• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This WeeK OTT Movies (Oct 02- 7) : ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!

    దసరా పండుగ మరో రెండు వారాల టైం ఉన్న నేపథ్యంలో పెద్ద సినిమాలకు పోటీగా దిగకుండా.. ఇప్పుడే థియేటర్లలో విడుదలయ్యేందుకు ఈవారం పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఈవారం ఎక్కువగా చిన్న సినిమాలే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అలాగే ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 25కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం.. రూల్స్ రంజన్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, టిల్లు పాప నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. … Read more

    రీ రిలీజ్‌కు సిద్ధమైన అదుర్స్

    యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, వి.వి. వినాయక్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం అదుర్స్. ఈచిత్రం రీరిలీజ్‌కు సిద్ధమైంది. నవంబర్ 18న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. జూ. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, షీలాలు హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీ సంగీతం అందించారు. కోడాలి నాని, వల్లభనేని వంశీ కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

    హరిహరవీరమల్లు ఇప్పట్లో లేనట్లేనా?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబోలో వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి పవన్ కళ్యాణ్ నవంబర్‌లో కేటాయించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది సమ్మర్ వరకు డేట్స్ కుదరకపోవచ్చని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో AM రత్నం నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు.

    భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

    నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి నుంచి క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం నుంచి ట్రైలర్ అక్టోబర్ 8న రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. అనిల్ రావుపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది.

    వాల్తేరు వీరయ్య టెలివిజన్ ప్రీమియర్ ఫిక్స్

    మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీ టెలివిజన్ ప్రిమియర్ డేట్ ఫిక్సైంది. ఈ సినిమా దసర పండుగ సందర్భంగా జెమిని టీవీలో ప్రసారం కానుంది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. బాబీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.

    భగవంత్ కేసరి నుంచి రెండో సాంగ్

    బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ లిరికల్ సాంగ్ విడుదల తేదీ ఫిక్సైంది. అక్టోబర్ 4న ఉయ్యాలో ఉయ్యాలో అనే సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అనిల్ రావుపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సన్‌ షైన్ నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది.

    రేణు దేశాయ్ ఫస్ట్ లుక్ విడుదల

    మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ నుంచి రేణు దేశాయ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రేణు.. హేమలత లవణం అనే పాత్రలో నటిస్తున్నారు. ఈమేరకు ఆమె పేరుతో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నారు. మరి చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత నటిస్తున్న రేణు దేశాయ్.. సినిమాలో ఎలాంటి పాత్ర చేయనున్నదో అని ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను అక్టోబర్ 3న రిలీజ్ చేయనున్నారు.

    ఘోస్ట్ ట్రైలర్ విడుదల

    కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. యుద్ధం ప్రపంచ మానవాళికి మాయని గాయం.. యుద్ధం వల్ల సామ్రాజ్యాల స్థాపన కంటే విధ్వంసమే ఎక్కువ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. శివరాజ్ కుమార్ మాస్ లుక్ బాగుంది. పొరాట సన్నివేశాలు చూస్తుంటే ఇది పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్థం అవుతోంది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్‌తో పాటు విజయ్ సేతుపతి, జయ్‌రామ్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను MG శ్రీనివాస్ డైరెక్ట్ … Read more

    ఓటీటీలోకి ‘ఖుషి’

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈరోజు నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి హిట్ సాధించింది. సామ్- విజయ్‌లు ఈ సినిమా ద్వారా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు. థియేటర్లలో మిస్‌ అయినవారు ఓటీటీలో చూడవచ్చు. ఇక ఈ సినిమాకు అబ్దుల్ వహద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.

    పెదకాపు 1 ట్విట్టర్ రివ్యూ

    శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో వచ్చిన పెదకాపు1 చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను ట్వీట్ చేస్తున్నారు. సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. అనసూయకు క్యారెక్టరైజేషన్ బాగుంది. ఫస్టాఫ్ బాగుంది. ఇంటర్వేల్ ట్విస్ట్ సినిమాకు ఫ్లస్, మిక్కి BGM అదరగొట్టాడు. క్లైమాక్స్ సీన్స్ గూస్ బంప్స్. కొత్త హీరో విరాట్ కర్ణన్ బాగా చేశాడు. అక్కడక్కడ కొన్ని సీన్లు స్లోగా ఉన్నాయి అని కామెంట్ చేస్తున్నారు. కాసేపట్లో పూర్తి రివ్యూ.. https://x.com/Thyveiw/status/1707117370890994162?s=20