యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ (Jr NTR).. ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood)లో బిజీ బిజీగా ఉన్నాడు. ముంబయిలో ‘వార్ 2’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. తారక్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను దర్శకుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలోనే ఉన్న తారక్.. నిన్న రాత్రి బాలీవుడ్ స్టార్ హీరోలతో హల్‌చల్ చేశాడు. వారితో కలిసి డిన్నర్‌కు వెళ్లిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ కల్చర్‌లోకి తారక్!
నైటౌట్లు, డిన్నర్ పార్టీలకు దూరంగా ఉండే తారక్.. ముంబయిలో ఈ నియమానికి చెక్ పెట్టినట్లు ఉన్నాడు. ఆదివారం రాత్రి.. తారక్ పూర్తిగా బాలీవుడ్ కల్చర్‌లోకి మారిపోయాడు. హిందీ స్టార్లు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt), వార్-2 హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), సబా ఆజాద్ (Sabha Ajad), కరణ్ జోహార్ (Karan Johar)లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్‌కు వెళ్లాడు. తారక్‌తో పాటు అతడి భార్య ప్రణతి కూడా ఈ పార్టీలో పాల్గొంది. స్టార్ హీరోలందర్నీ ఒక్కసారిగా బయట చూసి ముంబయి ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లు ఎగబడ్డారు. వారిని తమ కెమెరాల్లో బందించేందుకు ప్రయత్నించారు. అటు స్థానికులు సైతం తారక్‌తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
60 రోజుల కాల్ షీట్స్!
వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్, తారక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూట్ కోసం తారక్ 60 రోజులు కేటాయించినట్లు సమాచారం. కాగా, అంతకుముందు వచ్చిన వార్ చిత్రంలో హృతిక్‌తో పాటు మరో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించాడు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమాకు మించి ‘వార్ 2’ ఉండబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో తారక్ పాత్ర ఎలా ఉండబోతుందన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ, తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తాడని బయట రూమర్లు ఉన్నాయి.
తారక్ సీరియస్
ఇటీవల ముంబయిలోని ఓ హోటల్‌లో బస చేసేందుకు తారక్ వెళ్తుండగా బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లు అతడ్ని చుట్టుముట్టారు. ఎటువంటి అనుమతి లేకుండా కెమెరాల్లో తారక్‌ను బందించబోయారు. దీంతో తారక్‌కు కోపం చిర్రెత్తుకొచ్చింది. ‘ఓయ్..’ అంటూ ఒక్కసారిగా ఫొటోగ్రాఫర్లపై కసురుకున్నాడు. ఆ సమయంలో తారక్.. షార్ట్ హెయిర్‌తో వైట్ షర్ట్ కళ్లద్దాలు ధరించి ఉన్నాడు. అయితే ‘వార్ 2’లో తన లుక్‌ను రివీల్ చేయకుండా తారక్ జాగ్రత్తపడుతున్నాడు. అయినప్పటికీ ఆయనకు సంబంధించిన ఫొటోలు తరచూ బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తారక్ కెమెరాలకు చిక్కకుండా త్వరగా హోటల్లోకి వెళ్తుండగా వెంటపడి మరి ఫొటోలు తీయడంతో తారక్‌కు కోపం వచ్చింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!