దసరా పండుగ మరో రెండు వారాల టైం ఉన్న నేపథ్యంలో పెద్ద సినిమాలకు పోటీగా దిగకుండా.. ఇప్పుడే థియేటర్లలో విడుదలయ్యేందుకు ఈవారం పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఈవారం ఎక్కువగా చిన్న సినిమాలే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అలాగే ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 25కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్ వేద్దాం..
రూల్స్ రంజన్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, టిల్లు పాప నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సమ్మోహనుడా సాంగ్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. యూత్ ఇన్‌స్టారీల్స్‌లో ఈ సాంగ్‌ను పెద్దఎత్తున అనుసరించారు. కాగా సినిమాను రత్నం కృష్ణ డైరెక్ట్ చేశారు. ఏఎం రత్నం సమర్పణలో మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు.
మామ మశ్చీంద్ర
వినూత్నమైన టైటిల్‌తో సుధీర్ బాబు హీరోగా వస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర. ఈ సినిమాను హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, హీందీ భాషల్లో ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుంది.
చిన్నా
సిద్ధార్థ్, అంజలీ నాయర్ కీలక పాత్రల్లో.. అరుణ్‌కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న మలయాళ చిత్రం ‘చిత్త’. తెలుగులో ‘చిన్నా’ పేరుతో అక్టోబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న సిద్ధార్థ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
మంత్ ఆఫ్ మధు
క్రేజీయాక్టర్ నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కాంబోలో వస్తున్న వినూత్న చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. భావోద్వేగాల నేపథ్యంగా ఈ చిత్రం రూపొందింది. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించారు. యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు.
800
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా వస్తున్న చిత్రం ‘800’. మురళీ పాత్రలో మధుర్ మిట్టల్ నటించాడు. ఆయన భార్య మదిమలర్ క్యారెక్టర్లో మహిమా నంబియార్ నటించారు. అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, హిందీ, సింహాలి, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ప్రపంచ టెస్ట్ క్రికెట్లో 800 వికెట్లు తీసిన ఆటగాడిగా మురళీధరన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎంఎస్. శ్రీపతి డైరెక్ట్ చేశాడు.
ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు (October 1- 7)
Title | Category | Language | Platform | Release Date |
Beckham | Series | English | Netflix | Oct 04 |
Race to the Summit | Movie | German | Netflix | October 04 |
Everything Now | Series | English | Netflix | October 05 |
Sister Death | Movie | English | Netflix | October 05 |
Miss Shetty Mr. Polishetty | Movie | Telugu Movie | Netflix | October 05 |
Fair Play | Movie | English | Netflix | October 06 |
Insidious: The Red Door | movie | English | Netflix | October 06 |
Strong Girl Nam Soon | Series | korean | Netflix | October 07 |
Mumbai Diaries Season 2 | Series | Hindi | Amazon Prime | October 06 |
Totally Killer | Movie | English | Amazon Prime | October 06 |
Desperately Seeking Soulmate | Series | English | Amazon Prime | October 06 |
Haunted Mansion | Movie | English | Hotstar | October 04 |
Loki: Season 2 | Series | English | Hotstar | October 06 |
Mr. Pregnant | Movie | Telugu | Aha | October 06 |
The Great Indian Suicide | Movie | Telugu | Aha | October 06 |
Nee Vente Nenu | Movie | Telugu | Cine Bazaar | October 06 |
Gadar 2 | Movie | Hindi | Zee5 | October 06 |
The Nun 2 | Movie | English | Book My Show | October 03 |
Gran Turismo | Movie | English | Book My Show | October 05 |
Asteroid City | Movie | English | Book My Show | October 06 |
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్