మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గేమ్ ఛేంజర్’ టీమ్ మరో అదిరిపోయే ట్రీట్ ఫ్యాన్స్‌కు ఇచ్చింది. ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్‌గా అమేజింగ్ మెలోడీ సాంగ్ (Naanaa Hyraanaa)ను రిలీజ్ చేసింది. యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ మీకోసం.
Naanaa Hyraanaa Song Lyrics Telugu
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా… థిల్లానా దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా… థిల్లానా దిన్నా
నానా హైరానా
ప్రియమైనా హైరానా..
మొదలాయే నాలోనా..
లలనా నీ వలనా..
నానా హైరానా..
అరుదైన హైరానా..
నెమలీకల పులకింతై..
నా చెంపలు నిమిరేనా..
దానా దీనా ఈ వేళ.. నీలోనా.. నాలోనా..
కనివిననీ కలవరమే.. సుమ శరమా..
వందింతలయ్యే… నా అందం
Naanaa Hyraanaa Song Lyrics
నువ్వు నా పక్కన ఉంటే…
వజ్రంలా వెలిగాయి ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటే..
వెయ్యింతలాయే.. నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటే..
మంచోనవుతున్నా.. మరికొంచెం..
నువ్వు నా పక్కన ఉంటే..
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా… థిల్లానా దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా… థిల్లానా దిన్నా
ఎపుడు లేని… లేని వింతలు
ఇపుడే చూస్తున్నా..
గగనాలన్నీ.. పూల గొడుగులు
భువనాలన్నీ… పాల మడుగులు
కదిలే రంగుల భంగిమలై..
కనువిందాయే పవనములు
ఎవరు లేనే.. లేని దీవులు
నీకు.. నాకేనా…
రోమాలన్నీ.. నేడు
మన ప్రేమకు జెండాలాయే..
ఏం మాయో.. మరి ఏమో
నరనరమూ.. నైలు నదాయే..
తనువేలేనీ ప్రాణాలు.. తారాడే ప్రేమల్లో..
అనగనగా సమయములో… తొలి కథగా..
Naanaa Hyraanaa Song Lyrics
వందింతలయ్యే… నా అందం
నువ్వు నా పక్కన ఉంటే…
వజ్రంలా వెలిగాయి ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటే..
వెయ్యింతలాయే.. నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటే..
మంచోనవుతున్నా.. మరికొంచెం..
నువ్వు నా పక్కన ఉంటే..
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా… థిల్లానా దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా… థిల్లానా దిన్నా
Celebrities Featured Articles Political Figure
Revanth Reddy: టాలీవుడ్‌పై రేవంత్ సర్కార్ పగ? వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి?