• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తలపై గ్యాస్ సిలిండర్‌తో మహిళ డ్యాన్స్

    నెత్తిపై గ్యాస్ సిలిండర్‌ను పెట్టుకుని ఓ మహిళ డ్యాన్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్యాస్ సిలిండర్‌ను తలపై పెట్టుకుని కొద్దిసేపు డ్యాన్య్ చేసిన ఆమె తిరిగి బిందెపై నిల్చుని కూడా కాసేపు స్టెప్పులేసింది. ఈ వీడియోను కొందరు ప్రశంసిస్తుండగా .. మరికొందరు ఇలాంటి వీడియోలను స్ఫూర్తిగా తీసుకుని ఇంకొంత మంది మహిళలు ట్రై చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిని షేర్ చేయవద్దని సూచిస్తున్నారు. https://www.instagram.com/reel/CxiEviFRnUE/?utm_source=ig_embed&ig_rid=1e05efce-eca6-4a93-8038-6a4d7f8c80f1

    ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

    ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఈరోజు జరిగిన మిక్స్డ్ ఆర్చరీ ఈవేంట్‌లో భారత ఆటగాళ్లు జ్యోతి సురేఖ, ప్రవీణ్ ఓజా గోల్డ్ మెడల్ సాధించారు. 5 కిలోమీటర్ల ట్రాక్ రేస్‌లో భారత క్రీడాకారిణి పారుల్ చౌదరి స్వర్ణం గెలిచింది. మరోవైపు 35మీ. మిక్స్డ్ వాక్ రేస్‌లో మజ్ను, రాంబాబు సిల్వర్ కొట్టారు. ఆసియా గేమ్స్‌లో భారత్ ఇప్పటి వరకు 71 పతకాలతో 4వ స్థానంలో కొనసాగుతోంది. వీటిలో 16 స్వర్ణాలు, 26 సిల్వర్, 29 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.

    సచిన్‌కు అరుదైన గౌరవం

    భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను వన్డే ప్రపంచకప్ 2023 గ్లోబల్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది. అక్టోబర్ 5 నుంచి ఇండియాలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ప్రపంచకప్ టోర్నీతో కనిపించనున్నాడు. ఈనెల 5న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో వరల్డ్ కప్ ట్రోఫీతో మైదానంలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో అధికారికంగా టోర్నీ ఆరంభమవుతోంది. సచిన్‌తో పాటు గ్లోబల్ అంబాసిడర్లుగా ఇయాన్ మోర్గాన్, ఏబీ డివిలీయర్స్ ఇతర మాజీ క్రికెట్లను ఐసీసీ ప్రకటించింది.

    సిక్కింలో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

    సిక్కింలోా ఆకస్మిక వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు తీస్తా నది ఉగ్రరూపం దాల్సింది. నది ఉప్పొంగడంతో పెద్దఎత్తున వరదలు చోటు చేసుకున్నాయి. వరదల్లో పడి 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వరదల్లో కొట్టుకుపోయిన ఆర్మీ సిబ్బంది కోసం NDRF దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. వరద తాకిడితో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. https://x.com/drmonika_langeh/status/1709415881183490117?s=20

    న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు అరెస్ట్

    న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ అరెస్టయ్యారు. చైనా అనుకూల ప్రచారానికి నిధులు తీసుకున్నాడన్న ఆరోపణలు అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం 30చోట్ల జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేశారు. డిజిటల్‌ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్‌ చేశారు. ‘న్యూస్‌క్లిక్‌’ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయని ‘న్యూయార్క్‌ టైమ్స్’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ప్రబీర్ ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు అయనను అరెస్టు చేశారు.

    క్రికెట్‌ ప్రియులకు డిస్నీ+ హాట్‌స్టార్‌ గుడ్‌న్యూస్‌

    క్రికెట్ ప్రియులకు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను మొబైల్‌ యాప్‌లో ఫ్రీగా చూసేందుకు అవకాశం కల్పించింది. తాజాగా ఈ సంస్థ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. దీని ద్వారా వర్టికల్‌ మోడ్‌లో (నిలువుగా; 9×14) క్రికెట్‌ను వీక్షించొచ్చు. ఒంటి చేత్తో క్రికెట్‌ ప్రసారాలను ఆనందించొచ్చు. ఈ మోడ్‌లో లైవ్‌ ఫీడ్‌ ట్యాబ్‌, స్కోర్‌ కార్డు ట్యాబ్‌ కూడా కనిపిస్తాయి. క్రికెట్ అభిమానులకు కొత్త అనుభూతిని అందించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు డస్నీ తెలిపింది.

    మోదీ స్టోరీలు రాస్తే ఆస్కార్ విజయం: KTR

    జనగర్జన సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మోదీ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీ సినిమాలకు స్టోరీలు రాస్తే ఆస్కార్ విజయం సాధిస్తుందని ఎద్దేవా చేశారు. మోదీ ఎంత అరిచినా తెలంగాణ ప్రజలు సీఎంగా కేసీఆర్‌నే ఎన్నుకుంటారని చెప్పారు. ‘ఎన్డీయేలో చేరేందుకు మాకు పిచ్చికుక్క కరిచిందా? సభలో మోదీ పచ్చి అబద్దాలు చెప్పారు. మునిగిపోయో నావలో ఎవరూ ఎక్కాలనుకోరు. నేను సీఎం కావడానికి మోదీ పర్మీషన్ అవసరం లేదు’ అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

    కాంగ్రెస్‌ను నడిపేది దేశ వ్యతిరేక శక్తులు: మోదీ

    ఛత్తీస్‌గఢ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మోదీ ఫైరయ్యారు. రాష్ట్రంలో అవినీతి, నేరాలు అధికంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ను నడుపుతోంది ఆ పార్టీ నేతలు కాదని దేశ వ్యతిరేక శక్తులతో అనుబంధం ఉన్నవారు నడుపుతున్నారని విమర్శించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలో గతంలో బీజేపీ ఆదివాసీల కోసం ప్రత్యేక మంత్రిత్యశాఖ ఏర్పాటు చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మోదీ పేర్కొన్నారు.

    నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 312 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ సూచీ 65,156 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 104 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 19,533 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. ఏషియన్ పేయింట్ల్, బజాజ్ ఫైనాన్స్, HUL షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ, రిలయన్స్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షెర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు పెరిగింది. రూ.83.21 వద్ద కొనసాగుతోంది.

    విపక్షాలకు విజన్‌ లేదు: ప్రధాని మోదీ

    విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధి వ్యతిరేక వైఖరితో రాజకీయాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. విపక్ష నేతలకు దేశ అభివృద్ధి విషయంలో విజన్‌ గానీ, ఒక రోడ్‌మ్యాప్ గానీ లేవన్నారు. భాజపా హయాంలో దేశంలోని పలు రంగాల్లో జరుగుతోన్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ప్రపంచమంతా భారత్‌ను కీర్తిస్తుంటే భాజపా వ్యతిరేకులకు ఇది నచ్చడం లేదన్నారు. రాజకీయాల్లో మునిగితేలుతున్న విపక్ష నేతలకు కుర్చీయే తప్ప మరేమీ కనబడటంలేదని మోదీ విమర్శించారు.