషన్ అధికారిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. గతంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన అభిషేక్ ఓ వివాదంలో చిక్కుకుని సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

    ఎన్నికల కమిటీలు ప్రకటించిన బీజేపీ

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టీబీజేపీ సిద్ధమైంది. ఈమేరకు ఎన్నికల్లో చురుకుగా పాల్గొనేందుకు పార్టీ నేతలకు పలు కీలక బాధ్యతలు అప్పగించింది. మొత్తం 14 కమిటీలు నియమించింది. మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్‌గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండ విశ్వేశ్వర్ రెడ్డి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పబ్లిక్ మీటింగ్స్ ఇంఛార్జిగా బండి సంజయ్, ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్ రావు, యాజిటేషన్ కమిటీ చైర్మన్‌గా విజయ శాంతిని నియమించారు.

    ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగాలి: ఈసీ

    ఓటర్ల జాబితా ప్రక్షాళన పూర్తి స్థాయిలో జరగాలని ఈసీ పేర్కొంది, అర్హులందరికీ ఓటు హక్కు ఉండడంతో పాటు అనర్హులను తీసివేయాలని స్పష్టం చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తెలంగాణలో ఈసీ రెండో రోజు పర్యటనలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలిస్ కమిషనర్లతో సమావేశమైంది. ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేసింది. ఎన్నిలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు ఈసీ స్పష్టం చేసింది.

    పెళ్లి వేడుకలో విషాదం.. 100 మంది మృతి

    ఇరాక్‌లోని ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వేడుకలో జరిగిన అగ్ని ప్రమాదంలో 100 మందికిపై ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్‌లోని నినేవేహ్ ప్రావిన్స్‌లోని హయ్‌దానియా ప్రాంతంలో ఓ ఫంక్షన్ హల్‌లో వధూవరులు నృత్యం చేస్తున్నారు. ఇంతలో ఫంక్షన్ హాల్ పైభాగంలో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. దీంతో అక్కడున్న వారు తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఘటనలో మొత్తం 114 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. WATCH: Extremely terrifying footage of … Read more

    లిక్కర్‌ స్కామ్‌లో చిక్కిన మరో ఆప్ ఎంపీ

    ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో ఆప్ నేత చుట్టు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. దినేష్ అరోరా, మాగుంట రాఘవ అప్రూవర్‌లుగా మారిన గంటల వ్యవధిలోనే తనిఖీలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. కస్టడీలో ఉన్న దినేష్ అరోరా.. ఎంపీ సంజయ్ సింగ్‌ను కలిసినట్టు ఈడీకి చెప్పడంతో అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా ఆప్ ఎన్నికల ఖర్చు కోసం లిక్కర్ స్కామ్‌ డబ్బును వినియోగించినట్టు ఆరోపణలు ఉన్నాయి.