• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సైనికుడి పాదాల‌ను తాకిన చిన్న‌పాప‌..వైర‌ల్ వీడియో

    ఒక చిన్న పాప గౌర‌వంతో ఆర్మీ వ్య‌క్తి కాళ్లు మొక్కిన‌ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇందులో మెట్రో స్టేష‌న్‌లో కొంత మంది సైనికులు నిల‌బ‌డి ఉన్నారు. ఆ పాప వాళ్ల ద‌గ్గ‌రికి ప‌రిగెత్తుకుంటూ వెళ్లింది. ఒక్క క్ష‌ణం వారిని చూసింది. అందులో ఒక ఆర్మీ వ్య‌క్తి పాప‌ను చూసి ప్రేమ‌గా బుగ్గ‌ను గిల్లాడు. వెంటనే ఆ పాప‌ అత‌డి పాదాల‌ను తాకి క‌ళ్ల‌కు అద్దుకుంది. దీంతో అక్క‌డున్న వారంతా ఆశ్ఛ‌ర్య‌పోయారు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ఆ చిన్న‌పాప‌తో పాటు త‌ల్లిదండ్రుల‌ను ప్ర‌శంసిస్తున్నారు. … Read more

    మెట్రో ట్రైన్‌లో ప్రేమికుడి చెంప ప‌గ‌ల‌గొట్టిన‌ అమ్మాయి

    ఇద్ద‌రు ప్రేమికులు ఢిల్లీ మెట్రోలో గొడ‌వ‌పడుతూ కొట్టుకుంటున్నీ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. అస‌లు ఏం జ‌రిగింద‌టే.. అమ్మాయి తాను కొన్న ఒక టీష‌ర్ట్‌ను తీసి అబ్బాయికి చూపిస్తూ దీన్ని రూ.1000 పెట్టొ కొన్నాను అని చెప్పింది. దానికి అంత ఉండ‌దు. రూ.150 పెడితే వ‌స్తుంద‌ని అబ్బాయి అన్నాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె ప్రేమికుడి చెంప ప‌గ‌ల‌గొట్టింది. గొడ‌వ మ‌రింత పెద్ద‌దై అత‌డిపై దాడిచేస్తూనే ఉంది. అబ్బాయి కూడా అమ్మాయిపై చేయి చేసుకున్నాడు. దీంతో నేను మా అమ్మ‌కి చెప్పి నీ ప‌ని … Read more

    పానీపూరి చేసిన మమతా బెనర్జీ.. వీడియో వైరల్

    గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్‌లో కొత్తగా ఎన్నికైన బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాల్గొనేందుకు డార్జిలింగ్ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ రోడ్డు పక్కన ఫుడ్ స్టాళ్లలో పానీపూరి చేసి చిన్నారులకు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియోను అల్ ఇండియా తృణముల్ కాంగ్రెస్ తమ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరు కూడా చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. Our Hon’ble Chairperson @MamataOfficial visited SHG … Read more

    పోటెత్తిన వరదలు.. 16 మందిని కాపాడిన కోస్ట్ గార్డ్

    గతకొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌లో కురిసిన భారీ వర్షాలకు అంబికా నది పొంగింది. దీంతో ఒక్కసారిగా వరదలొచ్చాయి. ఈ వరదల్లో 16 మంది చిక్కుకోవడంతో వారిని ఇండియన్ కోస్ట్ గార్డ్ టీం హెలికాఫ్టర్ ద్వారా రక్షించింది. వారు రక్షిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరు కూడా చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. In a swift … Read more

    వరదల బీభత్సం..సురక్షిత ప్రాంతాలకు 3 వేల మంది

    ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు గుజరాత్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వల్సాద్ సిటీ నీట మునిగింది. మరోవైపు బొడేలీలో 55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ప్రధాని మోదీ గుజరాత్ సీఎం భూపేంద్రకు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. వరదల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో గుజరాత్‌లో 3,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

