Family Star OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘ఫ్యామిలీ స్టార్‌’.. జాతీయ స్థాయిలో నెం.1!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Family Star OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘ఫ్యామిలీ స్టార్‌’.. జాతీయ స్థాయిలో నెం.1!

    Family Star OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘ఫ్యామిలీ స్టార్‌’.. జాతీయ స్థాయిలో నెం.1!

    April 30, 2024

    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్‌ 5న థియేటర్లలో విడుదలై ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమై నిర్మాత దిల్‌రాజుకు నష్టాలను మిగిల్చింది. అంతేకాదు సోషల్‌ మీడియాలోనూ ఈ సినిమా పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురైంది. ముఖ్యంగా విజయ్‌ను అతడి యాంటీ ఫ్యాన్స్‌ టార్గెట్‌ చేయడంతో ‘ఫ్యామిలీ స్టార్’ చాలా నెగిటివిటీ మూటగట్టుకుంది. దీంతో నెల కూడా పూర్తవ్వకముందే ఓటీటీలోకి వచ్చేసింది. అయితే థియేటర్ల సంగతి ఎలా ఉన్న ఓటీటీలో మాత్రం ఈ చిత్రం దుమ్మురేపుతోంది. అత్యధిక వీక్షణలతో దూసుకుపోతోంది. 

    జాతీయస్థాయిలో ట్రెండింగ్‌..

    ఫ్యామిలీ స్టార్‌ చిత్రం.. ఏప్రిల్‌ 26 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) వేదికగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే తొలి రోజు నుంచే ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చింది. అయితే ఓటీటీలోకి వచ్చాక కూడా ఈ మూవీపై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ మెుదలయ్యాయి. అయినా కూడా ‘ఫ్యామిలీ స్టార్‌’ జోరుకు ఏ మాత్రం బ్రేకులు పడలేదు. అమెజాన్‌ నేషనల్‌ వైడ్‌ ట్రెండింగ్‌ లిస్ట్‌లో ప్రస్తుతం ఈ చిత్రం నెం.1 స్థానంలో కొనసాగుతోంది. హిందీ వెర్షన్ రాకుండానే జాతీయ స్థాయిలో ఈ సినిమా ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌, చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

    వరుస ఫ్లాప్స్‌తో సతమతం..

    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ గత కొంతకాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్నాడు. గీతా గోవిందం (2018) తర్వాత ఆ స్థాయి హిట్‌ ఇప్పటివరకూ విజయ్‌కు రాలేదు. నోటా (2018), డియర్ కామ్రెడ్ (2019), వరల్డ్ ఫేమస్ లవర్ (2020) తీవ్రంగా నిరాశపరిచాయి. లైగర్ (2022) సినిమాతో పాన్ ఇండియా రేంజ్‍లో గుర్తింపు వచ్చినా అది అల్ట్రా డిజాస్టర్ అయింది. గతేడాది ఖుషి (2023)ది అదే పరిస్థితి. ‘ఫ్యామిలీ స్టార్‌’తో నైనా హిట్‌ వస్తుందని భావించినప్పటికీ మళ్లీ విజయ్‌కు నిరాశే మిగిలింది. రూ.50కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ రూ.20 కోట్లలోపే వసూళ్లు రాబట్టి నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. 

    విజయ్‌ ఆశలన్నీ దానిపేనే!

    విజయ్ దేవరకొండ తన తర్వాతి చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో చేయనున్నాడు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తుండటంతో దీనిపై చాలా అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‍తో ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‍గా ఎంపికయ్యారని తెలుస్తోంది. అంతకుముందు హీరోయిన్‌గా ప్రేమలు ఫేమ్‌ మమితా బైజు (Mamitha Baiju) పేరు కూడా వినిపించింది. అయితే చివరకీ భాగ్యశ్రీని విజయ్‌కు జోడీగా ఫైనల్‌ చేసినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం విజయ్‌ ఆశలన్నీ ‘VD12’ పైనే ఉన్నాయి. విజయ్‌ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ రవికిరణ్ కోలాతో చేయనున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version