• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బిల్లా రంగాల్లా కేటీఆర్ హరీష్ దోపిడి: రేవంత్

    టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపై విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరు మంత్రులు బిల్లా రంగాలాగా రాష్ట్రమంతా తిరుగుతూ దోచుకుంటున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ ద్వారా 10 వేల ఎకరాల భూమి కాజేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. కాంట్రాక్టుల జేబులు నింపేందుకే ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. ఇంకో రెండు నెలల్లో బీఆర్ఎస్ అధికారం ముగిసి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు.

    8న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్

    తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 8-10వ తేదీల మధ్య విడుదల కానుంది. అయితే ఆదివారమే షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, చత్తీస్‌ఘర్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 10-15 మధ్య ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

    కేసీఆర్ ఓవైసీ కుటుంబానికి బానిస: కిషన్ రెడ్డి

    ఓవైసీ కుటుంబానికి కట్టు బానిసలుగా బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘అసదుద్దీన్ చేతిలో స్టీరింగ్ ఉన్న ప్రభుత్వాన్ని సాగనంపి సస్యశ్యామల తెలంగాణ సాధించాలి. మహిళల అవమానం చేసిన పార్టీ, రజాకార్ల పార్టీ, ఎంఐఎం పార్టీ హైదరాబాద్‌లో పుట్టింది. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటారు కేసీఆర్‌. కేసీఆర్‌ కూడా మహిళ వ్యతిరేకి. మహిళ మంత్రి లేని ప్రభుత్వం నడిపాడు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా మహిళ బిల్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. తెలంగాణలో మహిళల ఓట్లు అడుగే హక్కు కాంగ్రెస్‌కు లేదు’ అని … Read more

    బాడీ గార్డుపై చేయి చేసుకున్న మంత్రి మహ్మద్ అలీ

    తెలంగాణ హోంమంత్రి మహ్మద్ అలీ తన బాడీ గార్డుపై చేయి చేసుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన సహనం కోల్పోయారు. బోకే ఇవ్వలేదంటూ బాడీ గార్డుపై దురుసుగా ప్రవర్తించారు. మంత్రి ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. https://x.com/shinenewshyd/status/1710192290218869233?s=20

    ప్రారంభమైన సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం

    తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే అల్పాహరం కార్యక్రమం లాంచనంగా ప్రారంభమైంది. ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల ప్రభుత్వ పాఠశాలలో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 27వేల 147 పాఠశాలల్లో దాదాపు 23లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. స్కూలు టైమింగ్‌కు అర్ధగంట ముందు 1-10 వ తరగతి వరకు పిల్లలకు అల్పాహారం అందించనున్నారు.

    లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. 405 పాయింట్లు లాభంతో సెన్సెక్స్.. 65,361 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 59 పాయింట్లు వృద్ధి చెందిన నిఫ్టీ 19,605 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. టాటా మోటార్స్, టైటాన్, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎయిర్ టెల్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.22 పైసల వద్ద కొనసాగుతోంది.

    నేడు ‘సీఎం అల్పాహారం’ ప్రారంభం

    తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించేందుకు తీసుకువస్తున్న ‘సీఎం అల్పాహారం’ పథకం నేడు ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక స్కూల్‌ చొప్పున ఈ రోజు ప్రారంభించనున్నారు. మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాలలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఆయన స్థానంలో మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. ఉప్మా, కిచిడీ, పొంగల్, ఇడ్లీ, పూరీతో మెనూ సిద్ధం చేశారు.

    10న కాంగ్రెస్ జాబితా ఖరారు

    ఈ నెల 10న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 60 చోట్ల సింగిల్ అభ్యర్థి ఉండగా, 20 సెగ్మెంట్లలో ఇద్దరు చొప్పున.. మిగతా నియోజకవర్గాల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్నారు. 8న స్క్రీనింగ్ కమిటీ భేటీ, 9న సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనున్నారు. 10న ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించి తుది జాబితా ఖరారు చేయనున్నారు.

    తెలంగాణకు ఎంతో ప్రాధాన్యత ఉంది: సీఈసీ

    రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ‘యంగెస్ట్ స్టేట్ తెలంగాణ.. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ కోసం మేము కమిట్మెంట్ తో పనిచేస్తున్నాం. రాజకీయ పార్టీలతో కలిసినప్పుడు వాళ్ల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి.. అక్రమ నగదు – మద్యంను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు’ అని పేర్కొన్నారు.

    కేసీఆర్‌కు అధికారం తలకెక్కింది: కిషన్ రెడ్డి

    సీఎం కేసీఆర్ కుటుంబానికి అధికారం తలకెక్కిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘ప్రధాని తెలంగాణకు వస్తే.. ఆయనను టూరిస్ట్‌ అనడమేంటి? కేంద్రం తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి పనులను స్వాగతించాల్సిందిపోయి విమర్శిస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబానికి అధికారం తలకెక్కింది. కేటీఆర్‌ అభద్రతాభావంతో ఉన్నారు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ప్రగతి భవన్‌లో కల్వకుంట్ల కుటుంబం ఇంకా 2 నెలలు మాత్రమే ఉంటుందిట’ అని చెప్పుకొచ్చారు.