• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ

    స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు క్వాష్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ ప్రారంభించనుంది. సోమవారం చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే గట్టిగా వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆయన అరెస్ట్ చేసే టైంలో గవర్నర్ అనుమతి పోలీసులు తీసుకోలేదని వాదించారు. మరోవైపు 17ఏ చంద్రబాబుకు వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఈరోజు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు … Read more

    తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోని 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,937 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 24,101 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    చంద్రబాబుకు స్కిన్ అలర్జీ

    రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు. ఉక్కపోత కారణంగా ఆయనకు ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇద్దరు స్కిన్ స్పెషలిస్టులు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని జైలు అధికారులు ప్రకటించారు.

    ‘బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు’

    రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా 54 మందితో కూడిన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిల తొలి జాబితాను ఆయన విడుదల చేశారు. వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ గత పదేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే 45 రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

    అత్తను కాల్చిచంపిన అల్లుడు

    TS: హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓవ్యక్తి అత్తను అల్లుడు కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళ్తే గుండ్ల సింగారానికి చెందిన రమాదేవికి, ప్రసాద్‌తో 25 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో మూడేళ్లుగా భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్‌.. తుపాకీని తీసుకుని అత్తగారి ఇంటికి వెళ్లాడు. అక్కడ అత్త కమలమ్మ(53)కు ప్రసాద్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపంతో ప్రసాద్ తుపాకీతో కమలమ్మను కాల్చిచంపాడు.

    దసరా సెలవులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు

    తెలంగాణలో దసరా సందడి మొదలైంది. పాఠశాలలకు రేపటి నుంచి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులతో బస్టాండ్‌లు రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దాదాపు అన్ని బడులలో నిన్న పరీక్షలు ముగిసాయి. ఈ రోజు స్కూల్స్, కాలేజీలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. అనంతరం పాఠశాలలు ముగిసిన తర్వాత హాస్టల్ విద్యార్థులు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో రైల్వేస్టేషన్, బస్టాండ్‌లు విద్యార్దులతోె కిటకిటలాడుతున్నాయి..

    కేసీఆర్‌పై పోటీ చేస్తా: ఈటల

    బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. అధిష్టానం అవకాశం ఇస్తే కేసీఆర్ పోటీ చేసే రెండు చోట్లా పోటీ చేస్తానని ప్రకటించారు. హుజూరాబాద్‌లో మీరే కథానాయకులు అవ్వాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భార్య జమున కేసీఆర్‌పై పోటీకి దిగుతారంటూ వస్తున్న ప్రచారం వాస్తవం కాదని రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈటల ప్రకటనతో కేసీఆర్‌పై పోటీకి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో కొన్నిరోజులు వేచి చూడాల్సిందే..

    119 స్థానాల్లో పోటీ చేస్తాం: షర్మిల

    తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని YSRTP నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగనున్నానని ప్రకటించారు. తల్లి విజయమ్మ, భర్త అనీల్ కూడా పోటీ చేస్తారని చెప్పారు. పార్టీ బీఫామ్‌ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని నేతలకు షర్మిల సూచించారు.

    TS Election: భోజనం రూ.80.. సమోసా రూ.10

    అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. నీళ్ల ప్యాకెట్ నుంచి మొదలుకుని ఆహారం, సభల్లో ఏర్పాటు చేసే భారీ బెలూన్లు, ఎల్‌ఈడీ తెరలకు సైతం ధరలను నిర్ణయించింది. అభ్యుర్థులు ఎన్నికల ఖర్చులను ఈసీకి సమర్పించే ముందు వ్యయంలో కుర్చీలు, టేబుళ్లు, వాహనాల కిరాయి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారుల పారితోషికం వివరాలు ఉండాలని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల ఖర్చులో భాగంగా చికెన్ బిర్యానీ రూ.140, భోజనం రూ.80 సమోసా రూ.10 మాత్రమే ఖర్చుగా లెక్కిస్తామని ఈసీ … Read more

    హైదరాబాద్ ఇన్‌చార్జ్‌ సీపీగా విక్రమ్‌సింగ్

    హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో ఇన్‌చార్జ్ సీపీగా విక్రమ్‌సింగ్ మాన్ నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంతో ముగ్గురు పోలీస్ కమిషనర్లు, నలుగురు కలెక్టర్లు, పది మంది ఎస్పీలతో సహా మొత్తం 20 మంది ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బదిలీ అయిన వారి స్థానంలో ఇన్‌చార్జ్‌లను నియమించారు.