• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సిద్ధార్థ్‌కు ప్రకాశ్ రాజ్ క్షమాపణలు

    యాక్టర్ ప్రకాష్ రాజ్.. హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పారు. ‘చింతాత’ సినిమా ప్రమోషన్ కోసం నిన్న బెంగళూరులో సిద్ధార్థ ప్రేస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కావేరి జలాల పరిరక్షణ సమితి కార్యకర్తలు ప్రెస్ మీట్‌ను అడ్డుకున్నారు. దీంతో సిద్ధార్థ్ అర్థాంతరంగా కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. ఏళ్ల తరబడి కావేరి జలాల సమస్యను సమస్యగా ఉంచిన రాజకీయ నాయకులను వదిలిపెట్టి సామాన్యులు, ఆర్టిస్టులపై పడటం సరైంది కాదని చెప్పుకొచ్చారు. ఒక కన్నడిగుడిగా సిద్ధార్థకు … Read more

    యానిమల్ టీజర్ విడుదల

    సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్ కాంబోలో వస్తున్న చిత్రం యానిమల్. ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజైంది. టీజర్‌లో కంప్లీట్ మాస్ అవతార్‌లో రణబీర్ కనిపించాడు. నేను చెడును వెతికాను ఎక్కడా కనిపించలేదు.. నాలో వెతికాను నాకన్న చెడ్డవాడు ఎవడు లేడు అనిపించింది అనే డైలాగ్‌తో టీజర్ సాగింది. టీజర్ బట్టి చూస్తుంటే తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా యానిమల్ కనిపిస్తుంది. సినిమాలోనే యాక్షన్ సీన్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది.

    చంద్రముఖి 2 ట్విట్టర్ రివ్యూ

    రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి2పై సోషల్ మీడియాలో మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. సినిమా చూసిన ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. ‘లారెన్స్ రజినీని కాపీ కొట్టకుండా కొత్తదనం చూపించాడు. చంద్రముఖిగా కంగనా మెప్పించింది. ‘జ్యోతికలా మాత్రం భయపెట్టలేకపోయింది. డైరెక్టర్ పీ వాస్ స్క్రీన్‌ప్లే సినిమాకు బలం. కీరవాణి బీజీఎం, పాటలు బాగున్నాయి. చంద్రముఖి 1తో పోల్చకుండా చూస్తే సినిమా నచ్చుతుంది’ అని కామెంట్ చేస్తున్నారు. పూర్తి రివ్యూ కాసేపట్లో.. https://x.com/KollywoodCinima/status/1706901100451012792?s=20

    స్కంద మూవీ ట్విట్టర్ రివ్యూ

    ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని, కుర్రహీరోయిన్ శ్రీలీల కాంబోలో వచ్చిన చిత్రం స్కంద ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ‘రామ్ ఎంట్రీ సీన్ అదిరిపోయింది. యాక్షన్ లవర్స్‌కు మంచి మసాల ట్రీట్. నీ చుట్టు సాంగ్‌లో శ్రీలీల- రామ్‌తో పోటీపడి స్టెప్పులేసింది. ఆ ఒక్క పాట తప్పా మిగిలిన సాంగ్స్ ఆకట్టుకోవు. తమన్ BGM ఓకే. బోయపాటి తన అన్ని సినిమాలు మిక్స్ చేసినట్లు ఉంది’ అని కామెంట్ చేశారు. … Read more

    మురళీధరన్ యువతకు స్ఫూర్తి: లక్ష్మణ్

    హైదరాబాద్‌లో ‘800’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా.. శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు. ‘మురళీధరన్‌ గొప్ప క్రికెటర్‌ అని అందరికీ తెలుసు. కానీ, అంతకంటే గొప్ప మనసున్న వ్యక్తి, ఈ తరం యువతకు రోల్‌ మోడల్, అతనిలాంటి స్నేహితుడు ఉండటం అదృష్టం’ అని చెప్పుకొచ్చారు. మురళీధరన్ బయోపిక్ చిత్రం ‘800’. ముత్తయ్యగా మధుర్ మిట్టల్, ఆయన భార్య మలర్‌గా మహిమా నంబియార్ నటించారు. ఈ చిత్రాన్ని ఎంఎస్ శ్రీపతి డైరెక్ట్ చేశారు. https://x.com/NtvTeluguEnt/status/1706223769973366818?s=20

    This WeeK OTT Movies (Sept 25- Oct 01) : ఈ వారం ఓటీటీల్లో 30కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!

