• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బైడెన్‌పై ట్రంప్‌ సంచలన ఆరోపణలు

    ఇరాన్‌కు అమెరికా అందించిన నిధులతోనే హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడి చేస్తోందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా ప్రజలు చెల్లించిన పన్నులతోనే ఈ దాడులకు నిధులు అందడం అవమానకరమని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులు బాధాకరం. బలమైన శక్తితో దాడులను తిప్పికొట్టే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. ఈ దాడులకు అమెరికా నుంచి నిధులు అందడం అత్యంత అవమానకరం. బైడెన్‌ యంత్రాంగం నుంచి బయటికి వచ్చిన పలు నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి’ అని ట్రంప్ ఆరోపించారు.

    ‘రూ.1500 కోట్లకు పవన్‌ అమ్ముడుపోయారు’

    AP: జనసేన అధ్య­క్షుడు పవన్‌ కళ్యాణ్‌ రూ.1,500 కోట్లకు అమ్ము­డుపోయాడని ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌ ఆరోపించారు చెప్పారు. పవన్‌ రోజుకో మాట మాట్లాడతారని మండిపడ్డారు. ఒక రోజు ఎన్డీఏలో ఉన్నానంటాడని, మరొక రోజు లేనని చెబుతాడని విమర్శించారు. చంద్రబాబు స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఏనాడు పోరాటం చేయలేదని ధ్వజమెత్తారు. ఆయన అదానీకి అమ్ముడుపోయాడని ఆరో­పించారు. చంద్రబాబు అమరావతి కడతానని కట్టలేదని, పోలవరం పూర్తి చేయలేదని, ప్రత్యేక హోదా సాధించలేదని మండిపడ్డారు.

    హనీమూన్‌కు తీసుకెళ్లి భర్త రాక్షసత్వం

    కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కర్కసంగా ప్రవర్తించాడు. బెంగళూరుకు చెందిన నిందితుడు భార్యను హనీమూన్‌కు తీసుకెళ్లి నగ్న వీడియోలను ఫోన్‌లో చిత్రీకరించాడు. వాటిని అడ్డం పెట్టుకొని రూ.10 లక్షలు డబ్బుతోపాటు, ప్రతి నెలా వచ్చే జీతం మెుత్తాన్ని తనకే ఇవ్వాలని బెదిరించాడు. వివాహిత ఫిర్యాదుపై బసవనగుడి మహిళా ఠాణాలో కేసు నమోదైంది. తనకు సొంత నిర్మాణ సంస్థ ఉందని పెళ్లికి ముందు చెప్పిన తన భర్త.. నిజానికి నిరుద్యోగి అని ఆమె పోలీసులకు వివరించింది.

    స్వల్పంగా పెరిగిన గోల్డ్.. ధర ఎంతంటే!

    పసిడి ధరలు వరుసగా రెండో రోజూ స్వల్పంగా పెరిగాయి. 22, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 250, రూ.310 చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 52,900కు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.57,690 చేరింది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.52,750 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.57,540 చేరింది. అటు ఏపీలోని విజయవాడ, విశాఖ నగరాల్లోనూ … Read more

    నేడు 70% కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు!

    తెలంగాణలో నేడు కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటిలో 60-70 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అభ్యర్థులను ఖరారు చేస్తే వారంతా ప్రచారం చేసుకోవడానికి వీలవుతుందని కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌తో చెప్పినట్లు పేర్కొన్నారు. భారాస మాదిరి ముందస్తుగా టికెట్లు ఖరారు చేయడం కాంగ్రెస్‌ లాంటి జాతీయపార్టీలో సాధ్యం కాదన్నారు.

    ఆసియా క్రీడల్లో మెరిసిన తెలుగు తేజం

    ఆసియా క్రీడల్లో తెలుగమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది. జ్యోతిసురేఖ పతకాలను గెలుచుకోవడంపై ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 13 ఏళ్ల బ్యోతిసురేఖ ఆర్చరీలో దేశం గర్వపడేలా మూడు బంగారు పతకాలు సాధించింది. ఇప్పటి వరకు భారత్ 102 పతకాలు సాధించింది. అందులో 27 స్వర్ణాలు, 35 రజతం, 40 కాంస్య పతకాలు ఉన్నాయి

    TSRTC ఫెస్టివల్ ఛాలెంజ్‌

    టీఎస్‌ఆర్టీసీ ‘100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్‌ చేసింది. ‘100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్’ ఛాలెంజ్‌ను నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. ‘ఆర్టీసీ ఉద్యోగులు దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకల నేపథ్యంలో ప్రయాణికులకు, నాణ్యమైన సేవలు అందించాలి. ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 22వ తేదీ వరకు ఈ ఛాలెంజ్ అమల్లో ఉంటుంది. గత ఛాలెంజ్‌ల మాదిరిగానే ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేయాలి అలా చేసిన ఉద్యోగులకు బహుమతులు ఉంటాయి.

    డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఈడీ నోటీసులు

    సినీ నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు అందజేసింది. 10వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇటీవల 6 గంటల పాటు నవదీప్‌ను విచారించిన నార్కోటిక్స్ పోలీసులు ఆయన మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. కాల్ లిస్ట్ ఆధారంగా నవదీప్‌ను విచారించిన అధికారులు ఆయన వాట్సాప్ చాట్‌ను రిట్రీవ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. వాట్సాప్ చాట్ డేటా ఆధారంగా మరోసారి విచారించే అవకాశం ఉంది.

    శ్రీవారి దర్శనానికి 12 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 22 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న శ్రీవారిని 80,551 మంది భక్తులు దర్శించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    రేవంత్‌ రెడ్డి బీజేపీ మనిషి: అసదుద్దిన్

    టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ సినిమా మా దగ్గర ఉంది. టీడీపీ నేత చంద్రబాబు పని అయిపోగానే కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ కాంగ్రెస్‌లో ఉన్నా ఆయన జీవితం బీజేపీ, ఆరెస్సెస్‌తో ముడిపడి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలు అరెస్సెస్ నాలుక నుంచి వస్తున్నవి, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత కిషన్‌రెడ్డితో రేవంత్ పనిచేయడాన్ని చూశాను. అరెస్సెస్‌తో సంబంధం లేదని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో రేవంత్ ప్రమాణం చేస్తారా’? అని అసదుద్ధిన్ … Read more