• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తమిళనాడు- కర్ణాటక మధ్య ఉద్రిక్తత

    తమిళనాడు- కర్ణాటక సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కావేరి నది జలాల విడుదలను నిరసిస్తూ కర్ణాటక వ్యాప్తంగా బంద్ తలపెట్టారు. బెంగళూరులో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఐటీ సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల ప్రజలు వరుస ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. https://x.com/appudynasty1/status/1705808522603315601?s=20

    మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మా మద్దతు: సోనియా గాంధీ

    లోక్‌ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. ‘వంటిల్లు నుంచి ప్రపంచవేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉంది. మహిళలు వారి స్వార్థం గురించి ఏనాడూ ఆలోచించరు. స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిది. స్త్రీల త్యాగాలు ఎనలేనివి. స్త్రీలు ఏనాడు వారి స్వార్థం గురించి ఆలోచించరు గతంలో బిల్లును అడ్డుకున్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మేం మద్దతు ఇస్తాం. ఈ బిల్లు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాం. రాజ్యసభలో తొలుత ఈ బిల్లును ప్రవేశపెట్టింది మేమే’ అని చెప్పుకొచ్చారు. … Read more

    లోక్ సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు

    లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కేంద్రమంత్రి అర్జున్ రామ్ ప్రవేశపెట్టారు. ‘నారీశక్తి వందన్’ పేరుతో బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లు కాపీలు ఇవ్వకపోవడంపై విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. బిల్లును డిజిటల్ ఫార్మట్లో అప్‌లోడ్ చేశామని మంత్రి వివరించారు. ఎల్లుండి రాజ్యసభలో బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. మహిళా బిల్లు ఇప్పుడు చట్టంగా మారినా.. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమల్లోకి తెస్తామని అర్జున్ రామ్ ప్రకటించారు. అందుకు 2026 వరకు టైం ఉంది. https://x.com/ANI/status/1704054293320610051?s=20

    New Parliament Building: నూతన పార్లమెంటు భవనం.. ఈ ప్రత్యేకతలు తెలుసా? 

    96 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పాత పార్లమెంట్ భవనానికి విడ్కోలు చెబుతూ.. కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. స్వాతంత్రోధ్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో చట్టాలకు పురుడు పోసింది పాత పార్లమెంట్. నూతన పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. జాతీయ గీతాలపన అనంతరం.. కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. “చిన్న కాన్వాస్‌పై పెద్ద బొమ్మ గీయలేం. ఇకపై మనం పెద్ద … Read more

    LIVE: కొలువు దీరిన కొత్త పార్లమెంట్

    కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. జాతీయ గీతాలపన అనంతరం.. కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాసేపట్లో లోక్‌ సభ ముందుకు చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు రానున్నారు. పార్లమెంట్ సమావేశాలను లైవ్‌లో వీక్షించండి.

    కొత్త పార్లమెంట్ ప్రారంభం

    కొత్త పార్లమెంట్ ప్రారంభమైంది. నూతన పార్లమెంట్‌లోకి ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా ప్రవేశించారు. చివరగా పాత పార్లమెంట్‌లో సభ్యులను కలిసి పార్లమెంట్ ముందు గ్రూప్ ఫొటో దిగారు. 96 ఏళ్ల చరిత్ర ఉన్న పార్లమెంట్ బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో చట్టాలకు పురుడు పోసింది. పాత పార్లమెంట్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈరోజు నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కొత్త భవనం నుంచి ప్రారంభం కానున్నాయి. https://x.com/ANI/status/1704010374264299848?s=20

    గాయనిపై అభిమానుల నోట్ల వర్షం

    గుజరాత్‌లోని కచ్‌లో నిర్వహించిన సంగీత కచేరీలో ప్రముఖ జానపద గాయని ఊర్వశీ రాధాదియాపై అభిమానులు నోట్ల వర్షం కురిపించారు. కచ్‌లో గోశాల ఏర్పాటు కోసం నిధులు సేకరించేందుకు ఈ కచేరీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తన గాత్రంతో అభిమానులను అలరించారు. ఊర్వశీ పాటలకు ముగ్ధులైన అభిమానులు ఆమెపై నోట్ల వర్షం కురుపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. https://x.com/ANI/status/1702654868471820376?s=20

    గుజరాత్‌లో భారీ వర్షాలు.. నర్మదా ఉగ్రరూపం

    గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పెద్దఎత్తున వరద పొటెత్తుతుండటంతో నర్మదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సర్దార్‌ సరోవర్‌ నర్మదా డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీని తాకుతూ నర్మదా నది ప్రవహిస్తోంది. వరద నీటిలో బరూచ్ పట్టణం మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో NDRF సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముంపు బాధితులను శరణార్థి శిబిరాలకు తరలిస్తోంది. https://x.com/ANI/status/1703607352866574506?s=20

    నువ్ క్లాస్ సిరాజ్ అంతే: ఆనంద్ మహీంద్రా

    ఆసియాకప్‌ ఫైనల్లో సిరాజ్ పర్ఫామెన్స్‌పై పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. ‘ సిరాజ్‌ను ఉద్దేశిస్తూ నువ్వు క్లాస్‌ బాసూ అంటు ప్రశంసించారు. ‘ఒకటే మాట.. క్లాస్‌.. అంతే .. ఈ క్లాస్‌ అనేది ఇది మీ సంపద లేదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మీ బ్యాక్‌ గ్రౌండ్‌ అనే దాన్నుంచి రాదు.. అది మీలోనే ఉంటుంది’ అంటూ ట్విట్‌ చేశారు. సిరాజ్‌కు 2021లో థార్ వెహికల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. Just one word: CLASS. It doesn’t come … Read more

    LIVE: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు మొదలుపెట్టి 75 ఏళ్లు పూర్తి కావొస్తుండటంతో ఈ సందర్భంగా దేశం సాధించిన విజయాలు, అనుభవాలపై ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. ఈరోజు నాలుగు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఇండియాను భారత్‌గా మార్చే బిల్లు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.