ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతపెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇందులో సమంత చేసిన ‘ఊ అంటావా ఊఊ అంటావా’ ఐటెం సాంగ్ యావత్ దేశాన్ని ఉర్రూతలూగించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ ఈ తరహా ఐటెంగ్ సాంగ్ (Pushpa 2 Item Song)ను సుకుమార్ ఏర్పాటు చేశాడు. ఈసారి సమంత ప్లేసులో శ్రీలీల ఈ స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఇటీవల సాంగ్ షూటింగ్ సెట్ నుంచి శ్రీలీల ఫొటోలు సైతం బయటకొచ్చాయి. ఇదిలాఉంటే శ్రీలీల పారితోషికంకు సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. దీంతో ఆమెకు అన్యాయం జరిగిందన్న వాదనలు ఊపందుకున్నాయి.
శ్రీలీల పారితోషికం ఎంతంటే?
అల్లుఅర్జున్ – సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా సుకుమార్‌గా తమవంతు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఐటెం సాంగ్ (Pushpa 2 Item Song)లో చేసిన హీరోయిన్ శ్రీలీలకు భారీ మెుత్తంలో పారితోషికం ముట్టచెప్పినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ‘కిస్సిక్కి’ అంటూ సాగే ఈ పాట కోసం ఆమె ఏకంగా రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెట్, హీరోయిన్ పారితోషికం ఇతర మొత్తం కలిపి రూ.5 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా వేస్తున్నాయి.
సమంతతో పోలిస్తే అన్యాయం!
2021లో వచ్చిన ‘పుష్ప’ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసింది. ఇందుకు గాను సామ్ అప్పట్లోనే రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శ్రీలీలకు రూ.2 కోట్ల పారితోషికం ఇవ్వడంపై ఆమె అభిమానులు పెదవి విరుస్తున్నారు. శ్రీలీలకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సమంతకు ఇచ్చిన దానిలో సగం కూడా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీలకు ఏం తక్కువ అని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిని ఫిల్మ్ వర్గాలు ఖండిస్తున్నాయి. శ్రీలీలకు ఎలాంటి అన్యాయం జరగలేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల మూడు గంటల సినిమా చేస్తే రూ.4-5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ‘పుష్ప 2’లో 3 నిమిషాల పాటకే ఆమెకు రూ. 2 కోట్లు ఇస్తున్నారని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఆమెకు తన మార్కెట్ విలువ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్‌ను అందిందని పేర్కొంటున్నారు.
శ్రీలీల.. బన్నీ ఛాయిస్!
పుష్ప 2 ఐటెం సాంగ్ (Pushpa 2 Item Song)కు శ్రీలీలను ఎంచుకోవాలన్నది డైరెక్టర్ సుకుమార్ ఆలోచన కాదని సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జునే శ్రీలీలను సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీ ఇంతకుముందే శ్రీలీలతో కలిసి ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ కోసం ఒక యాడ్ చేశాడు. వీరిద్దరి కెమెస్ట్రీ బాగుందంటూ అప్పట్లోనే సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. మరోవైపు ఈ జనరేషన్ హీరోయిన్లలో శ్రీలీల బెస్ట్ డ్యాన్సర్ కీర్తింప బడుతోంది. ఈ నేపథ్యంలో బన్నీ-శ్రీలీల ఒకే వేదికపై ఆడి పాడితే ఆడియన్స్‌లో పూనకాలు రావడం పక్కా. ఇవన్నీ ఆలోచించే శ్రీలీలపై బన్నీ మెుగ్గు చూపినట్లు సమాచారం. అంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శ్రద్ధా కపూర్, దిశా పటానీ, త్రిప్తి దిమ్రి పేర్లు ఈ ఐటెం సాంగ్ పరిశీలనలోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
పాట్నాలో ట్రైలర్ రిలీజ్
దేశ విదేశాల్లో ఉన్న సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule). మూవీ రిలీజ్ దగ్గరపడుతుండటంతో ట్రైలర్ రిలీజ్‌పై మూవీ టీమ్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు పాట్నాలో ట్రైలర్ (Pushpa 2 Trailer)ను విడుదల చేయనున్నట్లు రీసెంట్‌గా ప్రకటించింది. ఈ మేరకు బన్నీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను సైతం రిలీజ్ చేసింది. ఇందులో గన్ భుజాన పెట్టుకొని పుష్పగాడు ఎంతో అగ్రెసివ్‌గా కనిపించాడు. ఇది చూసిన సినీ లవర్స్ తెగ ఖుషీ అవుతున్నారు. పుష్ప 2 ట్రైలర్ దెబ్బకు సోషల్ మీడియా మోతమోగడం ఖాయమని అంటున్నారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