    వాగులో కొట్టుకుపోయిన పీడీఎస్ బియ్యం లోడ్ లారీ

    దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో పీడీఎస్‌ బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీ వరద నీటిలో కొట్టుకుపోయింది. మెట్టుపల్లి అడవుల నుంచి ప్రవహించే వాగు దాటుతుండగా సాంకేతిక లోపంతో ట్రక్కు ఇంజన్ ఆగిపోయింది. ఈ క్రమంలో వాగులో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగి వరద ఉద్ధృతి ఎక్కువైంది. దీంతో ఆ ప్రవాహంలో ట్రక్కు కోట్టుకుపోగా డ్రైవర్ వంతెనను వదిలి సురక్షిత ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడి తహశీల్దార్, ఆహార శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

    వ‌ర‌ద‌ల్లో కొట్టుకొపోయిన కారు.. 9 మంది మృతి

    ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాల‌తో న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. ఈరోజు ఉదయం కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా రామ్‌న‌గ‌ర్‌లోని ధేలా నది వ‌ద్ద ఒక కారు కొట్టుకొపోవ‌డంతో 9 మంది మ‌ర‌ణించారు. ఒక‌ బాలిక‌ను సుర‌క్షితంగా ర‌క్షించారు. మ‌రో 5 మంది వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయార‌ని అధికారులు దృవీక‌రించారు. మృతులంద‌రూ పంజాబ్‌కు చెందిన‌వార‌ని వెల్ల‌డించారు.

    ముంబయిని ముంచెత్తిన వానలు..నిలిచిన ట్రాఫిక్

    దేశ ఆర్థిక రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అక్కడి జనం నానా తంటాలు పడుతున్నారు. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తి ప్రజలు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. పలు చోట్ల రైల్వే స్టేషన్లు సైతం నీటితో నిండిపోయాయి. మరికొన్ని రోజులు వానలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అధికారులు, NDRF సిబ్బందిని అప్రమత్తం చేశారు.

    అంబులెన్స్‌కు దారి ఇవ్వ‌కుండా వెళ్లి ట్ర‌క్కును ఢీ కొట్టిన కారు

    రోడ్డుపై అంబులెన్స్ వెళ్తుంటే సాధార‌ణంగా వాహ‌నాలు అన్ని అడ్డు త‌ప్పుకొని దారినిస్తాయి. కానీ ఈ వీడియోలో కారు డ్రైవ‌ర్ అంబులెన్స్‌కు దారి ఇవ్వ‌కుండా దానికి పోటీగా స్పీడ్‌గా వెళ్లాల‌నుకున్నాడు. వేగం పెర‌గ‌డంతో ఒక ట్ర‌క్కును ఢీకొట్టి రెండు రౌండ్లు తిరిగిన కారు ప‌క్క‌న ఉన్న డివైడ‌ర్‌పైకి దూసుకెళ్లింది. ఈ సంఘ‌ట‌న‌ను అంబులైన్స్ ముందు ఉన్న కెమెరా రికార్డు చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

    అది బైకా ఆటోనా భ‌య్యా? ఒక బైక్‌పై ఏడుగురా?

    సాధార‌ణంగా బైక్‌పై ఇద్ద‌రు వెళ్లాలి. ముగ్గురు వెళ్లినా అది ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధ‌మే. కానీ ఇక్క‌డ‌ ఒక బైక్‌మీద ఇద్ద‌రు కాదు ముగ్గురు కాదు ఏకంగా ఏడుగురు వెళ్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియ‌లో వైర‌ల్‌గా మారింది. అది బైక్ అనుకుంటున్నారా ఆటో అనుకుంటున్నారా అని నెటిజ‌న్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్య‌క్తి బైక్‌పై ముందు ఇద్ద‌రు పిల్ల‌లు, వెన‌క ఇద్ద‌రు మ‌హిళ‌లు కూర్చొని.. ఆ మ‌హిళ‌లు ఇద్ద‌రు పిల్ల‌ల్ని ఎత్తుకున్నారు. ఇలా మొత్తుం ఏడుగురు క‌లిసి ఒక బైక్‌పై వెళ్తున్న ఈ వీడియో … Read more