• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నీటి అడుగున చెస్ గేమ్

    అంతర్జాతీయ చెస్ టోర్నీ ప్రచారం కోసం చెన్నైలోని అధికారులు పలురకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 44వ చెస్ ఒలింపియాడ్‌ తమిళనాడులో జరుగుతున్న నేపథ్యంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తాజాగా స్కూబా డైవర్లు నీటి అడుగున 60 మీటర్ల లోతులో చెస్ ఆడి రికార్డు సృష్టించారు. అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన భారీ నాణేలతో తయారు చేసిన చెస్ బోర్డు, కాయిన్లను ఉపయోగించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతుంది. ఈ వీడియోను మీరు కూడా చూడాలంటే Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. … Read more

    తల్లి మృతదేహాన్ని బైక్‌కు కట్టి తీసుకెళ్లిన కుమారులు

    మధ్యప్రదేశ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. షాహ్‌దోల్ జిల్లా ఆసుపత్రిలో ఓ మహిళ మృతి చెందగా, ఆ మృతదేహాన్ని ఆమె కుమారులు బైక్‌పై తీసుకెళ్లారు. ప్రభుత్వ వాహనం రాదని చెప్పగా, ప్రైవేటు శవవాహనంలో తమ గ్రామానికి తీసుకెళ్లాలంటే రూ.5 వేలు ఆడిగినట్లు వారు పేర్కొన్నారు. దీంతో అంత నగదు ఇవ్వలేమని, రూ.100కు చెక్కపలక కొనుగోలు చేసి దానిపై చుట్టి, 80 కిలోమీటర్ల దూరంగా ఉన్న వారి గ్రామానికి తీసుకెళ్లారు. గోదారుకి చెందిన జైమంత్రి ఛాతీ నొప్పితో జిల్లా ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ … Read more

    సంజ‌య్‌రౌత్‌కు హార‌తిచ్చి పంపించిన త‌ల్లి

    శివ‌సేన చీఫ్ సంజ‌య్ రౌత్‌ను ఆదివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(ఈడీ) అదుపులోకి తీసుకుంది. మ‌నీలాండ‌రింగ్ కేసులో ఇప్ప‌టికే రెండుసార్లు నోటీసులు జారీచేసిన‌ప్ప‌టికీ ఆయ‌న హాజ‌రుకాలేదు. ఆదివారం ఉద‌యం సంజయ్ రౌత్ ఇంట్లో సోదాలు చేసిన ఈడీ దీర్ఘ‌కాలం పాటు ప్ర‌శ్నించింది. రాజ‌కీయ కుట్ర‌లో భాగంగానే ఈడీ దాడులు జ‌రుగుతున్నాయ‌ని సంజ‌య్ రౌత్ స్పందించారు. అయితే ఈడీ అదుపులోకి తీసుకునే ముందు సంజ‌య్‌రౌత్‌కు ఇంట్లో త‌న త‌ల్లి హార‌తి ఇచ్చి పంపించింది. త‌ల్లి ఆశీర్వాదాలు తీసుకొని శివ‌సేన చీఫ్ అక్క‌డినుంచి బ‌య‌ల్దేరాడు. వీడియో చూసేందుకు watch on … Read more

    విక్టర్ బౌట్: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్

    ఓ మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ ను అమెరికా చెర నుంచి విడిపించేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అసలు ఎవరీ విక్టర్ బౌట్ అతనికెందుకు అంత ప్రాధాన్యత? 1967లో పుట్టిన విక్టర్ బౌట్ సోవియట్ సైన్యంలో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేశాడు. సోవియట్ పతనమయ్యాక అంతర్జాతీయ రవాణా వ్యాపారిగా మారాడు. ఆ తర్వాత ఆయుధ వ్యాపారిగా ఎదిగాడు. విశ్వవ్యాప్తంగా ఉగ్ర, రెబల్ గ్రూపులతో సంబంధాలు పెట్టుకొన్నాడు. అనేక దేశాలకు విక్టర్ నెట్ వర్క్ విస్తరించింది. ఇతడి వద్ద యాంటినోవ్‌, ఇల్యూషన్‌, యకోవ్‌లెవ్‌ వంటి కార్గో విమానాలు ఉన్నాయి. వీటితో … Read more

