Double Ismart: చిక్కుల్లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. పూరి, రామ్‌ను వెంటాడుతున్న ‘లైగర్‌’ నష్టాలు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Double Ismart: చిక్కుల్లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. పూరి, రామ్‌ను వెంటాడుతున్న ‘లైగర్‌’ నష్టాలు!

    Double Ismart: చిక్కుల్లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. పూరి, రామ్‌ను వెంటాడుతున్న ‘లైగర్‌’ నష్టాలు!

    July 31, 2024

    ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని (Ram Pothineni), డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబోలో రూపొందిన సెకండ్‌ ఫిల్మ్‌ ‘డబుల్ ఇస్మార్ట్‌’ (Double Ismart). గతంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (Ismart Shankar)కు సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందింది. ఆగస్టు 15న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. ఇటీవల సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న డైరెక్టర్‌ పూరికి, రామ్‌లకు ఈ మూవీ సక్సెస్‌ ఎంతో కీలకంగా మారింది. ఇటీవల రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను సైతం పెంచేసింది. దీంతో అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో ఈ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీకి ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. పూరి డైరెక్షన్‌లో వచ్చిన ‘లైగర్‌’ (Liger) సినిమా ఆర్థిక కష్టాలు రామ్‌ చిత్రాన్ని చుట్టుముడుతున్నాయి. 

    అసలేం జరిగిందంటే?

    ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీకి లైగర్ నష్టాలు పెద్ద తలనొప్పిగా మారాయి. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబోలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘లైగర్‌’ (Liger) ఊహించని స్థాయిలో డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లకు పెద్ద ఎత్తున నష్టాలను మిగిల్చింది. అయితే లైగర్‌ నష్టాలను సెటిల్‌ చేయకుండా పూరి మరో సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేయడంపై డిస్టిబ్యూటర్లు కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. లైగర్‌ నష్టాలను సెటిల్‌మెంట్ చేసేవరకూ ఈ చిత్రాన్ని ప్రదర్శించకూడదని వారు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఓ పెద్ద డిస్ట్రిబ్యూటర్‌ ఆఫీస్‌లో మీటింగ్‌ కూడా జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో లైగర్ నష్టాల భర్తీ గురించి కూలంకుషంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ రిలీజ్‌కు ఏమైనా ఆటంకం కలుగుతుందా అన్న ఆందోళన మూవీ టీమ్‌లో నెలకొంది. 

    సాంగ్‌ పైనా వివాదం!

    ఇటీవల డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమా నుంచి రెండో లిరికల్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ‘మార్ ముంత చోడ్ చింత’ పేరుతో సెకండ్‌ సింగిల్‌ను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. అయితే ఈ పాట మధ్యలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ ఉపయోగించారు. సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయిన ‘ఏం జేద్దామంటవ్ మరీ’ పదాన్ని వాడారు. అది కూడా డైరెక్ట్‌గా కేసీఆర్ వాయిస్‌తోనే ఉపయోగించారు. దీంతో కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కల్చర్‌ను తాగుడు సంస్కృతిగా చూపించేలా ఈ పాట ఉందంటూ విమర్శలు చేశారు. కేసీఆర్‌ డైలాగ్‌ను తొలగించకపోతే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే దీనిపై మూవీ టీమ్‌ స్పందించాల్సి ఉంది. 

    పోటీగా మూడు చిత్రాలు

    డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ‘పుష్ప 2‘ ఆ రోజున రిలీజ్‌ కావాల్సి ఉంది. షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ సినిమాను డిసెంబర్‌ 6కు పోస్టు పోన్‌ చేశారు. దీంతో ఆ డేట్‌ను పూరి జగన్నాథ్‌ తన సినిమా కోసం లాక్‌ చేశారు. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువ లేదు. రవితేజ నటించిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan), కోలీవుడ్‌ స్టార్‌ విక్రమ్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ‘తంగలాన్‌’ (Thangalaan) చిత్రాలు ఆగస్టు 15న రిలీజ్‌ కాబోతున్నాయి. వీటితో పాటు ‘ఆయ్‌’ అనే మరో మూవీ కూడా డబుల్‌ ఇస్మార్ట్‌కు పోటీగా బరిలోకి దిగుతోంది. దీంతో ఆ మూడు చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద తలపడాల్సిన పరిస్థితి ‘డబుల్‌ ఇస్మార్ట్‌’కు ఏర్పడింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version