అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ (NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘దేవర’ (Devara). పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. కాగా, ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే తాజాగా రిలీజ్ డేట్‌ను మార్చాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ముందే రానుందట..!
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ (Devara) చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజై మంచి ఆదరణ సంపాదించింది. ఇదిలా ఉంటే.. ‘దేవర’ చెప్పిన తేదీ కంటే ముందే థియేటర్లలోకి రానున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 10 కంటే రెండు వారాలు ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 27న మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు కూడా మెుదలైనట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.
ప్రీ-పోన్‌కు కారణం ఇదే!
వాస్తవానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కావాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా పవన్.. ఏపీ రాజకీయాలకు పూర్తిగా సమయం కేటాయించడం.. తాజాగా మంత్రిగానూ ప్రమాణం స్వీకారం చేయడంతో ఇప్పట్లో ఓజీ షూటింగ్‌లో పాల్గోనే అవకాశం లేదని అంటున్నారు. దీంతో ‘ఓజీ’ (OG) సినిమా.. ఈ ఏడాది రిలీజయ్యే అవకాశం లేదని ఇండస్ట్రీలో బలంగా టాక్ వినిపిస్తోంది. దీంతో ఓజీకి లాక్ చేసిన తేదీనే ‘దేవర’ను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని కొరటాల శివ టీమ్ యోచిస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 27న ‘దేవర’తో థియేటర్లు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
గోవాలో షూటింగ్..
ప్రస్తుతం.. ‘దేవర’ టీమ్ గోవాలో బిజీ బిజీగా గడుపుతోంది. తారక్, జాన్వీ కపూర్‌ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను గోవా చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. మరి కొన్ని రోజుల పాటు ఈ షూటింగ్ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ అందించిన ఫస్ట్ సింగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. రెండో పాటను కూడా త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి రొమాంటింక్ మెలోడీని రిలీజ్ చేసే అవకాశమున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
భారీ ధరకు ఓటీటీ హక్కులు!
దేవర చిత్రం థియేటర్లలోకి రాకముందే ఓటీటీ హక్కులు అమ్ముడు పోయాయి. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) దేవర ఓటీటీ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్.. దాదాపు రూ.155 కోట్లు ఖర్చుపెట్టిందని వార్తలు వచ్చాయి. దేవర విడుదలైన 56 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసుకునేలా నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుందని సమాచారం. తెలుగు, హిందీతో పాటు మరిన్ని సౌత్ భాషలలో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
‘దేవర’లో ఎన్టీఆర్ పాత్ర ఇదే!
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. సముద్ర తీర ప్రాంత ప్రజల సమస్యలను తీర్చే నాయకుడిగా తారక్.. దేవరలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్‌లోని హీరోయిజాన్ని దర్శకుడు కొరటాల శివ.. ఈ మూవీతో పతాక స్థాయికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్‌కు ధీటుగా నిలబడే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అతడి పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు టాక్. ఈ మూవీ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.