Fahadh Faasil: పుష్ప విలన్‌ ఫహాద్‌ ఫాజిల్‌కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Fahadh Faasil: పుష్ప విలన్‌ ఫహాద్‌ ఫాజిల్‌కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!

    Fahadh Faasil: పుష్ప విలన్‌ ఫహాద్‌ ఫాజిల్‌కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!

    May 28, 2024

    ‘పుష్ప’ (Pushpa) సినిమాతో మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమాలో చివరి 30 నిమిషాలు అల్లు అర్జున్‌ (Allu Arjun)తో పోటీ పడి మరి నటించాడు. విలన్‌ షేడ్స్‌ ఉన్న ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌ పాత్రలో ఫహాద్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేము. ఆ స్థాయిలో ఆయన తన పాత్రపై ముద్ర వేశాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కావడంతో ఫహాద్‌కు నేషనల్‌ వైడ్‌గా క్రేజ్‌ వచ్చింది. ప్రస్తుతం అతడు వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఫహాద్‌ తాజాగా ఓ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. 

    ఫహాద్‌కు వచ్చిన వ్యాధి ఇదే!

    మలయాళ స్టార్ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌.. అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజార్డర్‌ (ADHD)అనే వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసిన ఫహాద్‌.. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. దీని వల్ల దేనిపైనా ఎక్కువ శ్రద్ద పెట్టలేకపోతున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు అతి ప్రవర్తన, తొందరగా ఆవేశపడటం వంటివి గమనించినట్లు చెప్పారు. తన సమస్య గురించి డాక్టర్‌ను అడిగినట్లు ఫహాద్‌ తెలిపాడు. 41 ఏళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు తెలుసుకుంటున్నట్లు వివరించాడు. 

    ADHD వ్యాధిని ఎలా గుర్తించాలి?

    ADHD రుగ్మత పిల్లల్లో చాలా సాధారణం. కానీ, పెద్దల్లో మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆజాగ్రత్తగా తప్పులు చేయడం, స్థిరంగా ఒక చోట కూర్చోలేకపోవడం, పరిగెత్తడం, గెంతడం, అతిగా మాట్లాడటం, తరచూ చేతులు కాళ్లు కదిలిస్తూ ఉండటం చెప్పిన విషయాలు మర్చిపోవడం, అర్థం చేసుకోలేకపోవడం,, ప్రతీ దానికి తొందరపడటం, ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా తీసుకోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతుంటారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. 

    ADHD వ్యాధి ఎలా వస్తుంది?

    ఒక వ్యక్తి ADHD వ్యాధి ఎలా వస్తుందని చెప్పడానికి నిర్దిష్ట కారణాలు ఏవీ లేవని వైద్యులు తెలిపారు. పూర్తి స్థాయి చికిత్స కూడా అందుబాటులో లేదు. ఇప్పటికీ దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రుగ్మతతో బాధపడే పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారుతుంటుంది. ఇటువంటి పిల్లలను నియంత్రించడానికి థెరపీ, కొన్ని మందులు అవసరం. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. అటు పెద్దలు కూడా ఇదే ఫార్మూలాను అనుసరించాల్సి ఉంటుందని సమాచారం. 

    కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌

    ఇటీవలే ‘ఆవేశం’ (Aavesham) సినిమాతో ఫహాద్‌ ఫాజిల్‌ సూపర్‌ హిట్‌ను అందుకున్నాడు. ఆ సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. జీతూ మాధవన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ. రూ.150 కోట్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది భారీ వసూళ్లు చేసిన మలయాళ చిత్రాల జాబితాలో నిలిచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. 

    ఫహాద్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌

    ప్రస్తుతం ఫహాద్‌.. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) లో నటిస్తున్నాడు. మొదటిభాగంతో పోలిస్తే రెండో పార్ట్‌లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య ఈ సీక్వెల్‌ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైంది. అలాగే తమిళంలో ‘మారీసన్‌’ (Maareesan), రజనీకాంత్‌తో ‘వట్టైయాన్‌’ (Vettaiyan) చిత్రంలో నటిస్తున్నాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version