Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి సెన్సార్ బోర్డు తొలగించినవి ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి సెన్సార్ బోర్డు తొలగించినవి ఇవే!

    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి సెన్సార్ బోర్డు తొలగించినవి ఇవే!

    January 2, 2025

    మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా తమిళ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు స్టార్‌ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం మరో 8 రోజుల్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్‌ వర్క్ పూర్తయింది. యూ/ఏ సర్టిఫికేట్‌తో పాటు 165 నిమిషాల నిడివిని సెన్సార్ సభ్యులు ఫిక్స్‌ చేశారు. అయితే ఓ విషయంలో మాత్రం ‘గేమ్ ఛేంజర్‌’ టీమ్‌కు సెన్సార్ బోర్టు (Central Board of Film Certification) చురకలు అంటించినట్లు తెలుస్తోంది. 

    ఇంగ్లీషు టైటిల్‌పై మండిపాటు!

    గతంతో పోలిస్తే ఇటీవల సినిమా టైటిల్స్‌ విషయంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. తెలుగుకు బదులు పరభాష పదాలను తెలుగు టైటిల్స్‌గా ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా ‘గేమ్‌ ఛేంజర్‌’ సైతం తెలుగుకి బదులు ఇంగ్లీషు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనికి సంబంధించి సెన్సార్‌ సభ్యులు (Central Board of Film Certification).. మూవీ టీమ్‌కు చురకలు అంటించినట్లు తెలుస్తోంది. సినిమా మెుదట్లో టైటిల్ కార్డ్‌ను సైతం తెలుగు పదాల్లో ఇంగ్లీషు భాషలో ‘Game Changer’ పెట్టడాన్ని సెన్సార్‌ సభ్యులు తప్పుబట్టినట్లు సమాచారం. తెలుగులో కూడా పెట్టాలని వారు సూచించినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్‌ రిలీజ్‌కు ఇలా ఇంగ్లీషు టైటిల్‌తో రావడంపై ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో తెలుగులో ‘గేమ్‌ ఛేంజర్‌’ అంటూ పెట్టేందుకు చిత్ర బృందం అంగీకరించినట్లు టాక్ వినిపిస్తోంది.

    బ్రహ్మీకి షాక్‌..!

    చరణ్‌ – శంకర్ కాంబోలో రూపొందిన ‘గేమ్‌ ఛేంజర్‌’లో దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam) కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. దీంతో మూవీ టైటిల్స్‌ సందర్భంగా ఆయన పేరును ‘పద్మశ్రీ బ్రహ్మానందం’ అని టీమ్‌ ప్రెజెంట్‌ చేసినట్లు సమాచారం. ఇది చూసిన సెన్సార్‌ సభ్యులు పద్మశ్రీ పదాన్ని పేరుకు ముందు తొలగించాలని సూచించింది. కేంద్రం ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలను మూవీ టైటిల్స్‌ సందర్భంగా ప్రదర్శించకూడదని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయి. ‘దేనికైనా రెడీ’ సమయంలో బ్రహ్మీ పేరు ముందు పద్మశ్రీ పెట్టడంపై విమర్శలు వచ్చాయి. దీంతో ‘గేమ్ ఛేంజర్‌’ మూవీలో ఆ తప్పు రిపీట్‌ కాకుండా సెన్సార్ బోర్డు కత్తెర పెట్టింది. 

    మరిన్ని కత్తెరలు..

    తెలుగు టైటిల్‌, పద్మశ్రీ పదం తొలగింపుతో పాటు మరికొన్ని కత్తెరలు సైతం ‘గేమ్‌ ఛేంజర్‌’కు సెన్సార్‌ బోర్డు (Censor Board) విధించింది. కొన్ని సీన్లలో లిక్కర్‌ బ్రాండ్లను నేరుగా చూపించడాన్ని తప్పుబట్టింది. ఆయా లేబుల్స్‌ను తొలగించాలని చెప్పింది. అలాగే సినిమాలో ఎక్కువ సార్లు ఉన్న ‘చట్ట ప్రకారం’ పదాన్ని ‘లెక్క ప్రకారం’గా ఛేంజ్‌ చేయాలని సూచించింది. దీంతో పాటు కేరళ అనే పదాన్ని కూడా తొలిగించాలని చెప్పింది. ఓ పేపర్‌ కట్టింగ్‌ ఉన్న ‘దుర్గ శక్తి నాగ్‌పాల్’ పేరును ‘సుచిత్ర పాండే’గా మార్చాలని మూవీ టీమ్‌కు స్పష్టం చేసింది. ఇవి మినహా సినిమా విషయంలో సెన్సార్ బోర్డు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

    మరికొద్ది సేపట్లో ట్రైలర్ రిలీజ్‌..

    ‘గేమ్‌ ఛేంజర్‌’ ట్రైలర్‌ను మరికొద్ది సేపట్లో మూవీ టీమ్‌ రిలీజ్‌ చేయబోతోంది. ఇవాళ (జనవరి 2) సాయంత్రం 5:04 గం.లకు దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్‌ కానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమాలోని నాలుగు పాటలు విడుదలవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఎస్‌.జే. సూర్యతో పాటు సముద్రఖని, అంజలి, సునీల్‌, శ్రీకాంత్, నాజర్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version