• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కరప్షన్‌, కమీషన్‌ ఈ రెండు పార్టీల సిద్ధాంతం: మోదీ

    తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. కరప్షన్‌, కమీషన్‌ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల సిద్ధాంతమని ఎద్దేవా చేశారు. ‘పార్టీ అధ్యక్షుడి నుంచి అన్ని పదవుల్లోనూ కుటుంబసభ్యులే ఉంటారు. బీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్‌ మరో పార్టీ చేతిలో ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసు. బీజేపీ మాత్రం సామాన్యుల కోసం ఆలోచిస్తుంది. మోడీ ఇచ్చే గ్యారెంటీలపై తెలంగాణ ప్రజలకు భరోసా ఉంది. తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోంది అని చెప్పుకొచ్చారు.

    మణిపూర్ ఘటన.. అదుపులో నిందితులు

    మణిపూర్‌లో కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. మూడు నెలల క్రితం మణిపూర్ అల్లర్లలో ఇద్దరు విద్యార్థులు మరణించడంతో ఆ రాష్ట్రం భగ్గుమంది. ఇద్దరు మైనర్ విద్యార్థుల మృతదేహాల ఫోటోలు వైరల్ కావడంతో ఆగ్రహించిన విద్యార్థులు రోడ్లపైకి నిరసనలు తెలిపారు. దీనిపై దర్యప్తు చేసిన పోలీసులు నలుగురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

    యూజర్లను కోల్పోతున్న ‘ఎక్స్’

    ఎక్స్ (ట్విట్టర్) ఈసీఓ లిండా యాకారివో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎక్స్’ తన యాక్టీవ్ యూజర్లను కోల్పోతుందని తెలిపారు. ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ఎక్స్ 11.6 శాతం యూజర్లను కోల్పోయిందని వెల్లడించారు. ప్రస్తుతం తమకు 225 మిలియన్ల రోజువారి యూజర్లు, 550 మిలియన్ యాక్టివ్ యూజర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. వచ్చే ఎడాదిలో ఎక్స్ లాభాల బాట పట్టనుందని లిండా చెప్పుకొచ్చారు.

    కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

    కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేర చరిత్రను పత్రికా ప్రకటనల్లో బహిరంగ పరచాలని నిర్ణయించింది. తప్పుడు అఫిడవిట్లు, ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వృద్దులు, 40శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వారికి ఇంటి నుంచే ఓటు హక్కును కల్పిస్తామని పేర్కొంది. ఇదిలాఉంటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల సన్నద్దతపై ఈసీ సమీక్షిస్తోంది.

    Video: నడిరోడ్డుపై మంటల్లో ఎలక్ట్రిక్ కారు

    బెంగళూరులో నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ కారు మంటల్లో కాలిపోయింది. రోడ్డు మీద కాలిపోతున్న ఎలక్ట్రిక్ కారుని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎ ప్రమాదం జరగలేదని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఎంజి కామెట్ కారు మాదిరిగా ఉందని చెబుతున్నారు. కానీ చాలామంది ఇది మహీంద్రా ఎలక్ట్రిక్ కారు అని కామెంట్లు పెడుతున్నారు. #Bengaluru: An #electric #car caught … Read more

    రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌

    జమ్మూ కశ్మీర్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి భారీగా కొకైన్‌ను స్వాదీనం చేసుకుని సీజ్ చేశారు. పట్టుబడిన 30 కిలోల కొకైన్‌ విలువ రూ.300 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్‌ అక్రమ రవాణా వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిలోని బేనీహాల్‌ వద్ద రాత్రి ఓ వాహనాన్ని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా అందులో భారీగా డ్రగ్స్‌ బయటపడింది.

    అరసవల్లి స్వామిని తాకని సూర్య కిరణాలు

    అరసవల్లి స్వామిని తాకని సూర్యకిరణాలు ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం సూర్యనారాయణస్వామి ఆలయానికి భక్తులు పొటెత్తారు. ఏటా అక్టోబర్ 1న సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలోని మూల విరాట్‌ను తాకుతాయి. అయితే ఈసారి ఆ అద్భుతం ఆవిష్కృతం కాలేదు. రాత్రి నుంచి చిరుజల్లులు, మబ్బులు కారణంగా సూర్యకిరణాలు ప్రసరించలేదు. దీంతో నిరాశతో భక్తులు వెనుదిరుగుతున్నారు. సోమవారం సూర్యకిరణాలు పడే అవకాశం ఉందని అర్చకులు చెబుతున్నారు. సూర్యకిరణాలు స్వామివారిని తాకే సమయంలో దర్శించుకుంటే పుణ్యమని భక్తులు భావిస్తారు.

    ఆదిత్య ఎల్‌1 కీలక మైలు రాయి

    సూర్యుడిపై ప్రయోగించిన ‘ఆదిత్య- ఎల్ 1 మరో మైలురాయిని చేరుకుంది. భూమి నుంచి ఈ వ్యౌమనౌక 9.2 లక్షల కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణించింది. తాజాగా ISRO ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ క్రమంలోనే భూ గురుత్వాకర్షణ పరిధిని విజయవంతంగా దాటినట్లు పేర్కొంది. ఈ వ్యౌమనౌక భూమి నుంచి సూర్యుడి దిశగా సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో ‘మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌’ మొదటిసారి ఈ ఘనత సాధించినట్లు ఇస్రో తెలిపింది.

    Video: ఆడీలో వచ్చి పంటను విక్రయించిన రైతు

    ఓ రైతు ఆడీ కారులో వచ్చి తన పంటను అమ్మడం నెట్టింట వైరల్‌గా మారింది. కేరళకు చెందిన సుజిత్‌, వ్యవసాయ పద్ధతుల్లో రకరకాల పంటలను పండిస్తున్నారు. ఈ క్రమంలో అతడు ఆడీ కారులో వచ్చి తన పంటను విక్రయించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తాను పండించిన బచ్చలికూర పంటను కోయడం మొదలు విక్రయించడం వరకు ఈ వీడియోలో చూడవచ్చు. ఇప్పటి వరకు ఈ వీడియోను ఎనిమిది మిలియన్లకు పైగా వీక్షించారు. దీనిపై నెటిజన్లు సుజిత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. … Read more

    నరకం చూసిన యువతి.. వీడియో వైరల్

    జెయింట్ వీల్ ఎక్కి సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. సదరు యువతి సరదాగా గడిపేందుకు అందరితో పాటు జెయింట్ వీల్ ఎక్కింది. రెండు రౌండ్లు తిరిగిన తర్వాత మూడో రౌండ్‌లో ఆమె కూర్చున్న తొట్టెకు, జెయింట్ వీల్‌కు మధ్య తన జట్టు ఇరుక్కుపోయింది. దీంతో యువతి నొప్పికి గట్టిగా కేకలు వేయడంతో ఇది గమనించిన వీల్ ఆపరేటర్ వెంటనే ఇంజన్‌ను ఆపేశాడు. సదరు యువతిని రక్షించే ప్రయత్నంలో ఆమె వీల్‌లో ఇరుకున్న ఆమె జట్టును చాకుతో కత్తిరించారు. … Read more