Game Changer Trailer: కత్తిపట్టి హెలికాఫ్టర్ దిగిన చరణ్‌.. ట్రైలర్‌తో గూస్‌బంప్స్ తెప్పించారుగా!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Game Changer Trailer: కత్తిపట్టి హెలికాఫ్టర్ దిగిన చరణ్‌.. ట్రైలర్‌తో గూస్‌బంప్స్ తెప్పించారుగా!

    Game Changer Trailer: కత్తిపట్టి హెలికాఫ్టర్ దిగిన చరణ్‌.. ట్రైలర్‌తో గూస్‌బంప్స్ తెప్పించారుగా!

    January 2, 2025

    గ్లోబల్‌ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరెకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కాబోతోంది. రిలీజ్‌కు 8 రోజుల సమయం మాత్రమే ఉండటంతో మూవీ టీమ్‌ ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కన్నతో పాటు మూవీ టీమ్‌, పాత్రికేయులు పాల్గొన్నారు. 

    హైప్ పెంచేసిన ట్రైలర్‌

    హైదరాబాద్‌లోని ప్రముఖ ఏఎంబీ మాల్‌ (AMB Mall)లో ఈ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హీరో రామ్‌చరణ్‌తో పాటు, డైరెక్టర్‌ శంకర్‌, శ్రీకాంత్‌, అంజలి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ తదితరులు పాల్గొన్నారు. ముందుగా చెప్పినట్లుగానే దర్శకధీరుడు రాజమౌళి ఈ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. 2 నిమిషాల 40 నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. రామ్‌ చరణ్‌ లుక్స్‌, మేనరిజమ్స్‌ అదిరిపోయాయి. థమన్‌ మాస్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో ట్రైలర్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. ఇప్పటికే ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి రిలీజ్‌ చేసిన, టీజర్‌, సాంగ్స్‌ భారీ హైప్ ఇచ్చాయి. ఇప్పుడు ట్రైలర్ అంతకుమించి ఉండటంతో అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

    హైలెట్‌గా నిలుస్తున్న డైలాగ్స్‌..

    గేమ్ ఛేంజర్‌ను పొలిటికల్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులోని కొన్ని డైలాగ్స్ బాగా పేలాయి. ట్రైలర్ ప్రారంభంలో చరణ్ చెప్పే ‘కడుపునిండా వంద ముద్దలు తినే ఏనుగు.. ఒక్క ముద్ద వదిలిపెడితే.. పెద్దగా దానికొచ్చే నష్టమేమి లేదు. కానీ, అది లక్ష చీమలకు ఆహారం’ అనే డైలాగ్‌ బాగుంది. అలాగే చివర్లో వచ్చే ‘నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్‌.. నేను చనిపోయేవరకూ ఐఏఎస్‌’, ‘రా కి రా.. సర్‌కి సర్‌’, ‘ఐయామ్‌ అన్‌ ప్రిడిక్టబుల్‌’ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆఖర్లో కత్తి పట్టుకొని హెలికాఫ్టర్‌ దిగే సీన్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది. 

    ట్రైలర్‌తో స్టోరీ రివీల్‌!

