• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నారా భువనేశ్వరి బస్సు యాత్ర?

    టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్రకు సిద్ధమైంది. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ.. కుప్పం నుంచి బస్సు యాత్ర చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ రూట్ మ్యాప్ సిద్ధం చేసి ఆమెకు పంపారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే బస్సు యాత్ర తేదీ ఇంకా ఖరారు కాలేదు.

    బీఆర్‌ఎస్‌లో చేరనున్న కాంగ్రెస్ కీలక నేత

    బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ చేరనున్నారు. సాయంత్రం కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే కేటీఆర్‌తో ఫొన్‌లో మాట్లాడిన శ్రీధర్.. మైనంపల్లిని ఓడించడమే లక్ష్యంగా బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. నందికంటి శ్రీధర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

    ‘కేసీఆర్ కనిపించడం లేదు.. అతనిపైనే అనుమానం’

    బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కనిపించడం లేదు.. మాకు కేటీఆర్ పైనే అనుమానం ఉంద్నారు. కేసీఆర్ 15 రోజులుగా కనిపించడంలేదని.. తమకు ఏదో అనుమానం కలుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్‌ను కేటీఆర్ ఏమైనా చేసిండా? ఏమైనా ఇబ్బంది పెడుతుండా? ఎందుకంటే ఆయన కేసీఆర్ మా సీఎం. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కేసీఆర్ గారితో ప్రెస్‌ మీట్ పెట్టించండి. అప్పుడే ఆయన క్షేమంగా ఉన్నారని మేం నమ్ముతాం’ అంటూ వ్యాఖ్యానించారు.

    నేడు ప్రముఖులతో సీఈసీ ముఖాముఖి

    మూడో రోజు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తోంది. ఈరోజు ఎన్నికల ప్రచారకర్తలతో సమావేశం నిర్వహించనుంది. దివ్యంగా ఓటర్ల చైతన్య కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. పలువురు ప్రముఖులతో సీఈసీ ముఖాముఖి చేపట్టనుంది. నేడు ప్రభుత్వపరంగా అందిస్తున్న సహకారంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సీఈసీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది.

    ఎన్టీఆర్ స్పందించకపోతే ‘ఐ డోంట్ కేర్’: బాలకృష్ణ

    సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అని చెప్పుకొచ్చారు. సినిమా వాళ్లు స్పందించక పోవడం కూడా పట్టించుకోనని తెలిపారు. ఏపీలో సైకో పరిపాలన నడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదని చెప్పారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.

    TS: ఓటర్ల జాబితా ఇదే!

    తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఓటర్లలో పురుష ఓటర్లు – 1,58,71,493, మహిళా ఓటర్లు – 1,58,43,339, కొత్త ఓటర్ల సంఖ్య – 17.01 లక్షలు, తొలగించిన ఓట్లు – 6.10 లక్షలు, ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు – 2,557, ఓటర్లు మొత్తం ఓటర్లు – 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ పేర్కొంది.

    బీజేపీతో జనసేన పొత్తు లేనట్లేనా?

    పెడన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. “ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావడం ఇబ్బందిగా ఉన్నా తప్ప లేదు. టీడీపీ అనుభవం, జనసేన పోరాట పటిమతో జగన్‌ను పాతాళానికి తొక్కేయవచ్చు. టీడీపీ బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నపుడు, మీ పార్టీ అనుభవం రాష్ట్రానికి అవసరమని మద్దతు తెలిపా. ఎవరు కలిసి వచ్చినా నేను ముందుకు వస్తా. కేంద్రం కూడా సానుకూలంగా ఉంటుంది” అని ఆశిస్తున్నా’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

    నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. మొదటి దఫాలో 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు చంద్రబాబుకు విధించింది. ఆతర్వాత దానిని అక్టోబర్ 5 వరకు పొడిగించింది. ఈరోజు మరోసారి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణ జరగనుంది. న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

    గాంధీ భవన్‌లోనే గాడ్సే: KTR

    టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు కర్ణాటక నుంచి డబ్బులు తెచ్చి పంచితే ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కు వేయాలని కోరారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ సీటుకు 25 కోట్లకు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు అక్కడక్కడా ఒక్కటవుతున్నాయని చెప్పుకొచ్చారు. గాంధీ భవన్‌లోనే గాడ్సే ఉన్నాడని రేవంత్ రెడ్డి RSS మనిషి అంటూ కేటీఆర్ విమర్శించారు..

    KCR గెలుపు కోసమే మోదీ పర్యటన: రేవంత్

    బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీల స్నేహ బంధాన్ని నిజామాబాద్‌ సాక్షిగా ప్రధాని మోదీ బయటపెట్టారని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడమే ఆ రెండు పార్టీల ఉద్దేశమని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను గెలిపించేందుకే మోదీ తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారని రేవంత్ విమర్శించారు.