DJ Tillu Trailer raises expectations on Movie
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • DJ Tillu Trailer raises expectations on Movie

    DJ Tillu Trailer raises expectations on Movie

    ‘డీజే టిల్లు’ ట్రైల‌ర్ సోష‌ల్‌మీడియాలో ర‌చ్చ చేస్తుంది. యూట్యూబ్‌లో నెంబ‌ర్ వ‌న్ ట్రెండింగ్‌లో కొన‌సాగుతుంది. డీజే టిల్లు పాటకు ఇప్ప‌టికే సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ట్రైల‌ర్‌తో మ‌రిన్ని అంచ‌నాల‌ను పెంచేసింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శర్మ హీరోహీరోయిన్లుగా న‌టించారు. స్టోరీ, స్క్రీన్‌ప్లే విమ‌ల్ కృష్ణ‌తో పాటు హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ అందించారు. ద‌ర్శ‌క‌త్వం విమ‌ల్ కృష్ణ‌. డైలాగ్స్ సిద్ధు రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాకు త‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఫిబ్రవరిలో సినిమా థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు.

    గ‌తంలో కృష్ణ అండ్ హిజ్ లీలా, గుంటూర్ టాకీస్ ఇలా విభిన్న ప్రేమ క‌థ‌ల్లో న‌టించాడు సిద్ధు. దీంతో ఆయ‌న‌కు సెప‌రేట్ ఫ్యాన్స్ బేస్ ఏర్ప‌డింది. సిద్ధు మూవీ అంటే ఏదో కొత్త‌ద‌నం ఉంటుంద‌నే అంచనాలు ఏర్ప‌డ్డాయి. అయితే ఈసారి రొమాంటిక్ ల‌వ్‌స్టోరీలా కాకుండా డిఫ‌రెంట్ స్టోరీతో డీజే టిల్లు తెర‌కెక్కించిన‌ట్లు వెల్ల‌డించారు. హీరోయిన్ నేహా శెట్టి ఇంత‌కుముందు మెహ‌బూబా, గ‌ల్లీ రౌడీ సినిమాల త‌ర్వాత చేస్తున్న మూడో సినిమా. 

    సంక్రాంతి సమ‌యంలోనే సినిమా రావాల్సి ఉండ‌గా క‌రోనా కార‌ణంగా వాయిదాప‌డింది. ఈ నెల‌లోనే సినిమా ప్రేక్ష‌కులు ముందుకు రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సినిమాపై చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు చిత్ర‌బృందం. ఇది యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ అని, ప్రేక్ష‌కులను క‌డుపుబ్బా న‌వ్విస్తుంద‌ని చెప్తున్నారు.

    ట్రైల‌ర్ చూస్తుంటే ఆ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. తెలంగాణ యాస‌లో సిద్ధు చెప్తున్న డైలాగ్స్ అల‌రిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. ఇందులో బ్ర‌హ్మాజీ, ప్రిన్స్ వంటివాళ్లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. హీరోయిన్ చుట్టూ ఈ పాత్ర‌ల‌న్నీ ఉంటాయ‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. సినిమాకు శ్రీ చ‌ర‌ణ్ పాకాల రెండు పాట‌లు, రామ్ మిరియాలా ఒక పాట అందించారు. ఇక త‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ మ్జూజిక్ అందించారు. శ్రీచ‌ర‌ణ్ మ్యూజిక్ చేసిన ఒక పాట‌ను ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్ పాడ‌టం విశేషం.

    సిధ్దు ఈ సినిమాలో డీజే పాత్ర పోషిస్తున్నాడు. డీజే నుంచి మ్యూజిక్ డైర‌క్ట‌ర్ కావాల‌నే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ట్రైల‌ర్‌తో తెలుస్తుంది. నెక్ట్స్ ఇయ‌ర్ బ‌న్నీ మూవీతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా లాంచ్ అయితున్న నేను.  నేను చేసిన ఒక పాట‌ను బ‌న్నీ చూసి  బ‌ట్ట‌లు చింపేసుకున్నాడు గిసొంటి పాట‌నే కావాలిరా బ‌య్ అన్న‌డు అని హీరో చెప్పే డైలాగ్స్ యూత్‌కి క‌నెక్ట్ అయ్యేలా ఉన్నాయి. త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్స్ వ‌ల్ల సినిమా బాగొచ్చింద‌ని నిన్న సిద్ధు ట్రైల‌ర్ లాంచ్‌లో చెప్పాడు. 

    చిన్న సినిమాగా ప్రారంభ‌మైన ఈ సినిమా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ భాగ‌స్వామ్యంతో త‌మ‌న్, అనిరుద్  వంటి స్టార్ టెక్నీషియ‌న్స్ యాడ్ కావ‌డంతో అంచ‌నాల‌ను పెంచేసింది. ట్రైల‌ర్, సినిమా ప్ర‌మోష‌న్స్ మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఈ ఫిబ్ర‌వరిలో డీజే టిల్లు ఏ రేంజ్‌లో మోగిస్తాడో చూడాలి మ‌రి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version