    దర్శకుడు శంకర్‌ ట్రైలర్‌లో ‘గేమ్‌ ఛేంజర్‌’ కథను చెప్పకనే చెప్పాడు. ఇందులో చరణ్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపించాడు. అందులో ఒకటి ఐఏఎస్‌ (కొడుకు) కాగా, ఇంకోటి వింటేజ్‌ పొలిటిషియన్‌ (తండ్రి) రోల్‌. తండ్రి పాత్రలోని చరణ్‌ ఫ్లాష్‌ బ్యాక్‌లో ఓ పొలిటికల్‌ పార్టీని స్థాపిస్తాడు. ‘మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు’ అంటూ ప్రజాసేవకు పాటుపడనున్నట్లు చెప్తాడు. ఈ క్రమంలో అతడ్ని ఎవరో రాజకీయంగా మోసం చేసినట్లు కూడా ట్రైలర్‌ చూపించారు. కట్‌ చేస్తే ప్రస్తుతం సీఎంగా మోపీదేవి (ఎస్‌.జే.సూర్య) ప్రమాణ స్వీకారం చేయడం, అతడికి ఐఏఎస్‌ అయిన చరణ్‌ సవాల్‌ విసరడం ట్రైలర్‌లో గమనించవచ్చు. అయితే మోపీదేవి చేతిలో ఫాదర్ క్యారెక్టర్‌ మోసపోయి ఉండవచ్చు. ఐఏఎస్‌ అయిన చరణ్‌.. తన తండ్రికి జరిగిన అన్యాయానికి మోపీదేవిపై ప్రతీకారం తీర్చుకోనున్నట్లు కనిపిస్తోంది. జనవరి 10న దీనిపై క్లారిటీ రానుంది. 

    చరణ్‌పై రాజమౌళి ప్రశంసలు

    గేమ్‌ ఛేంజర్‌ ట్రైలర్ లాంచ్ అనంతరం దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. ‘హెలికాఫ్టర్‌ నుంచి కత్తి పట్టుకొని దిగుతుంటే థియేటర్లలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. అలాగే ఏడుస్తూ ఫోన్‌ మాట్లాడే షాట్‌తో అందరిచేత కంటతడి పెట్టించగలడు. అంత హృద్యమైన సీన్స్‌ చేయగలడు.. అంతేస్థాయిలో చరణ్‌ మాస్‌ కూడా పండించగలడు’ అని అన్నారు. ఇక గుర్రంపై వచ్చే షాట్‌ గురించి మాట్లాడుతూ ‘ఇంకొకసారి నువ్వు ఏదన్న గుర్రంపై షాట్‌ తీస్తుంటే నా పర్మిషన్‌ తీసుకోవాలి. అందరికీ చేయడానికి కుదరదు (నవ్వుతూ)’ అంటూ జక్కన్న ఫన్నీగా మాట్లాడారు.

    సెలబ్రిటీల కామెంట్స్..

    ‘గేమ్‌ ఛేంజర్‌’కు పనిచేసిన పలువురు సెలబ్రిటీలు ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొని మాట్లాడారు. డైలాగ్ రైటర్‌ సాయి మాధవ్‌ బుర్రా మాట్లాడుతూ ‘వచ్చేది సంక్రాంతి కాదు శంక్రాంతి.. అద్భుతమైన సినిమాకు నేను వర్క్ చేశాను. గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ రాసిపెట్టుకొండి’ అని అన్నారు. ‘రామ్ చరణ్‌తో గోవిందుడు అందరివాడేలేతో వర్క్ చేశాను. ఈ సినిమాలో చూసినపుడు నటుడిగా ఎక్కడికో ఎదిగిపొయాడు’ అని శ్రీకాంత్ చెప్పారు. ‘గేమ్‌ ఛేంజర్‌’లో తన పాత్ర కెరీర్‌లోనే ఉత్తమమైనదిగా నిలుస్తుందని హీరోయిన్‌ అంజలి పేర్కొంది. ఇందులో విలన్‌గా చేసిన ఎస్‌.జే. సూర్య స్పందిస్తూ ‘ఈ సినిమాలో నటించే అవకాశం రావటం సంతృప్తి ఇచ్చింది. చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు. కానీ ఎలాంటి ఆటిట్యూడ్ లేని వ్యక్తి’ అని అన్నారు. నిశ్చితార్థం అయిన అమ్మాయిని దాచినట్లు దిల్ రాజు మూడేళ్ల నుంచి ‘గేమ్ ఛేంజర్’ను దాస్తూ వచ్చారని సంగీత దర్శకుడు థమన్‌ చెప్పుకొచ్చారు. శంకర్‌ సినిమాకు పనిచేయడం గర్వకారణమన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version