• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎమ్మార్వో ఇంట్లో కట్టల కొద్ది డబ్బులు

    మర్రిగుడ ఎమ్మార్వో మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు జరపగా.. పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం వెలుగు చూడటం కలకలం సృష్టించింది. ఎమ్మార్వో మహేందర్ రెడ్డి ఇంట్లో కట్టల కొద్ది నోట్ల కట్టలు. ఒక్క ట్రంక్ పెట్టెలో రెండు కోట్లకు పైగా నగదు లభ్యమైంది. కిలోల కొద్ది బంగారం బయటపడింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నాడని ఆరోపణలు రావడంతో… ఏసీబీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మహేందర్ రెడ్డికి చెందిన 15 చోట్ల అధికారులు సోదాలు చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. https://twitter.com/TeluguScribe/status/1708119522098483513/video/1

    చంద్రబాబుపై మరో కేసు

    చంద్రబాబుపై వరుస కేసులు పెడుతూ వైసీపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని సుప్రీంకోర్టును మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆశ్రయించారు. తెలంగాణ ఏసీబీ ఛార్జిషీట్‌లో 22 సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావన ఉందని గుర్తు చేశారు. ఈ కేసు విచారణ పురోగతిపై ఆరా తీయ్యాలని కోర్టును కోరారు. అక్టోబరు 3న ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనుంది. ఇప్పటికే స్కిల్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో చంద్రబాబు ముద్దాయిగా ఉన్నారు.

    తెలంగాణకు నేడు ప్రధాని మోదీ

    తెలంగాణకు నేడు ప్రధాని మోదీ రానున్నారు. మహబూబ్‌నగర్‌లో తెలంగాణ బీజేపీ ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. కాంగ్రెస్‌పై కూడా తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ రెండూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యం లేని కుటుంబ పార్టీలు’ అంటూ విమర్శించారు.

    గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై టీచర్ గొప్ప పాఠం

    చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చక్కగా వివరించిన ఓ స్కూలు టీచర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఆ టీచర్ ఓ బాలికకు ఏది చెడు ఉద్దేశంతో కూడుకున్న స్పర్శ, ఏది సరైన స్పర్శనో వివరించింది. ఉపాధ్యాయురాలు వివరణకు బాలిక కూడా సరైన రీతిలో స్పందించడం గమనార్హం. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి R స్టాలిన్ షేర్ చేయగా.. నెట్టింట్లో వైరల్‌గా మారింది. టీచర్ ఎఫర్ట్స్‌ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. https://x.com/stalin_ips/status/1706141698731163993?s=20

    రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు

    తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన బాలాపూర్ లడ్డు వేలం ఈసారి కూడా రికార్డు ధర పలికింది. తుర్కయాంజల్‌కు చెందిన దయానంద్ రెడ్డి రూ.27 లక్షలకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. వేలం పాటలో స్థానికులు, స్థానికేతరులతో కలిపి మొత్తం 56 మంది పాల్గొన్నారు. రూ.1,116తో ప్రారంభమైన లడ్డూ వేలం రూ.27 లక్షల వద్ద ముగిసింది. 1994 నుంచి లడ్డూ వేలం పాట నిరంతరాయంగా కొనసాగుతోంది. తొలిసారి రూ.450కి స్థానిక రైతు కొలను మోహన్ రెడ్డి చేజిక్కించుకున్నారు. https://x.com/NtvTeluguLive/status/1707282234183647687?s=20

    ఆమె ఎవరో ఎవరైనా చెప్పగలరా?: RGV

    ట్విట్టర్‌లో రామ్‌ గోపాల్ వర్మ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఓ యువతి వీడియోను పోస్ట్ చేస్తూ ఈ అమ్మాయి ఎవరో ఎవరైనా నాకు చెప్పగలరా అని కామెంట్ చేశారు. 26 సెకన్ల నిడివి గల వీడియోలో ఆ యువతి హాట్ లుక్‌లో కనిపించింది. వింటేజ్ కెమెరాతో ప్రకృతి అందాలను ఫొటోలు తీస్తూ ఆకట్టుకుంది. నాభి, ఎద అందాలను ప్రదర్శిస్తూ రెచ్చగొట్టెలా పొజులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Can someone tell me who she is ? pic.twitter.com/DGiPEigq2J … Read more

    రాహుల్ గాంధీకి ఓవైసీ సవాల్

    రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో కేరళ- వయనాడ్ కాకుండా.. హైదరాబాద్ వచ్చి తన మీద పోటీ చేయాలని సవాలు విసిరారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. మరోవైపు తెలంగాణాలో ఎంఐఎం పోటీ చేసిన దగ్గర ఎంఐఎంకి వోట్ వేయాలని ముస్లిం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పోటీ చేయని దగ్గర బీఆర్ఎస్ పార్టీకి వోట్ వెయ్యాలని సూచించారు. https://x.com/TeluguScribe/status/1706223721248354682?s=20

    ఎమ్మెల్యే రాజయ్య ట్విస్ట్

    స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవల కేటీఆర్ ఎదుట శ్రీహరితో చేయి కలిపిన రాజయ్య మాట మార్చారు. తాను ఎక్కడా శ్రీహరితో కలిసి పనిచేస్తానని చెప్పలేదన్నారు. తాను స్వయంగా చెబితేనే ఏదైనా నమ్మాలని కార్యకర్తలకు సూచించారు. కడియం శ్రీహరికి స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ కన్ఫామ్ చేయడంతో.. తనకు ఎమ్మెల్సీ, ఎంపీగా అవకాశం ఇస్తామని కేసీఆర్ చెప్పారన్నారు. ఆలోపు నామినేటెడ్ పోస్ట్ తీసుకోవాలని సూచించారని పేర్కొన్నారు. నాకు ఎంపీ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తాం అన్నారు స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ … Read more

    ఐఫోన్ 15 అమ్మలేదని సిబ్బందిపై దాడి

    ఐఫోన్ 15పై ఉన్న క్రేజ్ కొట్లాటకు దారి తీసింది. స్టోర్ సిబ్బందిని ఐఫోన్ ప్రియులు చితకబాదారు. ఈ ఘటన ఢిల్లీలోని క్రోమా స్టోర్‌లో జరిగింది. ఐఫోన్ 15 ప్రో మొబైల్‌ను అమ్మడం కుదరదు అన్నందుకు క్రోమా సిబ్బందిపై దాడి చేసినట్లు తెలిసింది. దీనిపై క్రోమా స్టోర్ స్పందిస్తూ.. స్టాక్ లేకపోవడం వల్లే అమ్మడం లేదని చెప్పుకొచ్చింది. సిబ్బందిపై దాడి చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. https://x.com/TeluguScribe/status/1705484270578655478?s=20

    క్షమాపణలు చెప్పిన పోలీస్ జంట

    సోషల్ మీడియాలో తమ ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ కావడంపై సీపీ ఆనంద్‌కు లేడీ ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగత వేడుకల్లో యూనిఫాం గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సీపీ ఆనంద్ అన్నారు. కొత్త దంపతులు జీవితకాలం ప్రేమతో కలిసి ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు. పంజాగుట్ట పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న లేడీ ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ చేసుకున్న ప్రీ వెడ్డింగ్ షూట్‌లో యూనిఫాం, ప్రభుత్వ వాహనాలు వాడటంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. https://x.com/fpjindia/status/1703795784997822685?s=20