• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేవంత్‌ రెడ్డిపై కవిత ఫైర్

    బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యను రాజకీయం చేయడంపై ఆమె మండిపడ్డారు. రేవంత్ రెడ్డి శవాల మీద పేలాలు ఏరుకోవడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ”రేవంత్ ఆవేదన బూటకం.. కాంగ్రెస్ ఆందోళన నాటకం’’ అంటూ కవిత మండిపడ్డారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని తెలిపారు.. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    ‘ప్రవళిక మృతిపై నివేదిక ఇవ్వండి’

    TG: గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక (23) ఆత్మహత్యపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్‌ ఆదేశించారు. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిరుద్యోగుల్లో ఉన్న ఒత్తిడికి ఈ మరణం అద్దం పడుతోందని గవర్నర్‌ అన్నారు. నిరుద్యోగ యువత నిరాశకు లోను కావద్దని, ఉపాధి వేటలో ధైర్యంగా ముందుకెళ్లాలని కోరారు. నిరుద్యోగులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

    అన్న ఫ్యామిలీనే బలిగొన్న తమ్ముడు

    పంజాబ్‌లోని మొహాలి జిల్లాలో మత్తు పదార్థాలకు బానిసైన ఓ యువకుడు సొంత అన్న కుటుంబాన్ని అంతం చేశాడు. ఖరడ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఆర్థికంగా స్థిరపడిన అన్న సత్వీర్‌సింగ్‌పై నిందితుడు కక్ష పెంచుకున్నాడు. సత్వీర్‌సింగ్‌, అమన్‌దీప్‌ కౌర్‌ దంపతులతోపాటు వారి కుమారుడు లఖ్‌వీర్‌ సింగ్‌ను చంపేశాడు. తొలుత అన్న భార్యను కత్తితో పొడిచి అనంతరం అన్నను పారతో బాది హత్య చేశాడు. ఆ తర్వాత రెండేళ్ల చిన్నారిని నిర్దాక్షిణ్యంగా చిదిమేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

    ‘మనుషుల ప్రాణాలకు విలువ లేదు’

    HYD: గ్రూప్ 2 అభ్యర్థిని మర్రి ప్రవల్లిక (23) బలవన్మరణంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా సీఎం కేసీఆర్ చెవికి వినబడటం లేదని విమర్శించారు. ఈ పెద్దమనిషి (కేసీఆర్) పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదని మండిపడ్డారు. రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదన్నారు. ప్రవల్లిక సూసైడ్ లెటర్‌ను గమనిస్తే ఇదే అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

    బంగారం ప్రియులకు భారీ ఊరట

    వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.54,150 పలుకుతోంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.59,060 వద్ద ట్రేడింగ్ అవుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54 వేల వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ.58,910గా ఉంది. ఏపీలోని విశాఖ, … Read more

    హైదరాబాద్ పోలీస్ బాస్ ఎవరు..?

    ఎన్నికల వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. తెలంగాణ సీఎస్ శాంతికుమారి ముగ్గురు పేర్లతో కూడిన లిస్టును సీఈసీకి పంపించారు. ఈ ముగ్గురిలో ఒకరి పేరును నగర సీపీగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం లోపు ఈసీ నిర్ణయం వెలువడుతుందనే చర్చ జరుగుతోంది. కీలకమైన పోస్ట్ కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది.

    డీఎస్సీ పరీక్ష వాయిదా

    తెలంగాణలో డీఎస్సీ వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం ప్రకటించింది. మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబరు 20 నుంచి 30 వరకు టీఆర్‌టీ పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, నవంబర్‌ 30న ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో టీఆర్‌టీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తాజాగా విద్యాశాఖ ప్రకటించింది.

    తెలంగాణలో ‘స్కామ్ గ్రెస్‌’కు చోటు లేదు: KTR

    కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఓటర్లను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ కర్ణాటక నుంచి డబ్బులు తలిస్తుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని విమర్శించారు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ కాంగ్రెస్ నేతలు దొరికిపోయారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘స్కామ్ గ్రెస్‌’కు తెలంగాణలో చోటు లేదని మంత్రి పేర్కొన్నారు.

    ఏపీలో రూ.750 కోట్లతో స్టార్ హోటల్స్

    టెక్ మహీంద్రా సంస్థ ఏపీలో రూ.750 కోట్ల పెట్టుబడితో మూడు స్టార్ హోటల్స్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ సీఎం జగన్‌ను కలిసి వివరాలు వెల్లడించారు. వైజాగ్ సహా మూడు పర్యాటక ప్రాంతాల్లో ఒక్కోదానికి రూ.250 కోట్ల చొప్పున ఖర్చు చేసి మూడు స్టార్ హోటల్స్ నిర్మించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మరో రెండు నెలల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మాణానికి శంకుస్థాప చేస్తామని చెప్పారు.

    అందుకే రాజీనామా చేశా: పొన్నాల

    కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అమ్మకానికి పెట్టారు. గత రెండేళ్లుగా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కార్యకలపాలు జరుగుతున్నాయి. సొంత పార్టీలోనే తాము పరాయి వాళ్లము అయ్యాం. మా బాధలు చెప్పుకునేందుకు 50 మంది బీసీ నేతలం వెళ్తే ఏఐసీసీ అపాయింట్ మెంట్ ఇవ్వదు. ఎక్కడైనా రేవంత్‌కు నమస్తే పెడితే కనీసం స్పందించడు అని ఆవేదన వ్యక్తం చేశారు.