మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మాక పాన్ ఇండియన్ చిత్రం కన్పప్ప. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ ఎంతో హైప్‌ను క్రియేట్ చేస్తోంది. గతవారం ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని మేకర్స్ కన్ఫామ్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటి వరకు ప్రభాస్ ఈ సినిమాలో ఏ పాత్రలో నటించనున్నాడన్నది సస్పెన్స్‌గా మారింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. మరోవైపు ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా ఉండేందుకు డబ్బు ఎంతైన ఖర్చు పెట్టేందుకు మేకర్స్ వెనకాడటం లేదు. ఈ సినిమాకు అంతర్జాతీయ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ సినిమాకు కెమెరామెన్‌గా ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ వంటి టెక్నిషియన్లు పనిచేస్తున్నారు. మెస్మరైజింగ్ విజువల్స్, దానికి తగిన కథ, స్క్రీన్‌ప్లేతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మోహన్ బాబు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్పను మంచు మోహన్ బాబు ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతంటే?
పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో భాగమైనప్పటి నుంచి ఓ క్రేజీ బజ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడు అని. అయితే దీనిపై తాజాగా ఓ స్పష్టత వచ్చింది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలిసింది. చాలా తక్కువ రోజులు ఈ చిత్రం కోసం ప్రభాస్ పనిచేస్తుండటంతో ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదని సమాచారం. మంచు విష్ణుతో ప్రభాస్‌కు చిన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా కారణమైంది. అయితే మంచు విష్ణు ప్రభాస్‌కు బిగ్ ఎమౌంట్ ఆఫర్ చేసినప్పటికీ… ప్రభాస్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది.
శరవేగంగా షూటింగ్
ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్పను మంచు విష్ణు అన్ని తానై షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ప్రతీ విషయంలోనూ ప్లాన్‌గా మందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 75శాతం వరకు పూర్తైనట్లు తెలిసింది. ప్రభాస్ రోల్ మీద ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని సమాచారం.గతేడాది నవంబర్‌లో మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. శివలింగం వైపు కన్నప్ప గెటప్‌లో విల్లు ఎక్కుపెట్టినట్లు మంచు విష్ణును ఈ పోస్టర్‌లో చూపించారు. నాస్తికుడైన యోధుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారడన్నది ఈ చిత్రంలో ప్రధాన కథగా చూపించనున్నారు.
టీజర్ డేట్ ఫిక్స్
కన్నప్ప నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీజర్ డేట్ ఫిక్సైంది. ఈ చిత్రం టీజర్‌ను మే 20న సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. అయితే టీజర్ విడుదల చేసే వేదికను ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు మార్చారు. ఈ చిత్రం టీజర్‌ను కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. దీంతో టీజర్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!