• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎర్రబెల్లి ప్రేమతోనే కొట్టారు: MLA అంజయ్య

    మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన తల మీద కొట్టిన ఘటన మీద షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వివరణ ఇచ్చారు. ఎర్రబెల్లి తనను ప్రేమతోనే కొట్టినట్లు చెప్పారు. నియోజకవర్గంలో పెద్దస్థాయిలో అభివృద్ధి చేశావంటూ మెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఈక్రమంలో ఆయన శిలాపలకం మీద ఉన్న నిధులు చూపిస్తూ తల మీద కొట్టారని చెప్పుకొచ్చారు. ఇటీవల షాద్‌నగర్ పర్యటనలో అంజయ్య యాదవ్‌ తలపై ఎర్రబెల్లి కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు తల మీద కొట్టిన ఘటన మీద వివరణ ఇచ్చిన … Read more

    అమరావతికి మోదీ ఇచ్చింది గుండు సున్నా: KTR

    ఏపీలో అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ గుండు సున్నా ఇచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ కూడా ప్రజలు గుండు సున్నా ఇవ్వాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ అభివృద్ధి చూసి రజనీకాంత్ అమెరికాలో తిరిగినట్లు ఉందన్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉంటే వార్త. నేడు కరెంట్ పోతే వార్త అని ఉచిత విద్యుత్‌ను రైతులకు అందిస్తున్న ఘనత కేసీఆర్‌దని మంత్రి చెప్పుకొచ్చారు.

    TS: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

    తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పాఠశాలల్లో అల్పాహార పథకాన్నిఅమలు చేయనుంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ అల్పాహార పథకం అమల్లోకి రానుంది. పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందేలా పాఠశాల ప్రారంభానికి ముందే అల్పాహారం అందించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక మెనూ కూడా ఏర్పాటు చేశారు.

    సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్

    సింగరేణి కార్మికులకు ఆ సంస్థ చైర్మన్ శ్రీధర్ గుడ్ న్యూస్ చెప్పారు. సంస్థ లాభాల్లో వాటా ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు.. దసరా కానుకగా ఈ నెల 16న రూ.711.18 కోట్లు కార్మికులకు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ఏడాది సంస్థకు వచ్చిన రూ.2222.46 కోట్ల లాభాాల్లో కార్మికులకు 32 శాతం ఇస్తామన్నారు. దీని ప్రకారం ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షల మేర బోనస్ అందుతుందని శ్రీధర్ తెలిపారు.

    ‘సైంధవ్’ రిలీజ్ అప్పుడే

    విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సైంధవ్’ సంక్రాంతి బరిలో నిలవనుంది. వచ్చే ఏడాది జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వెంకటేశ్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. యువ దర్శకుడు సైలేశ్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

    తెలంగాణకు రాహుల్.. 3 రోజులు ఇక్కడే!

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నెల రెండో వారంలో తెలంగాణ రానున్నారు. ఆయన మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే తుక్కుగూడ సభలో ఆ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షా, సోనియా వంటి అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.

    సెన్సార్ బోర్డుపై సీబీఐ కేసు నమోదు

    ముంబై సెన్సార్‌ బోర్డుపై సీబీఐ కేసు నమోదు చేసింది. హీరో విశాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టింది. మార్క్ ఆంటోని చిత్రం సెన్సార్ కోసం రూ.7 లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఇటీవల విశాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై సెన్సార్ బోర్డు కూడా స్పందించింది. వెంటనే చర్యలకు ఉపక్రమించిన సెన్సార్ బోర్డు.. ఇకపై సినిమా నిర్మాణ సంస్థలు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే సెన్సార్ బోర్డు తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

    రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

    ప్రముఖ నగదు చెల్లింపుల సంస్థ పేటీఎం రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ‘న్యూ మనీ సేవింగ్’ పేరుతో తీసుకొచ్చిన ఆఫర్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. తత్కాల్‌తో పాటు అన్ని రిజర్వేషన్ టికెట్ల రద్దుపై పూర్తి రీఫండ్ పొందవచ్చని.. అందుకోసం కేవలం రూ.15 అదనంగా చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. రెలు టికెట్ల బుకింగ్స్ కోసం యూపీఐ చెల్లింపులు చేస్తే ఎలాంటి గేట్ వే ఫీజులు వసూలు చేయడం లేదని పేటీఎం వెల్లడించింది.

    తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల వరకు సమయంపడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని మొత్తం 28 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న 76,526 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరో 32,238 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం వెంకటేశ్వర స్వామీ హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    లాభాల్లో స్టాక్ మార్కెట్లు

    వరుసగా మూడు రోజులు నష్టాలతో కుదేలైన స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. 327 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 65,553 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 90 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ సూచీ 19,526 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.