మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీకి మకుటంలేని మహారాజు. ఆయన 150కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల చేత మెగాస్టార్‌గా పిలుపించుకున్నారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయ్యారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను రంజింపజేశారు. ఈ సందర్భంగా అనేక సినిమాల్లో డ్యూయర్ రోల్స్ చేసి తనదైన ముద్ర వేశారు. మరి మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్స్‌లో నటించిన చిత్రాలు ఏవో ఓసారి చూసేద్దామా..
1. నకిలీ మనిషి (1980)
చిరంజీవి తొలిసారి ‘నకిలీ మనిషి’ చిత్రంలో డ్యూయల్ (Chiranjeevi Dual Role Movies) రోల్‌లో కనిపించారు. ఈ సినిమాను ఎస్.డీ.లాల్ తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి.. ప్రసాద్, శ్యామ్ పాత్రల్లో కనిపించారు.
2. బిల్లా రంగా (1982)
ఈ చిత్రాన్ని కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రాల్లో నటించారు. చిరుతో పాటు మోహన్ బాబు, రాధిక, ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
3. రోషగాడు (1983)
చిరంజీవి ఈ సినిమాలో శ్రీకాంత్, సికిందర్ అనే రెండు పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన మాధవి, సిల్క్ స్మిత నటించారు.
4. సింహపురి సింహం (1983)
కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి రాజశేఖరం, విజయ్ అనే తండ్రి, కొడుకు పాత్రల్లో అలరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది.
5. జ్వాల(1985)
రవిరాజా పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి అన్నదమ్ముడిగా(Chiranjeevi Dual Role Movies) నటించారు. ఆయన సరసన రాధిక, భానుప్రియ నటించారు.
6. రక్త సింధూరం (1985)
రక్త సింధూరంలో కూడా చిరంజీవి అన్నదమ్ములుగా డబుల్ రోల్‌లో మెప్పించారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ గోపిగా, గండ్రగొడ్డలి క్యారెక్టర్‌లో నటించారు. ఈ సినిమాను ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు.
7. దొంగమొగుడు (1987)
ఎ.కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో చిరంజీవి.. రవితేజ, నాగరాజుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక, భానుప్రియ నటించారు.
8. యముడికి మొగుడు (1988)
రావిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కాళీ, బాలు పాత్రల్లో చిరంజీవి డ్యూయల్ రోల్‌లో మెప్పించారు.
9.రౌడీ అల్లుడు (1991)
కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో చిరంజీవి ఆటో జానీగా, కళ్యాణ్‌బాబుగా (Chiranjeevi Doublel Role Movies)నటించారు.
10. ముగ్గురు మొనగాళ్లు (1994)
ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి… పృథ్వీ, విక్రమ్, నటరాజ రామకృష్ణ దత్తాత్రేయగా మూడు పాత్రల్లో తొలిసారి త్రిపాత్రాభినయం చేశారు. ఈ సినిమాను కే. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
11. రిక్షావోడు (1995)
కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రల్లో నటించారు.
12. స్నేహం కోసం (1999)
కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలోనూ చిరంజీవి తండ్రి కొడుకులుగా(Chiranjeevi Dual Role Movies) నటించారు. చిరంజీవి సరసన మీనా నటించింది.
13. అందరివాడు (2005)
చిరంజీవి ఈ సినిమాలో మరోసారి తండ్రి కోడుకుల పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
14. ఖైదీ నంబర్ 150 (2017)
ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని వి.వి.నాయక్ డైరెక్ట్ చేశారు. మరోసారి రెండు పాత్రల్లో మెగాస్టార్ మెప్పించారు. కత్తి శీను, శంకర్‌గా అలరించారు.
మెగాస్టార్ చిరంజీవి మొత్తంగా 14 చిత్రాల్లో డ్యూయల్ రోల్స్‌లో నటించి మెప్పించారు. ఇంకా ఆయన సినీ ప్రస్థానం ముందుకు సాగాలని మనమంత కోరుకుందాం.