• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘రూ.50 వేలకు మించి బయటకు తేవద్దు’

    తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేశారు. చందానగర్‌లో 5.5 కిలోల బంగారం పట్టుకున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా బంగారం సరఫరా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరు కూడా 50వేలకు మించి నగదు బయటికి తీసుకురాకూడదని పోలీసులు తెలిపారు. ఒకవేళ 50 వేలకు మించి నగదుతో పాటు బంగారు నగలు బయటకు తీసుకువస్తే వెంట సరైన పత్రాలు ఉండాలి అని … Read more

    నేడు అథ్లెట్లతో ప్రధాని మోదీ భేటీ

    ఏషియన్‌ గేమ్స్‌ అథ్లెట్లతో నేడు ప్రధాని మోదీ భేటీ కానున్నారు. మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న భారతీయ అథ్లెట్ల బృందంతో మోదీ సంభాషించనున్నారు. అటు ఏషియన్ గేమ్స్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. ఈ గేమ్స్‌లో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలతో పతకాల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది.

    మళ్లీ పెరిగిన బంగారం ధర

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈ వారంలో వరుసగా రెండో రోజు పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 200 పెరిగి రూ.53,350కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి రూ.58,200కు ఎగబాకింది. కిలో వెండి ధర రూ. 500 పెరగింది. దీంతో కేజీ వెండి ధర రూ.75,500కు చేరింది. అటు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

    డబ్బుకాదు.. డాలర్లు అడగండి: కేటీఆర్

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు లెక్క కుదిరిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నవంబర్ 30న ఎన్నికలు డిసెంబర్ 3 కౌండింగ్ రెండు కలిపితే 6 ఇది మాకు అచ్చొచ్చిన నంబర్ అని తెలిపారు. సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు ప్రయత్నిస్తారని అవి కాకుండా డాలర్లు కావాలని అడగండని ప్రజలకు కేటీఆర్ సూచించారు.

    కిలోల కొద్ది బంగారం, వెండి సీజ్‌

    HYD: చందానగర్ పీస్ పరిధిలోని తారానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న భారీగా బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 5.65 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. నిజాం కాలేజ్ పరిసరాల్లో చేసిన తనిఖీల్లో గేట్‌ నంబర్‌ 1 వద్ద.. 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి సీజ్‌ చేశారు. ఫిలింనగర్ పరిధిలోని షేక్‌పేట నారాయణమ్మ కాలేజీ మెయిన్ రోడ్డు వద్ద ఓ కారులో రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    కల్వకుంట్ల స్కాంలీకి కౌంట్ డౌన్: రేవంత్

    టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు విమర్శలతో ఆసక్తికర ట్వీట్ చేశారు. కల్వకుంట్ల స్కాంలీకి కౌంట్ డౌన్ మొదలైందని విమర్శించారు. ‘ఇది.. దగాపడిన యువత, ఆగమైన అన్నదాత కన్నెర్ర చేస్తూ చెప్తున్న కౌంట్ డౌన్. ఇది.. కన్నీళ్లు పెట్టిన సర్కారు బడి చిన్నారి, పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగిన పెద్ద మనిషి చేస్తున్న కౌంట్ డౌన్. ఇది.. నిలువ నీడలేని పేద కుటుంబం, మాట్లాడే స్వేచ్ఛలేని మేధావి వర్గం నినదిస్తున్న కౌంట్ డౌన్. ఈ 52 రోజుల కౌంట్ డౌన్ నియంత సర్కారుకు రాస్తున్న … Read more

    ఓటర్లకు సీఈవో కీలక సూచనలు

    తెలంగాణలో ఎన్నికల కోట్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రత్యేక ఓటర్లకు రవాణా సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది. మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని వెల్లడించింది. ఫిర్యాదుల కోసం 1950ను సంప్రదించాలి ఎన్నికల సంఘం పేర్కొంది.

    అలా చేస్తే పరువైనా దక్కుతుంది: హరీష్‌రావు

    బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. స్వంత రాష్ట్రంలోనే బీజేపీని గెలిపించుకోలేని నడ్డా తెలంగాణలో గెలిపిస్తారా? అని విమర్శించారు. తెలంగాణలో డిపాజిట్ల కమిటీనైనా వేసుకుంటే బీజేపీకి పరువైన దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హంగ్ ఏర్పడదని కేసీఆర్ హ్యాట్రిక్ కొడుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలని హరీష్‌రావు కోరారు. మంచిర్యాల జిల్లాలో ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

    మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్

    పాలమూరు ప్రజాగర్జన’ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలు కాదు.. జాతీయస్థాయిలో అధికార మార్పు కావాలని కోరుతోంది దేశ ప్రజలు..BRS పార్టీ స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే పదిలంగా ఉంది. కానీ బిజెపి స్టీరింగ్..అదాని చేతిలోకి వెళ్లిపోయింది. తెలంగాణలో రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం… మిలియన్ డాలర్ జోక్’. అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

    చంద్రబాబుపై సింపతి పెరిగింది: మురళీమోహన్

    టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం బాధను కలిగిస్తోందని నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిని జైలులో పెట్టడం సరికాదన్నారు. అవినీతి మచ్చలేకుండా చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ప్రజల్లో ఆయనపై సింపతి పెరిగిందన్నారు. ఎచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపుతో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతుందని మురళీమోహన్ అన్నారు..