గగన్ యాన్ ప్రయోగం సక్సెస్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గగన్ యాన్ ప్రయోగం సక్సెస్

    గగన్ యాన్ ప్రయోగం సక్సెస్

    October 21, 2023

    Courtesy Twitter:

    ఇస్రో చేపట్టిన గగన్ యాన్ ప్రయోగం సక్సెస్ అయింది. రోదసి నుంచి గగన్ యాన్ మాడ్యూల్‌ను పారాచ్యూట్ సాయంతో విజయవంతంగా శాస్త్రవేత్తలు కిందకు దింపారు. అంతకుముందు రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం కాసేపు నిలిచిపోయింది. శాస్త్రవేత్తలు సరి చేయడంతో మరోసారి ఇస్రో గగన్ యాన్ ప్రయోగాన్ని చేపట్టింది. సరిగ్గా ఉ.10 గంటలకు TV-D1 సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నిప్పులు కక్కుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 8.30 గంటలకు శ్రీహరి కోట నుంచి ప్రయోగం మొదలు పెట్టగా… సాంకేతిక లోపంతో ప్రయోగం తాత్కాలికంగా నిలిచిపోయింది. అనంతరం మరో ప్రయోగ తేదీని ప్రకటిస్తామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఇంతలో సాంకేతిక లోపాన్ని సరి చేయడంతో తిరిగి ప్రయోగాన్ని చేపట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version