LOVE TIPS:  అబ్బాయిల లవ్‌ ప్రపోజల్‌కు అమ్మాయిలు నో చెప్పడమెలా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • LOVE TIPS:  అబ్బాయిల లవ్‌ ప్రపోజల్‌కు అమ్మాయిలు నో చెప్పడమెలా?

    LOVE TIPS:  అబ్బాయిల లవ్‌ ప్రపోజల్‌కు అమ్మాయిలు నో చెప్పడమెలా?

    February 14, 2024

    ప్రేమ…  మనిషి మనసులో ఇది సృష్టించే అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. శరీరంలో ఇది చేేసేంత హార్మోన్ల విధ్వంసం ఇంకేదీ చేయదేమో. ఒకరి ప్రేమ కోసం ఆరాటపడేవారు కొందరు. ప్రేమ ఎలా చెప్పాలో తెలియక సతమతమయ్యేవారు కొందరు. తమకొచ్చిన లవ్ ప్రపోజల్‌ ఎలా తిరస్కరించాలో తెలియక తికమక పడేవారు మరికొందరు.

    ప్రేమను తెలియజేయడం కష్టమే. కానీ ఆ  ప్రేమను తిరస్కరించడం అంతకన్నా కష్టం. కాస్త తేడా కొట్టినా మనతో పాటు అవతలి వారి మనసు కూడా చివుక్కుమంటుంది. 

    మరి ఎవరి మనసూ కష్టపడకుండా…. ఓ అబ్బాయికి ‘నో’ చెప్పడమెలా? అందుకోసమే. ఇలాంటి సందర్భాల్లో తెలుగులో సుమతి పద్యమైన ‘నొప్పింపక తానొవ్వక’ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి పద్య వాక్యం మనకు దారి చూపిస్తుంది.

    సూటిగా సుత్తిలేకుండా

    ఒక అబ్బాయి మీకు ప్రపోజ్ చేసినపుడు సూటిగా నో చెప్పండి. సాగదీయడం, నాన్చుడు ధోరణి ఇద్దరికీ మంచిది కాదు. 

    సూటిగా చెప్పేందుకు ఇక్కడ కొన్ని వాఖ్యాలున్నాయి చూడండి.

    నాకు ఇంటరెస్ట్‌ లేదు

    ఇదొక చాలా సులువైన, ఎవరికీ ఇబ్బందిలేని మాట. అవతలి వారి మనసును నొప్పించకుండా నో చెప్పేందుకు ఇదొక మార్గం.

    వర్కవుట్‌ అవ్వదు

    మన దగ్గర లవ్ అంటే పెళ్లి ఆశలతోనే ముడిపడి ఉంటుంది. అది వర్కవుట్ కాదు అనుకున్నపుడు ముందే చెప్పేయండి. సంశయించొద్దు. వర్కవుట్ కాకపోవడానికి సరైన కారణం ఉంటే..ఇలా చెప్పొచ్చు.

    అలాగే కొన్ని మాటలు మీకు ‘నో’ అని చెప్పినంటే అనిపించినా అవతలి వారిలో ఆశలు పెంచవచ్చు. అలాంటి వాటికి దూరంగా ఉండండి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి చూద్దాం.

    “నాకు టైం కావాలి” 

    అప్పటికప్పుడు మీరు ఈ మాట చెప్పి తప్పించుకుని తర్వాత ఆలోచిద్దాంలే అనుకోవచ్చు. కానీ ఈ మాట అబ్బాయిలో సానుకూల ఆలోచన పెంచుతుంది. మీరు ఎస్ చెబుతారేమోనని ఎదురుచూస్తుంటాడు. ఒకవేళ ఈ మాట చెప్పినా వీలయినంత త్వరగా నో చెప్పండి.

    తర్వాత చెబుతా

    ఇది కూడా టైం కావాలని చెప్పడం  లాంటిదే. ముఖం మీదే చెప్పడం మీకు ఇబ్బంది అయినప్పుడు ‘తర్వాత’ అని తప్పించుకోవడం మంచిదేగానీ…వీలయినంత త్వరగా తనకు వేరే మార్గాల్లో అయినా నో చెప్పేయండి.

    కఠినంగా వద్దు

    సూటిగా నో చెప్పండి చాలు. అంతే గానీ వారి మనోభావాలు దెబ్బతీయొద్దు. ‘నీకంత సీన్‌ లేదు’ ‘ ఏం చూసి లవ్‌ చెయ్యాలి నిన్ను’ ఇలా బాధపెట్టే మాటలు వద్దు. అవతలి వారు సున్నిత మనస్కులైనా, లేదా తీవ్రమైన వ్యక్తి అయినా మీరు బాధపడే పరిస్థితులు రావొచ్చు.

    దోస్తీ

    ఒకవేళ అబ్బాయి మీకు ముందే తెలుసు, మంచివాడే కానీ అతడిపై ఆ ఉద్దేశం లేదనుకోండి. ఫ్రెండ్‌షిప్‌ ఆఫర్‌ చేయండి. క్లియర్‌గా నీపై నాకు ఆ ఉద్దేశం లేదు. స్నేహితులుగా ఉందామని చెప్పండి. ఒప్పుకునే అవకాశం ఎక్కువే.

    కానీ ఒకసారి స్నేహానికి ఒప్పుకున్న తర్వాత మీ మనసు మార్చుకోవద్దు. అతడు ఎన్ని మెసేజ్‌లు చేసినా, అతడిపై మీకు జాలి వేసినా మాట మర్చొద్దు. మీకు నిజంగా అతడిపై ప్రేమ కలిగింది అనిపిస్తే గతంలో మీరెందుకు నో చెప్పారో ఆలోచించండి.

    స్నేహితుడైతే

    కొన్నిసార్లు మీ స్నేహితుడే మీకు ప్రపోజ్‌ చేయొచ్చు. అతడిని మీరు అలా ఎన్నడూ చూసి ఉండకపోవచ్చు. అంతమాత్రాన నిర్దాక్షిణ్యంగా అతడి నంబర్‌ బ్లాక్‌ చేసి ఇక అతడిని ఓ శత్రువులా చూడొద్దు.

    ఆశలు పెంచొద్దు

    ఒక అబ్బాయి మీకు ప్రపోజ్ చేసినపుడు నచ్చలేదంటే నో చెప్పాలి అంతేగానీ భవిష్యత్‌లో ఆలోచిద్దాం అనే ధోరణి వద్దు. ఇది అతడికి ఆశలు పెంచడమే. మీకు భవిష్యత్‌లో కుదిరినా కుదరకపోయినా ఇప్పుడు yes చెప్పకూడదు అనుకుంటే no చెప్పడమే ఉత్తమం.

    ప్రేమలో ఉన్నా

    మీరు అప్పటికే వేరే అబ్బాయితే ప్రేమలో ఉంటే..సూటిగా అదే చెప్పండి. ఇలాంటప్పుడు పైన చెప్పిన ఏ జవాబు పనికిరాదు. ‘నేను ఇప్పటికే ప్రేమలో ఉన్నా’ అంటే ఏ అబ్బాయి అయినా అర్థం చేసుకుంటాడు.

    ఇవన్నీ కేవలం మీరు నో చెప్పడానికి కొన్ని సూచనలు మాత్రమే. అంతిమంగా మీకు ప్రపోజ్‌ చేసిన అబ్బాయి వ్యక్తిత్వం, వ్యవహారశైలిని బట్టి ఎలా చెబితే కరెక్టో మీకే తెలుస్తుంది. మీకు ఏది సరైనది అనిపిస్తుందో అదే చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version