తారక్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ (Devara) బాక్సాఫీస్ వద్ద సాలిడ్ విజయాన్ని అందుకుంది. వారం వ్యవధిలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం దిగ్విజయంగా థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ మూవీ సక్సెస్ తర్వాత తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘వార్ 2’ చిత్రం చేస్తున్న జూ.ఎన్టీఆర్ త్వరలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ‘NTR 31’ పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీపై అందరి దృష్టి ఉంది. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం తారక్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్ డైరెక్టర్‌తో ఆ మూవీ ఉండనున్నట్లు చర్చించుకుంటున్నారు.
‘జైలర్’ డైరెక్టర్‌తో పాన్ ఇండియా చిత్రం!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డాక్టర్, బీస్ట్ , జైలర్ వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో తారక్ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే తారక్‌కు నెల్సన్ కథ చెప్పారని అతి అతడికి బాగా నచ్చిందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో దీనిని తెరెకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీస్ట్, జైలర్ హిట్స్‌తో నెల్సన్ పేరు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగింది. ముఖ్యంగా జైలర్‌తో రజినీకాంత్‌ను చూపించి తీరు అందరిని మెప్పించింది. అటువంటి డైరెక్టర్‌తో తారక్‌కు సినిమా పడితే రికార్డులు గల్లంతేనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.
2026 వరకూ ఆగాల్సిందే!
తారక్ – నెల్సన్ దిలీప్ కుమార్ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చినా ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం తారక్ ‘వార్ 2’ (War 2) పెండింగ్ షూటింగ్‌తో పాటు త్వరలో ‘NTR 31’ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అటు నెల్సన్ సైతం ‘జైలర్ 2’ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. రజనీకాంత్ కూలీ సినిమా షూటింగ్ పూర్తికాగానే ‘జైలర్ 2’ షూటింగ్ మెుదలు కానుంది. ఇద్దరూ బిజీ షెడ్యూల్స్‌తో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు మరింత సమయం పట్టవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2026లో ఈ సినిమా పట్టాలెక్క వచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో మూవీ చేయడం తనకు ఓకే అంటూ ఓపెన్‌గా ఇటీవల తారక్ ఆఫర్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో కూడా ఓ మూవీ ఉండే అవకాశం లేకపోలేదు.
మా స్ట్రెంత్ అతడే: తారక్
‘దేవర’ బ్లాక్ బాస్టర్ నేపథ్యంలో శుక్రవారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తారక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కల్యాణ్ రామ్ బావమరిది (భార్య సోదరుడు) హరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘హరి ముందుకు ఎప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు. చాలా మంది అతన్ని సరిగా అర్ధం చేసుకోరు. ఎందుకంటే అతను ముందుకు వచ్చి తన గురించి చెప్పుకోడు. ఎవరేమి అన్నా, ఎవరేమి అనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌కి మూల స్థంభం హరి. నాకు, కళ్యాణ్ అన్నకి మా ఇద్దరికీ స్ట్రెంత్ హరి. ఇందులో ఎటువంటి డోకా ఉండదు. నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు. నచ్చని వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు’ అని తారక్ అన్నారు.
బంగ్లాదేశ్ రైతుగా జూ.ఎన్టీఆర్!
తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ బజ్ టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్ నీల్ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్ లెవల్లో ఉంటాయని ఫిల్మ్ వర్గాల సమాచారం.
హీరోయిన్ ఫిక్సయ్యిందా?
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని డైరెక్టర్ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.