అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2‘ (Pushpa 2) చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్ చేస్తోందో అందరికీ తెలిసిందే. గతేడాది డిసెంబర్ 6న రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటికీ సాలిడ్ వసూళ్లను సాధిస్తోంది. ఇందులో బన్నీ నటన నెక్స్ట్ లెవల్లో ఉంది. ముఖ్యంగా జాతర సీన్‌లో అతడి పర్‌ఫార్మెన్స్ గూస్‌బంప్స్ తెప్పించిందని ఆడియన్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే గత కొన్నిరోజులుగా మూవీలోని ఫుల్ వీడియో సాంగ్స్‌ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాాజాగా మోస్ట్ వాంటెడ్ జాతర పాటను రిలీజ్ చేశారు. సినిమాకే హైలెట్‌గా నిలిచిన ఈ పాటను విడుదల చేయడంతో సినీ లవర్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న సాంగ్..
‘పుష్ప 2’ చిత్రంలోని జాతర సాంగ్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. మెుత్తం 3 నిమిషాల 28 సెకన్ల నిడివితో ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సాంగ్ అందుబాటులోకి వచ్చింది. ‘గంగో రేణుక తల్లి’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. తెలుగు వెర్షన్‌లో నాలుగు గంటల వ్యవధిలోనే 6 లక్షల మంది ఈ పాటను వీక్షించారు. ప్రతీ నిమిషానికి వ్యూస్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక ఈ సాంగ్‌లో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. గంగమ్మ జాతర సాంగ్‌లో కళ్లకు కాటుక, ఒంటికి నీలిరంగు పట్టుచీర, చేతులకు గాజులు, కాళ్లకు గజ్జ కట్టి తన మెస్మరైజ్ డ్యాన్స్‌తో అందరికీ పూనకాలు తెప్పించాడు. విడుదల నేపథ్యంలో ఈ పాట గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఈ పాటకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్‌ను ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు.
సినిమాకే హైలెట్‌గా జాతర ఎపిసోడ్..
దర్శకుడు సుకుమార్ ఎంతో క్రియేటివ్‌గా జాతర ఎపిసోడ్‌ను రూపొందించారు. జాతర సీక్వెన్స్‌ను మెుత్తం మూడు డైమన్షన్స్‌లో రూపొందించారు. సాంగ్‌తో పాటు అద్భుతమైన ఫైట్, హృదయాలకు హత్తుకునే ఎమోషన్స్‌ను ఈ ఎపిసోడ్‌లో చక్కగా చూపించాడు. బన్నీ నటన సినిమా మెుత్తం ఒక ఎత్తు.. ఈ ఒక్క జాతర ఎపిసోడ్‌లో మరో ఎత్తు అన్న కామెంట్స్ బలంగా వినిపించాయి. ఈ సీక్వెన్స్‌లో బన్నీ నటనకు మరో నేషనల్ అవార్డు పక్కా అంటూ పెద్ద ఎత్తున ప్రశంసలు సైతం వచ్చాయి. కాగా, ఏటా తిరుపతిలో జరిగే ఈ ప్రసిద్ధ గంగమ్మ జాతరను ఆధారంగా చేసుకొని సుకుమార్ ఈ ఎపిసోడ్‌ను రూపొందించడం విశేషం.
రెండ్రోజుల్లో ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు!
గత ఏడాది డిసెంబర్ 4న విడుదలైన ‘పుష్ప 2’ చిత్రం ప్రస్తుత నాలుగో వారంలోనూ సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం నాలుగు వారాల్లో రూ.1799 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే 2017లో రిలీజైన బాహుబలి 2 రూ.1810 కోట్ల వసూళ్ల దేశంలోనే సెకండ్ హయేస్ట్ గ్రాసింగ్ మూవీగా ఉంది. ఈ లెక్కన ‘పుష్ప 2’ చిత్రం రెండు, మూడు రోజుల్లో ‘బాహుబలి 2’ను ఈజీగానే క్రాస్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే దర్శకధీరుడు రాజమౌళి సినిమాలన్నింటినీ బన్నీ-సుకుమార్ ద్వయం వెనక్కి నెట్టినట్లు అవుతుంది.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?