• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు 5 కేజీలు తగ్గారు: భువనేశ్వరి

    రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జైలులోని వాటర్ ట్యాంకులు శుభ్రం చేయకపోవడం వల్లే చంద్రబాబుకు చర్మ సమస్యలు వచ్చాయని విమర్శించారు. కలుషిత నీరు తాగటం వల్ల ఆయన కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయన 5 కేజీలు బరువు తగ్గారు. ఆందోళనలను పోలీసులు పరిగణలోకి తీసుకోవడం లేదని వాపోయారు.

    పొన్నాలకు జనగామ టికెట్?

    జనగామ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాలను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించేందుకు స్వయంగా కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లనున్నారు. జనగామ టికెట్‌పై ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించలేదు. పొన్నాల బీఆర్ఎస్‌లోకి చేరికతో ఆ టికెట్ ఆయనకు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరెడ్డి ప్రచారంలో ఉన్నారు. ఇటీవలే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య హరీష్ సయోధ్య కుదిర్చిన సంగతి తెలిసిందే.

    కాంగ్రెస్‌కు పొన్నాల రాజీనామా

    అసెంబ్లీ ఎన్నికల వేళ.. టీకాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తనకు పార్టీలో అవమానం జరిగిందంటూ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు. జనగామా టికెట్‌ను తనకు కాకుండా మరొకరికి కేటాయించడంపై పొన్నాల ఆగ్రహంగా ఉన్నారు. కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డికి జనగామా టికెట్ ఇస్తారని ప్రచారంలో ఉంది. దీంతో మనస్తాపం చెందిన పొన్నాల కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.

    ‘తెలంగాణను ఆంధ్రలో కలపాలనుకుంటున్నారు’

    మంత్రి గంగుల కీలక వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్ లేని తెలంగాణను ఊహించలేం. ఆంద్రవాళ్లు తెలంగాణను తిరిగి ఆంధ్రలో కలపాలని చూస్తున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ గురించి ఎందుకు? కాంగ్రెస్ బీ ఫారమ్‌లు బీజేపీ ఆఫీస్‌లో బీజేపీ బీ ఫారమ్‌లు కాంగ్రెస్ ఆఫీసులో తయారవుతున్నాయి. ఎన్నికలప్పుడు వచ్చేవారిని చూసి ప్రజలు మోసపోవద్దు’ అని చెప్పుకొచ్చారు.

    బోరబండలో ఘోర విషాదం

    హైదరాబాద్ నగరంలోని బోయిన్‌పల్లిలో ఇద్దరు కుమార్తెలతో తండ్రి ఆత్మ హత్య మరవక ముందే.. బోరబండలో మరొక విషాద ఘటన చోటు చేసుకుంది. జ్యోతి అనే మహిళ తన ఇద్దరు కొడుకులకు విషమిచ్చి సూసైడ్ చేసుకుంది. ఇద్దరు చిన్నారులను అర్జున్(4), ఆదిత్య(2)గా గుర్తించారు. కుటుంబ కలహాలతోనే జ్యోతి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    4 రోజుల్లోనే రూ.37 కోట్లు స్వాధీనం

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన వేళ.. పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున డబ్బు, బంగారం పట్టుబడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.37 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో తనిఖీల్లో మొత్తం రూ.98 కోట్ల విలువైన డబ్బు, బంగారం మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈసారి 4 రోజుల్లోనే ఈ స్థాయిలో పట్టుబడటం గమనార్హం. ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో డబ్బు, మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతోంది.

    ఇద్దరు కుమార్తెలతో సహా తండ్రి సూసైడ్

    హైదరాబాద్ నగరంలోని బోయిన్‌పల్లిలో ఓ వ్యక్తి ఇద్దరు కుమార్తెలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు శ్రీకాంత్ చారి(42), స్రవంతి(8), శ్రావ్య(7)గా గుర్తించారు. మృతదేహాల పక్కన నిద్ర మాత్రలు ఉండటంతో వీరు గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర మాత్రలు మింగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

    రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

    ఈ నెల 14 నుంచి తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 19న సాయంత్రం 6.30 గంటలకు శ్రీవారి గరుడ ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా 14వ తేదీ నుంచి 23 వరకు స్వామివారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

    సీఎం జగన్‌కు పిచ్చి ముదిరింది: లోకేష్

    సామర్లకోట బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నాలుగున్నరేళ్లుగా దోచుకోవ‌డం, దాచుకోవ‌డం, దాడులు చేయ‌డం త‌ప్పించి చేసిన అభివృద్ధి శూన్యం. సీఎంగా చేసిన మంచి ప‌ని ఒక్కటీ లేదు. దమ్ముంటే చెప్పాలి. అస‌లే సైకో అయిన జ‌గ‌న్‌కి అధికారమ‌దం ఎక్కింది. ఫ్రస్టేష‌న్ పీక్స్‌కి చేరి పిచ్చిగా వాగుతున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారిపై జ‌గ‌న్ ప్రేలాప‌న‌లు చూస్తుంటే పిచ్చి ముదిరింద‌ని స్పష్టం అవుతోంది అని ఎద్దేవా చేశారు.

    రేవంత్, హరీష్ బలికా బకరాలు: బండి

    BRS, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. “ఇతర పార్టీలలో డబ్బులు ఇచ్చి కండువాలు కప్పుతున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ఒక్కటి. ప్రధాని మాట్లాడిన తర్వాత వాస్తవ విషయాన్ని ప్రజలు గుర్తించారు. బీజేపీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారు. మంచి అభ్యర్థులను కిషన్ రెడ్డి నాయకత్వంలో ఎంపిక చేసి ఢిల్లీకి పంపాం. కానీ కాంగ్రెస్ లిస్ట్ ప్రగతి భవన్‌కి వెళ్ళింది. రేవంత్ రెడ్డికి తెలియట్లేదు. కేసీఆర్‌ 30 మందికి పైసలు పంపారు. తెరవెనుక ఏమీ జరుగుతుందో అయన తెలుసుకోవడం లేదు. … Read more