• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్

    క్యాసినో కింగ్‌గా పేరుగాంచిన చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీలో చేరారు. బర్కత్‌పూరలోని బీజేపీ కార్యాలయంలో చీకోటి పార్టీ కండువా కప్పుకున్నారు. అతడిని బీజేపీ నేత డీకే అరుణ, ప్రవీణ్‌కు పార్టీ కండువా కప్పి సాధర ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

    హైదరాబాద్‌లో ‘ఎనీ టైమ్ క్లినిక్’ మెషిన్

    దేశంలోనే మొదటి సారిగా ‘ఎనీ టైమ్ క్లినిక్’ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ మెషిన్‌ ద్వారా జ్వరం నుంచి కేన్సర్ వరకు అన్ని రకాల వైద్య పరీక్షలు స్వయంగా మనమే చేసుకోవచ్చు. దీన్ని తొలిసారిగా చందానగర్‌లోని ప్రణామ్ ఆస్పత్రిలో ప్రారంభించారు. నార్మల్ హెల్త్ చెకప్, జ్వరం, కంటి పరీక్షలు వంటి 75 రకాల టెస్టులు చేసుకునేందుకు ఈ మెషిన్ ఉపయోగపడుతుంది. మెషిన్‌కు అమర్చిన కెమెరా ద్వారా వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే వైద్యులతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం సైతం ఉంది.

    ‘తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోంది’

    సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో గోదావరి తలాపున వెళ్తున్నా నీళ్ల కోసం అవస్థలు పడ్డామని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 12.70 లక్షల మందికి కళ్యాణలక్ష్మి అందించామని హరీశ్ రావు పేర్కొన్నారు. గతంలో ప్రైవేట్ ఆస్పత్రులు పెరిగితే ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు పెరుగుతున్నాయని చెప్పారు.

    ఈ నెల 10న తెలంగాణకు అమిత్ షా

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 10న తెలంగాణ రానున్నారు. ఆయన ఒకే రోజు రెండు సభల్లో పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. 10న ఉదయం ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడలో జరిగే భారీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. త్వరలో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.

    సీఎం కేసీఆర్‌కు ఛాతిలో ఇన్పెక్షన్

    సీఎం కేసీఆర్‌కు ఛాతిలో బాక్టీరియల్ ఇన్పెక్షన్ సోకిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్ గత మూడు వారాలుగా ప్రజలకు దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఆయన కోలుకుంటున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

    తెలంగాణలో 57 నూతన కోర్టులు

    తెలంగాణలో కొత్తగా 57 కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై జరిగే నేరాలను విచారించేందుకు గాను ప్రత్యేకంగా 10 కోర్టులు ఏర్పాటు చేశారు. కొత్త కోర్టుల్లో సిబ్బందిని నియమించేందుకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

    TSPSC గ్రూప్‌-4 తుది ‘కీ’ విడుదల

    TSPSC గ్రూప్‌-4 తుది ‘కీ’ విడుదలైంది. ఈ ‘కీ’ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అయితే ఆన్‌లైన్‌ ద్వారా అధికారులు అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీతో వెరిఫై చేయించి తాజాగా తుది కీ విడుదల చేశారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా.. 80శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

    టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే

    TS: టీచర్ల బదిలీలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. స్కూల్ అసిస్టెంట్లు ఎస్జీటీలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19 వరకు ఎలాంటి బదిలీలు చేపట్టరాదని కోర్టు స్టే విధించింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్యులు జారీ చేసింది. అక్టోబరు 6, 7 తేదీల్లో బదిలీలకు సంబంధించిన వెబ్‌‌ఆప్షన్‌కు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.. వెబ్‌ ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత ఖాళీల పాయింట్లు, స్పౌజ్‌ పాయింట్లు ఎలాంటి మార్పులుండవని అధికారులు స్పష్టం చేశారు. తాజాగా దీనిపై హైకోర్టు స్టే … Read more

    BRSకు ఎమ్మెల్యే రాజీనామా

    BRSకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా చేస్తున్నట్లు ఆమె బహిరంగ ప్రకటన చేశారు. ఏ పార్టీ నుంచి పోటీచేస్తానన్నది త్వరలో ప్రకటిస్తామన్నారు. BRS ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల అభ్యుర్థుల మొదటి జాబితాలో రేఖా నాయక్ పేరు లేకపోవడంతో ఆమె అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే..

    కేసీఆర్‌పై నడ్డా ఘాటు విమర్శలు

    BRSపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటు విమర్శలు చేశారు. మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో బీజేపీ కౌన్సిల్‌ సమావేశంలో నడ్డా మాట్లాడుతూ.. ‘తెలంగాణ కోసం కేంద్రం 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో BRS కుటుంబపాలన అంతం కావడం ఖాయం. కేవలం తమ ఆకాంక్షల కోసమే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఆ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయాయి. BRS కుటుంబ పార్టీ. కేసీఆర్‌కు ఒక సందేశం ఇస్తున్నా వచ్చే ఎన్నికల్లో అన్నీ ముగిసిపోతాయి’’ అని నడ్డా … Read more