• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రవితేజకు సారీ చెప్పిన బాలీవుడ్ నటుడు

    గతంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ టాలీవుడ్ హీరో రవితేజకు సారీ చెప్పారు. 1988లో రవితేజ తన ఆటోగ్రాఫ్ అడిగితే కుదరదని చెప్పానని, అప్పుడు అలా అన్నందుకు ఇప్పుడు సారీ చెబుతున్నానన్నారు. రవితేజ నటించిన పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’లో అనుపమ్ నటించారు. ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

    విశాల్ ఆరోపణలు.. రంగంలోకి CBI

    ఇటీవల సెన్సార్ బోర్డు అవినీతిపై హీరో విశాల్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో విశాల్ ఆరోపణలపై సీబీఐ విచారణ మొదలు పెట్టింది. ఇప్పటికే ముగ్గురు వ్యక్తులపై దర్యాప్తు సంస్థ కేసులు నమోదు చేసింది. తాజాగా ముంబాయిలో నాలుగు చోట్ల సోదాలు చేసింది. ఓ హిందీ రీమేక్ సినిమాకు సెన్సార్ బోర్టు అధికారులలో ఇద్దరు నిందితులతో కలిసి నిందితురాలు రూ.6.54 లక్షలు తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

    పూజా హెగ్డేకి గాయం.. నెటిజన్స్ ట్రోలింగ్

    టాలీవుడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఫొటో పోస్ట్ చేసి నెటిజన్లకు పనిచెప్పింది. తన మోకాలికి గాయం అయిందంటూ పూజా షేర్ చేసిన ఫొటో ట్రోలింగ్‌కు గురవుతోంది. ఇది కూడా గాయమేనా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఆఫర్లు లేకపోవడంతోనే పబ్లిసిటీ కోసం ఇలాంటి ఫొటోలు షేర్ చేస్తుందని విమర్శిస్తున్నారు. Screengrab Twitter: Screengrab Twitter: Screengrab Twitter:

    బిగ్‌బాస్ కీలక నిర్ణయం.. రతిక రీ ఎంట్రీ

    ఇప్పటికే ఎలిమినేట్ అయిన రతిక రోజ్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొదట్లో హౌజ్‌లోకి వెళ్లిన 14 మందిలో ఏడుగురు పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. నలుగురు మహిళలను ఎలిమినేట్ చేయడంతో ముగ్గురు మిగిలారు. దీంతో జెంట్స్, లేడీస్ రేషియోలో బ్యాలెన్స్ తప్పిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొత్తగా మరో ఏడుగురు హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో రతిక రీఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది.

    డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు: వరలక్ష్మి

    ‘మాన్షన్ 24’ వెబ్‌సిరీస్‌ ప్రమోషన్స్‌లో నటి వరలక్ష్మి శరత్ కుమార్ డ్రగ్స్ కేసు గురించి మాట్లాడారు. మాదకద్రవ్యాల కేసులో తనకు నోటీసులు అందాయంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ‘డ్రగ్స్ కేసులో నాకు అధికారుల నుంచి ఎలాంటి సమన్లు అందలేదు. గతంలో నా వద్ద పనిచేసిన వ్యక్తి డ్రగ్స్ కేసులో ఇరుకున్నారు. మీడియా వాళ్లు ‘నా ఫొటోని ఉపయోగించి వరలక్ష్మి మేనేజర్‌కు నోటీసులు’ అని వార్తలు రాస్తున్నారు. అంతే తప్ప ఆ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని వరలక్ష్మి క్లారిటీ ఇచ్చారు.

    డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు: వరలక్ష్మి

    ‘మాన్షన్ 24’ వెబ్‌సిరీస్‌ ప్రమోషన్స్‌లో నటి వరలక్ష్మి శరత్ కుమార్ డ్రగ్స్ కేసు గురించి మాట్లాడారు. మాదకద్రవ్యాల కేసులో తనకు నోటీసులు అందాయంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ‘డ్రగ్స్ కేసులో నాకు అధికారుల నుంచి ఎలాంటి సమన్లు అందలేదు. గతంలో నా వద్ద పనిచేసిన వ్యక్తి డ్రగ్స్ కేసులో ఇరుకున్నారు. మీడియా వాళ్లు ‘నా ఫొటోని ఉపయోగించి వరలక్ష్మి మేనేజర్‌కు నోటీసులు’ అని వార్తలు రాస్తున్నారు. అంతే తప్ప ఆ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని వరలక్ష్మి క్లారిటీ ఇచ్చారు.

    ‘దేవర’ పార్ట్ 2 ప్రకటించిన దర్శకుడు

    ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రం నుంచి తాజా అప్‌డేట్ వచ్చింది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ‘దేవర’ సినిమాలో బలమైన పాత్రలు చాలా ఉన్నాయి. ఏ ఒక్కరి సన్నివేశం, సంభాషణ తొలగించలేం ఒక్క పార్ట్‌తో ఇంత పెద్దకథను ముగించలేమన్న నిర్ణయానికి వచ్చాం. పాత్రలు వాటి భావోద్వేగాలు పూర్తిస్థాయిలో చూపించాలంటే ఒక్క పార్ట్‌తో కుదరదు. అందుకే అందరితో చర్చించి పార్ట్ -2 నిర్ణయం తీసుకున్నా’ అని కొరటాల శివ చెప్పుకొచ్చారు.

    బాలీవుడ్‌ నటుడుకి ఈడీ సమన్లు

    బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఓ ఆన్‌లైన్‌ గేమింగ్‌ మనీలాండరింగ్‌ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు రణ్‌బీర్ ప్రచారకర్తగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆ బెట్టింగ్‌ యాప్‌ మాటున జరుగుతున్న ఓ భారీ కుంభకోణాన్ని ఇటీవల ఈడీ బట్టబయలు చేసింది. ఈ నేపథ్యంలో ఆ యాప్‌కు ప్రచారకర్తగా ఉన్న రణ్‌బీర్‌‌ను ఈ నెల 6న విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.

    రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ‘హీరోయిన్’

    రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్‌ నటి గాయత్రీ జోషి తీవ్రంగా గాయపడ్డారు. సరదాగా గడిపేందుకు గాయత్రీ ఆమె భర్తతో కలిసి ఇటలీకి వెళ్లారు. అక్కడ జరుగుతున్న లగ్జరీ కార్ల పరేడ్‌లో వీరు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో గాయత్రీ, ఆమె భర్త ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ఫెరారీ కారు, వ్యాన్‌ను ఢీకొంది. దీంతో ఫెరారీ కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ఇద్దరు దంపతులు మరణించారు. గాయత్రీ ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.

    సీత పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి?

    రామాయణాన్ని తెరకెక్కించేందుకు బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాముడి పాత్ర కోసం రణ్‌బీర్ కపూర్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో సీత పాత్ర కోసం ముందుగా అలియా భట్‌‌ను ఎంచుకున్నారట, ఇందుకోసం ఆమెకు లుక్ టెస్ట్ కూడా చేశారని తెలిసింది. అయితే ఇప్పుడు ఆ పాత్ర కోసం సాయిపల్లవి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆమె అయితేనే సీత పాత్రకు న్యాయం చేయగలదని మేకర్స్ ఆమెను సంప్రదించారట. త్వరలోనే ఆమెకు లుక్ టెస్ట్ చేయనున్నట్లు సమాచారం.