టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ (Balakrishna), మహేష్‌బాబు (Mahesh Babu) ఒకరు. క్లాసీ లుక్స్‌తో మహేష్ ఫ్యాన్స్‌ను అలరిస్తే, బాలకృష్ణ తనదైన మాస్ డైలాగ్స్‌తో అభిమానులను ఉర్రూతలూగిస్తారు. అటువంటి ఈ ఇరువురు హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య, మహేష్ కాంబోలో మల్టీస్టారర్ అంటే ఆ ఊహే ఎంతో బాగుంది కదూ!. అయితే టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వ్యాఖ్యలను బట్టి ఈ మల్టీస్టారర్ త్వరలోనే సాధ్యమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఓ షోలో తమన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
థమన్ ఏమన్నారంటే?
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ ‘ఆహా’లో తెలుగు ఇండియన్ ఐడల్ (Indian Idol) సింగింగ్ షో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షో మూడవ సీజన్‌కు సంగీత దర్శకుడు తమన్ జడ్జిగా వ్యవహరిస్తుండగా సింగర్ శ్రీరామచంద్ర యాంకరింగ్ చేస్తున్నాడు. ఈ షో సెమీఫైనల్లో భాగంగా యాంకర్ శ్రీరామచంద్ర తమన్‌ను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ‘బాలకృష్ణ, మహేష్ బాబు ఇద్దరి సినిమాలకు ఒకేసారి మ్యూజిక్ డైరెక్షన్ చేసే అవకాశమొస్తే ఇద్దరిలో ఎవరి చిత్రానికి పని చేస్తారు?’ అని అడిగారు. దీనిపై తమన్ ఇచ్చిన సమాధానం టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారిపోయింది. బాలయ్య బాబు, మహేష్ బాబు కలిసి మల్టీసారర్ సినిమా చేస్తారని ఆ సినిమా కథ కూడా తాను విన్నానని చెప్పుకొచ్చాడు. దీనికి యాంకర్ శ్రీరామచంద్రతో పాటు ప్రేక్షకులంతా ఈలలు వేస్తూ గోల చేశారు.
రచ్చ చేస్తున్న ఫ్యాన్స్!
క్లాస్, మాస్ కాంబోలో మల్టీస్టారర్ రానున్నట్లు తమన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్, బాలయ్య కాంబోలో సినిమా వస్తే రికార్డులు చెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. గతంలో సూపర్ కృష్ణ (Super Star Krishna), ఎన్టీఆర్ (N T Rama Rao) కలిసి నటించిన విషయాన్ని నెట్టింట ప్రస్తావిస్తున్నారు. తిరిగి వారి కుమారులు కూడా కలిసి నటిస్తే చూడాలని ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే తమన్ ఈ వ్యాక్యలు సరదాగా చేశారా? లేదా నిజంగానే అందులో వాస్తవముందా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ గురించి ప్రేక్షకుల ఊహలే తప్ప సినిమా కథ, దర్శకత్వం లాంటి వాటి గురించి ఇప్పటివరకూ ఎక్కడా ఎలాంటి సమాచారం లేదు. కానీ ఇదే నిజమైతే స్పీకర్లే కాదు బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమని ఇరు హీరోల అభిమానులు చెబుతున్నారు.
ఒకవేళ ఉన్నా.. ఇప్పట్లో లేనట్టే!
‘గుంటూరు కారం’ తర్వాత మహేష్ తన తర్వాతి చిత్రాన్ని దర్శకుధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో కనీసం ఇంకో మూడేళ్లు మహేశ్ మరే మూవీ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బాలయ్యతో కలిసి ఇప్పట్లో మూవీ చేసే ఛాన్స్ లేనట్టే. ఒకవేళ నిజంగానే ఆ కథ ఉండి.. ఆ ఇద్దరూ ఓకే చెప్పినా ఈ మూవీ పట్టాలెక్కేందుకు నాలుగు సంవత్సరాలైనా పడుతుంది. ఇక రాజమౌళి సినిమా కోసం మహేష్ తన లుక్‌ను సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే జుట్టు, గడ్డం భారీగా పెంచేశారు. గ్లోబల్ రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందనుంది.
బాలయ్య బిజీ బిజీ
బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బాబీ కొల్లితో ఓ యాక్షన్ ప్యాక్డ్ మూవీ (NBK 109) చేస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ లేదా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ మూవీకి థమనే సంగీతం అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు బాబీ డియోల్ (Bobby Deol), ఉర్వశి రౌతేలా (Urvashi Rautela) కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూ బాలయ్య బిజీ బిజీగా ఉన్నారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?