KGF 3: ‘కేజీఎఫ్‌ 3’లో తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌.. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ క్రేజీ డీల్‌! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • KGF 3: ‘కేజీఎఫ్‌ 3’లో తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌.. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ క్రేజీ డీల్‌! 

    KGF 3: ‘కేజీఎఫ్‌ 3’లో తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌.. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ క్రేజీ డీల్‌! 

    July 24, 2024

    కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్‌’ (KGF), ‘కేజీఎఫ్‌ 2’ (KGF 2) దేశవ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. కేజీఎఫ్‌ ముందు వరకూ పెద్దగా ఎవరికి తెలియని కన్నడ నటుడు యష్‌ (Yash), డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ఆ రెండు చిత్రాలతో స్టార్‌ సెలబ్రిటీలుగా మారిపోయారు. యష్‌ నటన, ప్రశాంత్‌ నీల్‌ పనితనంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. అయితే వీరి కాంబోలో ‘కేజీఎఫ్ 3’ ఉంటుందని గతంలోనే మేకర్స్‌ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ‘కేజీఎఫ్‌ 3’లో కోలివుడ్‌ సూపర్ స్టార్‌ అజిత్‌ కుమార్‌ నటించబోతున్నట్లు ఒక్కసారిగా ఊహాగానాలు మెుదలయ్యాయి. 

    ‘కేజీఎఫ్‌ 3’లో అజిత్‌!

    తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ (Ajith Kumar) కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నారు. ఇటీవలే ‘విదా ముయార్చి’ (Vidaamuyarchi) మూవీ షూట్‌ను పూర్తి చేసుకున్న అజిత్‌ మరో స్టార్‌ డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డైరెక్టర్‌ ఎవరో కాదు ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌. లేటెస్ట్ బజ్‌ ప్రకారం అజిత్‌తో కలిసి ప్రశాంత్‌ నీల్‌ రెండు చిత్రాలు తెరకెక్కించనున్నారు. అందులో ఒకటి విభిన్నమైన కథాంశం కలిగిన స్టాండలోన్‌ మూవీ కాగా, మరొకటి కేజీఎఫ్‌ యూనివర్స్‌కు లింకప్‌ చేసే కథ అని ప్రచారం జరుగుతోంది. దీంతో ‘కేజీఎఫ్‌ 3’ చిత్రంలో యష్‌తో పాటు అజిత్‌ కూడా కనిపించబోతున్నట్లు టాక్‌ మెుదలైంది. దీంతో కేజీఎఫ్‌ సిరీస్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. ‘కేజీఎఫ్‌ 3’ అన్ని రికార్డ్స్‌ను బ్రేక్‌ చేయడం ఖాయమని ఇప్పటినుంచే పోస్టులు పెడుతున్నారు. 

    టైమ్ పట్టనుందా?

    అజిత్‌, ప్రశాంత్‌ నీల్‌ చేతిలో ఇప్పటికే ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘విదా ముయార్చి’ తర్వాత అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly) అనే ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మంచనుండటం విశేషం. మరోవైపు ప్రశాంత్‌ నీల్‌ కూడా ఫుల్‌ బిజీగా ఉన్నారు. అతడి చేతిలో ఇప్పటికే ‘సలార్‌ 2‘ ప్రాజెక్ట్ ఉంది. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌తో ‘NTR 31’ అనే సినిమాను సైతం అనౌన్స్‌ చేశారు. ఆ రెండు చిత్రాల తర్వాత  అజిత్‌తో సినిమా పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. అటు కేజీఎఫ్‌ హీరో యష్‌ సైతం ‘టాక్సిక్‌’ (Toxic) అనే సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మెుదలైంది. ‘కేజీఎఫ్‌ 3’కి కీలకమైన ఈ ముగ్గురు బిజీ బిజీగా ఉండటంతో ఇప్పట్లో ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం లేదు.

    కలెక్షన్ల సునామీ

    యష్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్‌ చిత్రం 2018 డిసెంబర్‌ 21 విడుదలై సంచలనం సృష్టించింది. ట్రైలర్‌ నుంచి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం విడుదల అనంతరం వాటిని అందుకుంటూ వసూళ్లు సునామీ సృష్టించింది. ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కన్నడ ఇండస్ట్రీలో చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. ఆపై దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘కేజీఎఫ్‌ 2’ అంతకుమించి రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. వరల్డ్‌ వైడ్‌గా రూ.1,225–1,250 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాల్గో స్థానంలో నిలిచింది. దీంతో ‘కేజీఎఫ్‌ 3’పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version