సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవల ఓ బిజినెస్ మ్యాన్ పుట్టినరోజు వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. మాల్దీవుల్లో జరిగిన ఈ సెలబ్రేషన్స్‌కు మహేష్‌తో పాటు టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, అఖిల్, వెంకటేష్ హాజరయ్యారు. సెలబ్రిటీలంతా కలిసిన దిగిన ఓ ఫొటో ఇటీవల బయటకు రాగా అది క్షణాల్లో నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా మరికొన్నిఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో మహేష్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ ట్రోలింగ్ (Mahesh Babu Trolls)కు గురవుతోంది. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహేష్ మరీ ఇంత ఇంట్రోవర్టా?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్రోవర్ట్ (Mahesh Babu Trolls) అన్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా ఫంక్షన్స్‌లో చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. తన మూవీ ఈవెంట్ అయినా కూడా కొద్ది మాటలతోనే ముగిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మహేష్ ఎంత ఇంట్రోవర్టో మరోమారు బయటపడింది. ఈ వీడియోలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అందరూ బర్త్‌డే బాయ్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటే మహేష్ మాత్రం పక్కనే కొంచెం గ్యాప్‌తో సైలెంట్‌గా నిల్చున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుంటే మహేష్ మాత్రం పక్కన ఫొటోకి ఫోజు ఇచ్చినట్లు నిలబడిపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మహేష్‌ను చూసి నవ్వుకుంటున్నారు. మహేష్ మరీ ఇంత ఇంట్రోవర్టా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మీమర్స్ స్టఫ్‌గా మహేష్..!
అయితే మహేష్ బాబు తాజా వీడియోను ఇంట్రోవర్ట్స్ అంతా ఓన్ చేసుకుంటున్నారు. ఇంట్రోవర్ట్స్ కమ్యూనిటీలోకి స్వాగతం అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆ వీడియోను పలు రకాలుగా ఎడిటింగ్ చేసి మీమ్స్ స్టఫ్ (Mahesh Babu Trolls)గా వాడుకుంటున్నారు. ‘మహేష్ బాబు.. సేమ్ టూ సేమ్ నాలాగే’ అంటూ ఇంట్రోవర్ట్స్ పోస్టులు పెడుతున్నారు. తాము కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుంటామని తెలియజేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్‌పై మహేష్ అభిమానులు మాత్రం తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. ‘నిండు చంద్రుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు’ అంటూ సమర్థించుకుంటున్నారు. నలుగురిలో ప్రత్యేకంగా ఉండటం తమ హీరోకు అలవాటని వెనకేసుకొస్తున్నారు.
ధనుష్ కోసం మహేష్..
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కుబేర‘. తమిళ స్టార్ హీరో ధనుష్ ఇందులో హీరోగా చేస్తున్నాడు. టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. రేపు (నవంబర్ 15) కార్తీక పౌర్ణమి సందర్భంగా ‘కుబేర’ గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ గ్లింప్ల్ విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. కాగా ఈ మూవీలో ధనుష్, నాగార్జున మధ్య వచ్చే సీన్స్ చాలా వైవిధ్యభరితంగా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
మహేష్ లేటెస్ట్ లుక్ అదుర్స్!
బిజినెస్ మ్యాన్ బర్త్‌డే ఫంక్షన్‌లో మహేష్‌కు సంబంధించి మరిన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. పార్టీ ఇచ్చిన బిజినెస్ మ్యాన్ కపుల్స్‌తో మహేష్ దంపతులు ఫొటోలు దిగారు. ఈ ఫొటోల్లో మహేష్ లుక్ అదిరిపోయింది. గతంలో వచ్చిన పిక్స్‌లో మహేష్ గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో కనిపించాడు. లేటెస్ట్ పిక్స్‌లో మాత్రం అతడి హెయిర్ కాస్త షార్ట్ అయ్యింది. అలాగే గడ్డాన్ని కూడా ట్రిమ్ చేశాడు. పూర్తిగా ఉంగరాల జుట్టుతో కనిపించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ రాజమౌళి సినిమాలో మహేష్ ఇలాగే కనిపిస్తారేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హైదరాబాద్‌లో వారణాసి సెట్!
రాజమౌళి – మహేష్ బాబు (SSMB29) చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ వారణాసి నేపథ్యంలో మెుదలవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత సౌతాఫ్రికాకు షిఫ్ట్ అవుతుందని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వారణాసి షెడ్యూల్ మెుత్తాన్ని ఓ సెట్‌లో పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నారట. దాని కోసం హైదరాబాద్ శివార్లలో భారీ కాశీ సెట్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కథ మెుత్తం అటవీ నేపథ్యంలో సాగనుండటంతో అందుకు అనువైన ప్రదేశాన్ని జక్కన్న టీమ్ రెక్కీ చేస్తున్నట్లు సమాచారం. లోకేషన్ ఫైనల్ కాగానే సెట్ నిర్మాణ పనులను మెుదలుపెడతారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Celebrities Featured Articles Politics
Allu Arjun: ‘నరబలి జరిగితే.. నా సినిమా హిట్టని అల్లు అర్జున్ అన్నాడు’.. కాంగ్రెస్ MLA షాకింగ్ కామెంట్స్