    వీడియో: జూనియర్లను సీనియర్ల ర్యాగింగ్..ఎలా చేశారంటే

    ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ ర్యాగింగ్ విషయంలో విద్యార్థుల తీరు మాత్రం మారడం లేదు. పలు కాలేజీల్లో ఇంకా ఈ వికృత చేష్టలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని రత్లాం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సంఘటన వీడియో వెలుగులోకి వచ్చింది. క్యూలో జూనియర్ విద్యార్థులు ఉండగా సీనియర్లు చెంపదెబ్బ కొట్టడం వీడియోలో చుడవచ్చు. ఈ విషయం తెలిసిన అక్కడి వైద్య విద్యాశాఖ మంత్రి స్పందించి విచారణకు ఆదేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది. … Read more

    తెగ వైరల్ అవుతున్న ఫొటో..మీరు కూడా చూసేయండి

    నేను మంచి మాటలు చెప్తాను. కానీ పాటించను. ఈ ఫొటో చుస్తే కూడా అచ్చం అలాగే ఉంది. ఓ ట్రక్కులో అనేక రకాల చెట్ల కలపను నరుక్కుని తీసుకెళ్తున్నదృశ్యం ఆ ఫొటోలో చూడవచ్చు. కానీ ఆ వాహనం వెనుక బాగంలో ప్లాంట్ మోర్ ట్రీస్ అని రాసి ఉంది. ఈ దృశ్యం చూసిన ఓ అధికారి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఈ పిక్ చూసిన నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోను మీరు కూడా చూసేందుకు Watch … Read more

    హ్యాపీనెస్ ఉత్సవ్‌లో డ్రమ్స్ ప్లే చేసిన కేజ్రీవాల్

    ఢిల్లీ ప్రభుత్వం ‘హ్యాపీనెస్ ఉత్సవ్’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నేడు జరిగిన ఈ ఉత్సవ ముగింపు వేడుకల్లో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డ్రమ్స్ వాయించారు. ఆయన డ్రమ్స్ వాయిస్తుంటే ఆ ఉత్సవంలో పాల్గొన్న వారందరూ కూడా వాయించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. #WATCH | Delhi CM Arvind Kejriwal attends the closing ceremony of Delhi government … Read more

    మిగ్ 21 ప్రమాదంపై స్పందించిన ఐఏఎఫ్

    రాజస్థాన్ లోని బర్మార్ లో మిగ్-21 యుద్ధవిమానం కుప్పకూలిన ఘటనపై భారత వైమానిక దళం(IAF) స్పందించింది. ఈ దుర్ఘటనలో శిక్షణలో ఉన్న ఇద్దరు పైలెట్లు మృతిచెందినట్లు ధృవీకరించింది. ప్రమాదం నిన్న రాత్రి 9.10గంటలకు జరిగినట్లు పేర్కొంది. ఇద్దరు యుద్ధవీరులను కోల్పోవడం నిజంగా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు వెల్లడించింది. BREAKING: MiG-21 crash in Barmer, Rajasthan. Official word on pilot/s awaited from IAF shortly. pic.twitter.com/T32JaGT5QK — Livefist (@livefist) … Read more

    దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు

    కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆందోళన చేశారు. బీజేపీ కక్ష్యపూరిత చర్యలు మానుకోవాలని నినాదాలు చేశారు. అటు ఏఐసీసీ ప్రధాన కార్యలయం వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీ వేణుగోపాల్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేశాయి. #WATCH | Delhi: Congress party … Read more

    నేడు కార్గిల్ విజయ్ దివాస్.. అమరులకు వందనం

    కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా రక్షణ దళాల చీఫ్ లు అమరవీరులకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌదరీ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమర వీరులకు నివాళులు అర్పిస్తూ వైమానిక దళం హెలీకాప్టర్లతో విన్యాసాలు చేసింది. 1999లో కార్గిల్- ద్రాస్ ప్రాంతాన్ని పాక్ ఉగ్రమూకలు అక్రమించుకోగా.. వారిని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో అనేక మంది భారత జవానులు … Read more