• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భోళా శంకర్‌ నుంచి ప్రోమో రిలీజ్‌

    చిరంజీవి ‘భోళా శంకర్‌’ సినిమా నుంచి ‘జామ్‌ జామ్‌ జజ్జనక’ పాట ప్రోమో విడుదలైంది. పూర్తి లిరికల్‌ సాంగ్‌ను జులై 11న సాయంత్రం 4:05 గం.లకు రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలియజేశారు. చిరు, సుశాంత్‌, తమన్నా, కీర్తి ఈ ప్రోమోలో స్టెప్పులేస్తూ కనిపించారు. మేహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఇందులో చిరుకు జంటగా తమన్నా నటిస్తుండగా చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్‌ కనిపించనుంది.

    ‘బ్రో’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘బ్రో’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. ‘మై డియర్ మార్కెండేయ’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సింగిల్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియాప్రకాశ్ వారియర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సముద్ర ఖని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై ఈ సినిమా నిర్మితమైంది.

    ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్ రిలీజ్

    ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర 2’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఈ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. వైఎస్సార్ వాయిస్‌తో వీడియో స్టార్ట్ అవుతుంది. చివర్లో ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను.’’ అనే డైలాగ్‌తో ఎండ్ అవుతుంది. కాగా ఈ సినిమాలో జగన్ పాత్రను ‘రంగం’ మూవీ హీరో జీవా పోషిస్తున్నాడు. మహి వీ రాఘవ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

    సలార్ టీజర్‌కి రికార్డ్ వ్యూస్

    ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ టీజర్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. తక్కువ సమయంలోనే రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ఏకంగా 100మిలియన్ల(10 కోట్లు) వ్యూస్‌ని దక్కించుకున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అభిమానుల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు చిత్రబృందం ఫిదా అయింది. ఈ చిత్రం ట్రైలర్ ఆగస్టులో విడుదల చేయనున్నట్లు టాక్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.

    ఆసక్తిగా ‘బేబీ’ ట్రైలర్

    ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన బేబీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ మరింత ఆసక్తికరంగా ఉంది. వెరైటీ ప్రేమ కథాచిత్రంగా ‘బేబీ’ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. సాయిరాజేశ్ దర్శకత్వం వహించారు. ఎస్కేఎన్, డైరెక్టర్ మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూలై 14న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    ప్రభాస్‌ ‘సలార్‌’ టీజర్‌ వచ్చేసింది

    అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘సలార్‌’ టీజర్‌ వచ్చేసింది. తెల్లవారుజామున ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ప్రభాస్‌ మూవీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలను టీజర్‌లో పుష్కలంగా చూపించారు. దీనిని చూసిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ‘సలార్‌: పార్ట్‌1: సీజ్‌ఫైర్‌’ సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    ఆసక్తికరంగా ‘మంగళవారం’ టీజర్‌

    పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ’మంగ‌ళ‌వారం’ మూవీ టీజ‌ర్ రిలీజైంది. హార‌ర్ అంశాల‌తో టీజ‌ర్ ఉత్కంఠ‌ను పంచుతోంది. ప్ర‌ధాన పాత్ర‌ధారుల ముఖాల్లో భ‌యం, ఆశ్చ‌ర్చాన్ని చూపిస్తూ టీజ‌ర్ చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగింది. టీజ‌ర్‌లోని సీన్స్ ఎక్కువ‌గా డార్క్ మోడ్‌లోని క‌నిపిస్తూ ఆస‌క్తిని పెంచాయి. టీజ‌ర్ చివ‌ర్లో బోల్డ్ సీన్స్‌లో పాయ‌ల్‌ క‌నిపించింది.

    బన్నీ ఫ్యాన్స్‌కు కిక్కెక్కించే న్యూస్‌

    అల్లుఅర్జున్‌-త్రివిక్రమ్‌ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మేరకు మేకర్స్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోను రిలీజ్‌చేశారు. ఈ వీడియోను చూసిన బన్నీ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. బన్నీ – త్రివిక్రమ్‌ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. జులాయి, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, అలా వైకుంఠపురములో చిత్రాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో వీరి నుంచి రానున్న నాల్గో సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందించనున్నారు. The Dynamic duo is Back! ? Icon StAAr @alluarjun … Read more

    కొత్త సినిమా ట్రైలర్‌ అదుర్స్!

    ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్‌ను హీరో విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు. లవ్‍స్టోరీ, కామెడీ, క్రైమ్‍ అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. 30 వెడ్స్ 21 సిరీస్‍తో మంచి క్రేజ్ సంపాదించిన చైతన్య రావ్‌ ఇందులో హీరోగా చేశాడు. సినిమాకు చెందు ముద్దు డైరెక్టర్‌ కాగా, బిగ్‍బెన్ సినిమా బ్యానర్‌పై యశ్ రంగినేని నిర్మించారు.

    ‘రుద్రమాంబపురం’ ట్రైలర్ రిలీజ్

    మహేష్ బంటు దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రమాంబపురం’ ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అన్నివర్గాలను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కూడా ప్రేక్షకులను అలరించాయి. మత్స్యకారుల జీవన విధానంపై ఈ సినిమా తీశారు. ఈ చిత్రాన్ని నండూరి రాము నిర్మించారు. ఈ సినిమాలో శుభోదయం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేశ్, పలాస జనార్థన్, నండూరి రాము, సాయి, ప్రమీల తదితరులు కీలక పాత్రలు పోషించారు.