    గత వారం వినాయక చవితి నవరాత్రులను దృష్టిలో ఉంచుకుని పెద్దగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాలేదు. అయితే ఈవారం మాత్రం ప్రేక్షకులను అలరించేందుకు పెద్ద సినిమాలు సిద్దమయ్యాయి. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫాంలోను దాదాపు 30కి పైగా సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. మరి ఆ చిత్రాలు ఏమిటో ఓసారి చూద్దాం స్కంద (Skanda movie) ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పొత్తినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ … Read more

    National Cinema Day: సినీ ప్రియులకు బంపరాఫర్‌.. మల్టీప్లెక్స్‌లో రూ.99కే మూవీ టికెట్‌. ఎందుకో తెలుసా?

    మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (Multiplex Association of India) సినీ ప్రేక్షకులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. PVR, INOX, సినీ పోలిస్‌ (Cinepolis), మిరాజ్‌(Miraj), సిటీప్రైడ్‌, ఏషియన్‌ (Asian), మూవీ టైమ్‌, వేవ్‌, ఎమ్‌2కే, డిలైట్‌ సహా 4వేలకు పైగా థియేటర్లలో రూ.99కే సినిమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. అక్టోబరు 13ను ‘నేషనల్‌ సినిమా డే’ (National Cinema Day)గా పేర్కొంటూ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది.  ఒక్కరోజు మాత్రమే! అక్టోబర్‌ 13న మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని మల్టీప్లెక్స్‌ … Read more

    టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ డేట్‌పై పోల్

    మాస్ మహారాజ రవితేజ హీరోగా నపూర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ట్విట్టర్‌ పోల్ నిర్వహించారు. టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్‌ను ఎప్పుడు విడుదల చేయాలో చెప్పాలంటూ రెండు డేట్స్ పెట్టి ఫ్యాన్స్‌ను కోరారు. అక్టోబర్ 3, సెప్టెంబర్ 27 తేదీల్లో ఎక్కువ మంది 27కు ఓటు వేశారు. మరి ఫ్యాన్స్ రెస్పాన్స్‌కు గౌరవమిచ్చి 27కు ట్రైలర్ రిలీజ్ చేస్తారో లేదో … Read more

    రూల్స్ రంజన్ సాంగ్ రిలీజ్ చేసిన రవితేజ

    యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నెహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. ఈ చిత్రం నుంచి తాజాగా నాలుగో సింగిల్ లిరికల్ ‘దేఖో ముంబై సాంగ్‌’ను మాస్ మాహారాజ రవితేజ విడుదల చేశారు. సాంగ్ బాగుందని ప్రశంసించిన రవితేజ.. చిత్రం మంచి విజయం సాధించాలని ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. నాలో నేనే లేను, సమ్మోహనుడా పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కాగా ఈ సినిమాకు అమ్రిష్ గణేష్ సంగీతం అందించారు. అక్టోబర్ 6న సినిమా విడుదల కానుంది. https://youtube.com/watch?v=R3LZx2fidU%26t%3D12s

    రాజమౌళి కొత్త సినిమా ప్రకటన.. ఈసారి బయోపిక్

    స్టార్ డైరెక్టర్ SS రాజమౌళి సమర్పణలో కొత్త సినిమా రాబోతోంది. సినిమా పేరు ‘మేడ్‌ ఇన్ ఇండియా’. భారత సినిమా పరిశ్రమ చరిత్రపై ఇది బయోపిక్‌. ఈ సినిమాను జాతీయ అవార్డు గ్రహిత నితిన్ కక్కర్ డైరెక్ట్ చేస్తున్నాడు. రాజమౌళి కుమారుడు కార్తికేయ, వరుణ్ గుప్త ప్రొడ్యూస్ చేస్తున్నారు. మొత్తం ఆరు భాషల్లో మేడ్ ఇన్‌ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, మరాఠి, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. త్వరలోనే ఈచిత్రంపై పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. https://x.com/ManobalaV/status/1703988442571661762?s=20