• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SBI ఉద్యోగి చేతివాటం.. రూ.14 లక్షలు మాయం

    ఓ ఎస్బీఐ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. రూ.14.73 లక్షల సొమ్మును సదరు ఉద్యోగి తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు. మరో బాధితురాలికి నకలీ ఎఫ్‌డీ పత్రం ఇచ్చి మోసంగించాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని ఎస్బీఐ బ్యాంక్‌లో చోటుచేసుకుంది. బాధితుడు బ్యాంకుకు వెళ్లి రూ,లక్ష విత్‌డ్రా చేసుకునేందుకు ప్రతాలు ఇచ్చాడు. దాన్ని పరిశీలించిన క్యాషియర్ ఖాతాలో డబ్బు లేదని చెప్పడంతో అవాక్కయ్యారు. ఈ విషయాన్ని బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లగా తమ ఉద్యోగే తన ఖాతాకు డబ్బును బదిలీచేసుకున్నాడని తెలిసింది.

    ఎన్టీఆర్ స్పందించకపోతే ‘ఐ డోంట్ కేర్’: బాలకృష్ణ

    సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అని చెప్పుకొచ్చారు. సినిమా వాళ్లు స్పందించక పోవడం కూడా పట్టించుకోనని తెలిపారు. ఏపీలో సైకో పరిపాలన నడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదని చెప్పారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.

    చంద్రబాబు అరెస్టు బాధాకరం: తలసాని శ్రీనివాస్‌

    టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ స్పందించారు. చంద్రబాబు అరెస్టు చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పట్ల జగన్ అనుసరిస్తున్న తీరు విచారకరమన్నారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.

    TSRTC ఉద్యోగులకు శుభవార్త

    TSRTC ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసింది. అక్టోబరు వేతనంతో కలిపి ఈ డీఏను చెల్లించనున్నట్లు TSRTC పేర్కొంది. గతంలో పెండింగ్‌లో ఉన్న మొత్తం 9 డీఏలు మంజూరు చేసినట్లు పేర్కొంది. ఇటీవలే TSRTC ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించిన విషయం తెలిసిందే.

    TS: ఓటర్ల జాబితా ఇదే!

    తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఓటర్లలో పురుష ఓటర్లు – 1,58,71,493, మహిళా ఓటర్లు – 1,58,43,339, కొత్త ఓటర్ల సంఖ్య – 17.01 లక్షలు, తొలగించిన ఓట్లు – 6.10 లక్షలు, ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు – 2,557, ఓటర్లు మొత్తం ఓటర్లు – 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ పేర్కొంది.

    రేవంత్ రెడ్డి ఇక జైలుకే: హరీష్ రావు

    ఓటుకు నోటుకు కేసులో త్వరలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కేసులో దొరికిన రేవంత్ రెడ్డి విచారణ ఆపాలని సుప్రీం కోర్టుకు పోతే కోర్టు కూడా విచారణ జరగాలని స్పష్టం చేసింది. ఆ కేసు విచారణ అయ్యేది ఖాయం, రేవంత్ జైలుకు వెళ్లేది ఖాయం అని చెప్పుకొచ్చారు. మరోవైపు ఈనెల 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ పెడుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రకటించే బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి విపక్షాలు బిక్కమొహం వేస్తాయని పేర్కొన్నారు.

    బతుకమ్మ చీరల పంపిణీ షురూ

    తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. 25 రకాల డిజైన్‌లతో కోటి 20 లక్షల చీరలను పంపిణీకి సిద్ధం చేశారు. రేపటిలోగా అన్ని జిల్లా కేంద్రాలకు బతుకమ్మ చీరలు చేరనున్నాయి. అక్టోబర్ 10లోగా బతుకమ్మ చీరల పంపిణీ పూర్తి చేసేలా అధికారులు ప్లాన్ చేశారు. సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్ మరమగ్గాల సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను ప్రభుత్వం తయారు చేయించింది. గతేడాది బతుకమ్మ చీరల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈసారి జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది.

    మేనిఫెస్టోపై కేసీఆర్ దృష్టి

    సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై దృష్టిసారించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిచేందుకు మేనిఫెస్టోను రెడీ చేస్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్‌లకు ధీటుగా.. మహిళలు, రైతులే ప్రధానంగా హామీలు రూపొందిస్తున్నారు. రైతులకు ఉచిత ఎరువులు, మహిళలకు జీరో వడ్డీ రుణాలు వంటి స్కీమ్స్‌ తీసుకొచ్చేందుకు అధికారులు, పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఈనెల 16న వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.

    పసుపు బోర్డుకు కేబినెట్ ఆమోదం?

    ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇటీవల ప్రధాని ఇచ్చిన హామీలు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని మంత్రి మండలి ఆమోదించనుంది. కేబినెట్ ఎజెండాలో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉండటంతో కేంద్రమంతి కిషన్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. నిన్నటి వరకు హైదరాబాద్‌లో బిజీగా ఉన్న కిషన్ రెడ్డి రాత్రి ఫోన్ రావటంతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కేబినెట్ సమావేశం అనంతరం హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది.

    వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 65,129 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 108 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ సూచీ 19,420 పాయింట్ల వద్ద కదలాడుతోంది. నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, HUL షేర్లు లాభాల్లో ఉన్నాయి. మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద కొనసాగుతోంది.